Kurnool

News July 10, 2024

నంద్యాల: గుండెపోటుతో ఉద్యోగి మృతి

image

నంద్యాల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కాకర్ల వెంకట రామారావు గుండెపోటుతో మృతిచెందారు. ఇవాళ ఉదయం తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలారు. ఆసుపత్రికి తీసుకు వెళ్లగా అప్పటికే చనిపోయారు. వీరి స్వస్థలం గిద్దలూరు మండలం రాజుపేట గ్రామం. చిన్న వయసులోనే ఆయన మృతిచెందారని పలువురు ఉద్యోగులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం రాజుపేట గ్రామంలో జరుగుతాయని బంధువులు వెల్లడించారు.

News July 10, 2024

కర్నూలు జిల్లాలో తొమ్మిది మందిపై వేటుకు రంగం సిద్ధం!

image

కర్నూలు జిల్లాలోని అటవీ శాఖ పరిధిలో తొమ్మిది మంది ఉద్యోగులు, అధికారులపై వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. జిల్లాలోని పర్యావరణ విధ్వంసంపై అటవీశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తన పరిధిలోని నలుగురికి డీఎఫ్‌వో ఛార్జిమెమోలు జారీ చేశారు. అటవీ ప్రాంతాన్ని పరిరక్షించడంలో పలువురు ఉద్యోగులు నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు సమాచారం. దీంతో మొత్తంగా తొమ్మిది మందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే అవకాశముంది.

News July 10, 2024

కోడుమూరు మండలంలో గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి

image

కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని వర్కూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అచ్చిరెడ్డిగారి ఈశ్వరరెడ్డి (55) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. మధ్యాహ్నం ఇంట్లో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఈశ్వరరెడ్డి మృతిపై మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, కోట్ల హర్షవర్దన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News July 10, 2024

హిజ్రాను మోసం చేసిన కర్నూల్ జిల్లా యువకుడు

image

కర్నూల్ జిల్లా యువకుడు హిజ్రాను మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. హైదరాబాద్‌ నగరానికి చెందిన హిజ్రా హసీనా గౌడ్‌తో ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన గణేశ్ కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తీరా మోసం చేయడంతో హసీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌ తరలించారు.

News July 10, 2024

కోడుమూరు మండలంలో గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి

image

కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని వర్కూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అచ్చిరెడ్డిగారి ఈశ్వరరెడ్డి (55) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. మధ్యాహ్నం ఇంట్లో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఈశ్వరరెడ్డి మృతిపై మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, కోట్ల హర్షవర్దన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News July 10, 2024

ఉన్నత విద్యకు 10వ తరగతి తొలి మెట్టు: నంద్యాల కలెక్టర్

image

ఉన్నత విద్యకు పదవ తరగతి తొలి మెట్టు అని, ప్రతి విద్యార్థి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలోని శ్రీ దామోదరం సంజీవయ్య స్మారక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులను కలెక్టర్ కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానం తెలుసుకున్నారు.

News July 10, 2024

రైతు నష్టపోకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోండి: నంద్యాల కలెక్టర్

image

ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఇబ్బంది లేకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయడంతో పాటు నకిలీ విత్తనాల అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ జి.రాజకుమారి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రగతిపై సంబంధిత అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

News July 9, 2024

మహానంది: యువకుడిపై చిరుత దాడి

image

మహానంది గ్రామ సమీపంలోని ఈశ్వర్ నగర్ కాలనీ వద్ద గిరిజనుడు నాగన్నపై చిరుతపులి దాడి చేసింది. మంగళవారం సాయంకాలం బహిర్భూమికి వెళ్లిన నాగన్నపై చిరుత దాడి చేయడంతో చాకచ్యకంగా తప్పించుకుని పారిపోయి వచ్చాడు. మీదకు దూకడంతో గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గిరిజనులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. 

News July 9, 2024

నంద్యాల: రైతు బజార్లలో కంది పప్పు, బియ్యం కౌంటర్లు

image

నిత్యావసర సరుకులైన కంది పప్పు, బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతుబజార్లలో కౌంటర్లు ఏర్పాటుచేసి ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే విక్రయించాలని అధికారులను జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం రైస్ మిల్లర్లతో ధరల పెరుగుదలపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కందిపప్పు రూ. 160, సోనా మసూరి బియ్యం(ఫైన్) రూ.49, మసూరి బియ్యం(RAW) రూ.48గా నిర్ణయించినట్లు తెలిపారు.

News July 9, 2024

ఆర్జేడీగా బాధ్యతలు స్వీకరించిన కర్నూలు డీఈవో

image

కర్నూలులోని డీఈవో కార్యాలయంలో రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ-కడప)గా కర్నూలు విద్యాశాఖ అధికారి శామ్యూల్
మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలనుసారం రీజినల్ జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించాలని అన్నారు. పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.