Kurnool

News July 12, 2024

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి జిల్లాలోని బీడి, సున్నపురాయి, డోలమైట్ గని కార్మికుల పిల్లలకు కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని బీడి కార్మిక సంక్షేమ నిధి వైద్యశాఖ అధికారి డాక్టర్ కిషోర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్మికుల పిల్లలు ఆన్లైన్లో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులు అక్టోబరు 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 12, 2024

32,255 మంది కౌలు రైతులకు CCRC కార్డులు పంపిణీ చేయాలి: జేసీ

image

కర్నూలు జిల్లాలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ ద్వారా కౌలు రైతులకు సకాలంలో CCRC కార్డులు పంపిణీ చేయాలని JC నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. జిల్లాకు 22 వేల మంది కౌలుదారులకు CCRC కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందన్నారు. అయితే జిల్లాలో ఆ సంఖ్యను 32,255కు పెంచామని తెలిపారు.

News July 12, 2024

మంత్రి లోకేశ్‌ను కలిసిన పత్తికొండ ఎమ్మెల్యే

image

మంత్రి నారా లోకేశ్‌ను టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు తిక్కారెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ గురువారం కలిశారు. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం నియోజకవర్గంలో జరిగిన పరిణామాలను లోకేశ్‌కు వివరించారు. టీడీపీ నాయకుడి హత్య అనంతరం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారాయుడుకు వైసీపీ నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని శ్యామ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

News July 12, 2024

నందికొట్కూరు నియోజకవర్గంలో నేడు విద్యాసంస్థల బంద్

image

పగిడ్యాల మండలంలో బాలిక హత్యాచార ఘటనకు నిరసనగా ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. బాలిక కుటుంబానికి న్యాయం జరగడానికి ప్రతి ఒక్కరూ బంద్‌కు కలిసి రావాలని అన్నారు.

News July 12, 2024

ఉపాధి పనులు కల్పించడంలో కర్నూలు జిల్లా వెనుకబడి ఉంది:కలెక్టర్

image

ఉపాధి పనులు కల్పించడంలో కర్నూలు జిల్లా వెనుకబడి ఉందని కర్నూలు కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. అర్హులైన పేదలందరికీ పనులు కల్పించాలని డ్వామా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, ఉపాధి హామీ పథకం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

News July 11, 2024

నందికొట్కూరు పోలీస్‌స్టేషన్ ఎదుట వాసంతి బంధువుల నిరసన

image

చిన్నారి వాసంతి తల్లిదండ్రులు, బంధువులు నందికొట్కూరు పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టారు. ఇంతవరకు చిన్నారి ఆచూకీ దొరకలేదని బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. తమ పాపకు జరిగిన ఘటన వేరొకరికి జరగకూడదని కోరారు. వాసంతిని అత్యాచారం చేసి హతమార్చిన మైనర్ బాలురులకు ఎన్‌కౌంటర్ చేయాలని కోరారు.

News July 11, 2024

కర్నూలు రేంజ్ డీఐజీగా కోయ ప్రవీణ్

image

కర్నూలు రేంజ్ డీఐజీగా కోయ ప్రవీణ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీఐజీగా ఉన్న సీహెచ్ విజయరావును తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు విజయవాడలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో రిపోర్ట్ చేయవలసిందిగా ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు.

News July 11, 2024

బాలుడి చికిత్సకు ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది: కర్నూలు కలెక్టర్

image

విద్యుదాఘాతంతో గాయపడిన హుసేని వైద్యచికిత్సకు అయ్యే ఖర్చులను మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన అంగన్వాడీ హెల్పర్, విద్యుత్ లైన్‌మెన్, సీడీపీఓ, సూపర్వైజర్లకు షోకాజ్ మెమో జారీ చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.

News July 11, 2024

కర్నూలు: రోకలి బండతో బాది తల్లిని చంపిన కొడుకు

image

పాణ్యం మండలం వడ్డుగండ్ల గ్రామంలో కన్న కొడుకే తల్లిని కడతేర్చిన ఘటన గురువారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మహేశ్ అనే వ్యక్తి కొంతకాలంగా మద్యానికి బానిసై మతిస్తిమితం కోల్పోయాడు. ఈ క్రమంలో గురువారం తల్లి నాగలక్ష్మమ్మ(58)ను రోకలితో తలపై బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పాణ్యం సీఐ నల్లప్ప, ఎస్సై అశోక్ ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

News July 11, 2024

మున్సిపల్ కమిషనర్‌పై నంద్యాల JC ఆగ్రహం

image

నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిపై జాయింట్ కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు వివాదంలో ఉన్న రైతు బజార్ పక్కన గల స్థలంలో కాంపౌండ్ వాల్ తొలగించడాన్ని JC సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై కమిషనర్‌ను JC ప్రశ్నించగా ఆయన పొంతన లేని సమాధానం చెప్పారు. దీంతో కమిషనర్‌పై JC మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.