India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ITI కాలేజీల్లో వివిధ ట్రేడ్‌లలో రెండో విడత ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ITI కాలేజీల జిల్లా కన్వీనర్ కృష్ణమోహన్ తెలిపారు. ఈనెల 24వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి 25న సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా తపాలా కార్యాలయంలో కోఆపరేటివ్ ఎన్నికల కోలాహలం మొదలైంది. అభ్యర్థులు విజయం కోసం ప్రచారం ముమ్మరం చేశారు. జులై 14న కోఆపరేటివ్‌లో సభ్యులంతా కలిసి ఓటింగ్‌లో పాల్గొని డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఉమ్మడి జిల్లాలో 746 మంది సభ్యులకు ఓటు హక్కు ఉంది. 9 డైరెక్టర్ల పదవులకు 32 మంది తలపడుతున్నారు. 14న పోలింగ్, సాయంత్రం లెక్కింపు, అదేరోజు రాత్రికి ఫలితాలను ప్రకటిస్తారు.
నంద్యాలలోని పద్మావతి నగర్ రైతు బజార్‌లో నాణ్యమైన కర్నూలు సోనా బియ్యం, సార్టెక్స్ కందిపప్పు ప్రత్యేక విక్రయ కేంద్రాలను కలెక్టర్ రాజకుమారి గురువారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కందిపప్పు, బియ్యం సరఫరా చేయాలని సంంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
పోలీసులు YCP ముసుగులు తీసేసి ప్రజలకు సేవ చేయాలని MP బైరెడ్డి శబరి హెచ్చరించారు. ముచ్చుమర్రి వద్ద ఎత్తిపోతల పథకం పంపుహౌస్ సమీపంలో బాలిక ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపును ఎంపీ బైరెడ్డి శబరి పరిశీలించి మాట్లాడారు. పాప ఆచూకీ గుర్తించాలని చెప్పడంతో పోలీసులు విచారణ చేపట్టారని, లేదంటే మామూలు కేసు నమోదు చేసి వదిలేసేవారన్నారు. ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే సెలవుల్లో వెళ్లిపోవచ్చని సూచించారు.
నంద్యాల జిల్లాలోని మహానంది, రుద్రవరం మండలాల్లో కొంతకాలంగా చిరుత పులి సంచారంతో బెంబేలెత్తిన జనాలకు.. ఇప్పుడు పెద్దపులి భయం పట్టుకుంది. బుధవారం రుద్రవరం మండలం చెలిమ ఫారెస్టు రేంజ్‌లోని కోటకొండ పొలాల్లో పెద్దపులి సంచరించినట్లు రైతులు గుర్తించారు. పెద్దపులి పాదముద్రలు స్పష్టంగా కనిపించాయి. దీంతో రైతులు వ్యవసాయ పనులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోందని అన్నారు.
పగిడ్యాల మండలం ఎల్లాలలో అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. నిన్న చీకటిపడే వరకు గాలించినా ఫలితం లేదు. పోలీసులు ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకుని విచారించారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి, హత్యచేసి హంద్రీనీవా కాలువలో పడేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. వారిని గట్టిగా ప్రశ్నించడంతో పంపుహౌస్ సమీపంలో పడేసినట్లు చెప్పడంతో ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు.
కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 19న జెడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈఓ జీ.నాసర రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, కలెక్టర్లు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలు హాజరవుతారన్నారు.
ఈ నెల 15న ఔట్‌డోర్ స్టేడియంలో జిల్లాస్థాయి సీనియర్స్ సాప్ట్ బాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం కార్యదర్శి విజయ్ కుమార్ బుధవారం తెలిపారు. జిల్లా స్థాయిలో క్రీడా నైపుణ్యాలను కనబరచిన వారు ఆగస్టు నెలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 4 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావచ్చని వెల్లడించారు.
టీడీపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సొంత గ్రామమైన బనగానపల్లె మండలం యనకండ్లలో గుర్తుతెలియని వ్యక్తులు వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. చేయి విరగ్గొట్టి, ముఖానికి తారు పూశారు. బత్తులూరులో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఏర్పాటు చేసిన మినరల్ వాటర్‌కు వైఎస్ జగన్, ఎమ్మెల్యే రామిరెడ్డి ఫొటోలకు బ్లాక్ రంగుతో శిలాఫలకాలు నాశనం చేశారు.
వర్షాభావం వల్ల తుంగభద్ర నది ఎడారిగా మారింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం నదిచాగి పంచాయతీ పరిధిలో తుంగభద్ర నది ఆంధ్రలో ప్రవేశిస్తుంది. వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటివరకు నదిలో నీళ్లు లేక ఎడారిగా మారింది. నది తీరాన ఉన్న రైతులు వరి సాగు కోసం నారుమళ్లు వేసి నీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఆనకట్ట పైభాగాన వర్షాభావంతో నీటి నిల్వ గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణమని డ్యాం అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.