India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలింగ్ రోజు ఈవీఎంల పనితీరుపై సమస్యలు తలెత్తకుండా సంపూర్ణ శిక్షణ పొంది పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులకు శిక్షణ నివ్వాలని జిల్లా స్థాయి మాస్టర్లను మాస్టర్ ట్రైనర్లను జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ హాలులో ఈవీఎంల పనితీరుపై జిల్లా, అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్, సెక్టోరల్ అధికారులకు శిక్షణ ఇచ్చారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. పత్తికొండ సబ్ డివిజన్, రాతన, తుగ్గలి, జొన్నగిరి గ్రామాలలో కవాతు నిర్వహించారు. పత్తికొండ రూరల్ సీఐ వై.ప్రవీణ్ కుమార్ రెడ్డి, తుగ్గలి SI బి.మల్లికార్జున, జొన్నగిరి ఎస్సై రామాంజనేయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో కూడా నిర్వహించారన్నారు.
ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటే క్రిమినల్ కేసులో నమోదు చేయాలని కలెక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చి 4 రోజులు గడిచినా ఎన్నికల కోడ్‌కు సంబంధించి ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయన్నారు. పోస్టర్స్, హోర్డింగ్స్, బ్యానర్స్ ఈపాటికే తీసేసి ఉండాల్సిందన్నారు. ఇప్పటికి తీసేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోలింగ్ జరిగే మే 13న అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసే వారికి ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. విద్యుత్, BSNL, పోస్టల్, టెలిగ్రామ్, దూరదర్శన్, AIR, స్టేట్ మిల్క్ యూనియన్, పాల సహకార సంఘాలు, హెల్త్, ఫుడ్ కార్పొరేషన్, RTC, అగ్నిమాపక, పోలీసులు, అంబులెన్స్, షిప్పింగ్, సమాచార, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది, కవరేజీ కోసం లెటర్లు పొందిన జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉంది.
కోడుమూరు నియోజవకర్గానికి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో TDP ఒక్కసారి మాత్రమే గెలిచింది. 1962లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పీఆర్ రావుపై కాంగ్రెస్ అభ్యర్థి డీ.సంజీవయ్య విజయం సాధించారు. మొత్తం 8సార్లు కాంగ్రెస్ విజయం సాధిస్తే.. 1983లో తొలిసారి బరిలో నిలిచిన TDP పరాజయం పాలైంది. 1985లో TDP అభ్యర్థి ఎం.శిఖామణి మాత్రమే విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో గెలుస్తుందో లేదో కామెంట్ చేయండి.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని కర్నూలు కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. సీ విజిల్ ఫిర్యాదులను 100% పరిష్కరించాలని సూచించారు. గురువారం ఆర్వోలు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి 4 రోజులు గడిచినా ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని, వీటిపై అధికారులు దృష్టి సారించాలని చెప్పారు.
నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డికి ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(CEO) ముఖేశ్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సాయంత్రం 4గం.లోపు తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలన్నారు. రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలను ఎందుకు నియంత్రించలేదని..? విచారణలో ఏం తేలింది.? అనే అంశాలపై వివరణ ఇవ్వాలని ఎస్పీని CEO ముఖేశ్ కుమార్ మీనా ఆదేశించారు. ఎస్పీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని CEO తెలిపారు.
మంత్రాలయం మండలం చెట్నేహళ్లి చెందిన ఓ మైనర్(17) అదే గ్రామానికి చెందిన టైలర్‌గా పనిచేస్తున్న శివ ప్రేమించుకున్నారు. కులాలు వేరవడంతో పెద్దలు పెళ్లికి నిరాకరించారు. దీంతో 18న సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయారు. కోసిగి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేశారు.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీవీ మోహన్ రెడ్డిది ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు. నియోజకర్గంలో 8సార్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అందులో 1983 నుంచి 1999 వరకు వరుసగా 5సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 నుంచి 2012 వరకు వరుసగా చెన్నకేశ్వరెడ్డి చేతిలో 3సార్లు ఓటమిపాలయ్యారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర గౌడ్‌పై 28904 అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన రికార్డు ఉంది.
జిల్లాలో జరగుతున్న పదో తరగతి పరీక్షల్లో 588 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో శ్యాముల్ బుధవారం తెలిపారు. ఆంగ్ల పరీక్షకు మొత్తం 31,465 మందికి గాను 30,878 మంది విద్యార్థులు పరీక్ష రాసారని తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదన్నారు. అలాగే సార్వత్రిక విద్యలో పదో తరగతి పరీక్షకు 964 మందికి గాను 891 మంది పరీక్ష రాసినట్లు 73 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.