India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కే.శామ్యూల్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అర్హులైన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కనీసం 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న వారు ఈనెల 13వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. వీరి భేటీలో ఏపీ నుంచి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేశ్ పాల్గొననున్నట్లు సమాచారం. వీరితో పాటు ఏపీ సీఎస్, ఆర్థిక, ఇతర శాఖల కార్యదర్శులు వెళ్లనున్నారు. చర్చలకు సంబంధించి ఇరు ప్రభుత్వాలు ఇప్పటికే 10 అంశాలను సిద్ధం చేసుకున్నాయి.
కర్నూలు నగర పాలక సంస్థకు చెందిన దుకాణాలను లీజుకు తీసుకుని, అద్దె చెల్లించని షాపులపై నగరపాలక రెవెన్యూ అధికారులు శుక్రవారం కొరడా ఝుళిపిస్తున్నారు. 3 నెలలుగా బకాయిలు చెల్లించని షాపులను సీజ్ చేస్తున్నారు. కమిషనర్ ఏ.భార్గవ్ తేజ ఆదేశాలతో నగరపాలక రెవెన్యూ అధికారులు రెండో రోజు స్పెషల్ డ్రైవ్ కొనసాగించారు. నేడు రూ.12,26,261ను వసూలు చేసినట్లు కమిషనర్ తెలిపారు.
నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మున్సిపల్ ఛైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు 12 మంది కౌన్సిలర్లు శుక్రవారం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బైరెడ్డి మాట్లాడుతూ.. ఎవరి బెదిరింపులకూ భయపడవద్దని, అందరం కలిసి పేదల అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
మంత్రాలయం మండలం సుగూరు గ్రామంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతిచెందాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన మంత్రిగాండ్ అనే వ్యక్తి బోర్ వెల్ లారీలో దినసరి కూలీగా పనిచేసేవాడు. పని ముగించుకుని అదే లారీపై తిరుగు ప్రయాణమయ్యారు. అకస్మాత్తుగా పైకి లేవడంతో పైన ఉన్న సర్వీస్ వైర్లు తగిలి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు ఎస్సై గోపీనాథ్ తెలిపారు.
కర్నూలులో జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు రేపు నిర్వహించేందుకు పాలకవర్గం సిద్ధమైంది. ఈ సమావేశాలకు ఇప్పటికీ ఎమ్మెల్యేలకు సమాచారం అందకపోవడం గమనార్హం. జడ్పీ పాలక వర్గంలో ఛైర్మన్‌తో పాటు 52 మంది జడ్పీటీసీ సభ్యులు వైసీపీకి చెందిన వారే. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ఎక్కువ మంది గెలిచారు. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు లేకుండా జడ్పీ సమావేశాలు ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లక్ష్యాలను సాధించడంలో అలసత్వం వహించిన 78 మంది ఉపాధి అధికారులు, సిబ్బందికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అమరనాథరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎమ్మిగనూరు, కర్నూలు, ఆదోని అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్లు, 10 మండలాల ఏపీవోలు, ఈసీలు, దాదాపు అన్ని మండలాల్లోని పలువురు సాంకేతిక సహాయకులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
బాలికపై లైంగిక వేధింపుల కేసులో కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే డా.సుధాకర్ అరెస్టైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. నిందితుడిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 376తో పాటు బాధితురాలు మైనర్ కావడంతో పోక్సో చట్టం సెక్షన్ 6 రెడ్‌విత్ 5(ఎల్) కింద కర్నూల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సుధాకర్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో జిల్లా కారాగారానికి తరలించారు.
బాలికపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే డా.సుధాకర్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మూడేళ్లుగా తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు నిన్న కర్నూలు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి ప్రొహిబిషన్, ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఎం.సరోజనమ్మ 14 రోజుల రిమాండ్ విధించడంతో సుధాకర్‌ను జిల్లా కారాగారానికి తరలించారు.
ఇప్పటికీ బడికి వెళ్లకుండా బడి బయట ఉన్న పిల్లలను వెంటనే గుర్తించాలని పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ రాఘవరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కర్నూలుకు వచ్చిన ఆయన విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును గతేడాది కంటే పెంచాలని సూచించారు. విద్యా కానుక కిట్ల పంపిణీ 100% పూర్తి చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.