India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టుల పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జలవనరులు, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆలూరు బ్రాంచ్ కెనాల్, కేసీ కెనాల్, హంద్రీ నీవా, గాజుల దిన్నె ప్రాజెక్ట్, వేదవతి, ఆర్డీఎస్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజి వివరాలు తెలుసుకున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,645 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇందులో ఎస్ఓటీ పోస్టులు 1,731 వరకు ఖాళీలు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ 84, సెకండ్ లాంగ్వేజ్ 113, ఎస్ఏ ఇంగ్లీషు 61, ఎస్ఏ గణితం 89, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 63, ఎస్ఏ బయోలాజికల్ సైన్స్ 61, ఎస్ఏ సోషల్ స్టడీస్ 78, ఎస్ఏ పీఈటీ 211 పోస్టుల ఖాళీలు ఉన్నాయి. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది.
డీఎస్సీలో భాగంగా జిల్లాలో 2,645 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గతేడాది 62 శాతం మాత్రమే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ ఏడాది ప్రతి విద్యార్థి పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రణాళికను అమలు చేయాలన్నారు.
ఆదోని మండల పరిషత్ అధ్యక్షురాలు బడాయి దానమ్మ వైసీపీని వీడి బీజేపీలో చేరారు. ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే పార్థసారథి కండువా కప్పి ఆహ్వానించారు. ఆమెతో పాటు కౌన్సిలర్లు లలితమ్మ, చిన్న, పద్మావతి, పలువురు సర్పంచులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ నుంచి చేరికలు మొదలయ్యాయని, ఆదోనిలో ఆ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమని ఎమ్మెల్యే అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి సూచించారు.
కేజీబీవీలో చదువుతున్న విద్యార్థినులకు వడ్డిస్తున్న భోజనంలో రాజీపడొద్దని, నాణ్యంగా అందించాలని కర్నూలు డీఈవో శామ్యూల్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న సమగ్రశిక్షా కార్యాలయంలో కేజీబీవీ ఎస్ఓలతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పదో తరగతిలో ఉత్తీర్ణత పెంచేందుకు ప్రతి ఎస్ఓ ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో ఏమైనా సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.
డీఎస్సీలో భాగంగా జిల్లాలో 2,645 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గతేడాది 62 శాతం మాత్రమే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారన్నారు. ఈ ఏడాది ప్రతి విద్యార్థి పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రణాళికను అమలు చేయాలన్నారు.
నంద్యాల జిల్లా కలెక్టర్‌గా డా.కే.శ్రీనివాసులు జిల్లాలో తనదైన మార్క్ వేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 5 నెలల పాటు జిల్లాకు సేవలందించారు. కలెక్టర్ హోదాలో ఆయనకు నంద్యాల తొలి పోస్టింగ్ కాగా.. జిల్లా రెండో కలెక్టర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలను ఆయన సమర్థవంతంగా నడిపించారు. జూలై 1న పింఛన్ల పంపిణీలో ఆయన కీలకంగా వ్యవహరించారు.
విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడు మంగళవారం ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందారు. ఆత్మకూరులో నివాసముంటున్న జీ.నాగలక్ష్మయ్య(58) కొత్తపల్లి మండలం కొత్తమాడుగుల ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. భోజన విరామ సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న నాగలక్ష్మయ్యను తోటి ఉపాధ్యాయులు ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
నంద్యాలలోని మూలసాగరం రైల్వే గేటు వద్ద బుధవారం ఉదయం రైలు నుంచి జారి పడి ఇద్దరు మృతి చెందారు. ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. కర్నూలు నుంచి వస్తున్న ఒంగోలు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బ్రాహ్మణకొట్కూరు సమీపంలో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రవి(35) చెందాడు. ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.