India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడు ఒక్కసారిగా కుప్పకూలి మంగళవారం మృతిచెందారు. ఆత్మకూరులో నివాసముంటున్న జీ.నాగలక్ష్మయ్య(58) కొత్తపల్లి మండలం కొత్తమాడుగుల ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. భోజన విరామ సమయంలో ఉన్నఫళంగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఉపాధ్యాయుడిని తోటి ఉపాధ్యాయులు ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కర్నూలు జిల్లాలో నివాసం ఉంటున్న హిజ్రాలకు ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా తెలిపారు. ఇప్పటి వరకు వాటిని పొందని వారు http://transgender.dosje.gov.inలో ఆధార్ కార్డు, నోటరీ అఫిడవిట్ పొందుపరిస్తే కలెక్టర్ ద్వారా ధ్రువపత్రాలు, గుర్తింపు కార్డులను అందిస్తామన్నారు.
నంద్యాల జిల్లా నూతన కలెక్టర్‌గా బీ.రాజకుమారి నియమితులయ్యారు. శ్రీకాకుళం (D) టెక్కలి మండలం కొల్లివలస ఆమె స్వస్థలం. 2009 గ్రూప్-1 అధికారి అయిన ఈమె విజయనగరం ఆర్డీవోగా ఎంపికయ్యారు. 2013లో సింహాచలం దేవస్థానం స్పెషల్ డీసీగా, 2017లో తూ.గోలో డ్వామా పీడీగా, 2019లో అదే జిల్లాకు JC(వెల్ఫేర్)గా పని చేశారు. 2021లో IAS హోదా పొందారు. ప్రస్తుతం గుంటూరు JCగా ఉన్న ఈమె నంద్యాల కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
ఓర్వకల్లులో సాగిన పొదుపు ఉద్యమం అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి పొందిందని కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఓర్వకల్లులోని బాలభారతి పాఠశాల మైదానంలో మండల పొదుపు లక్ష్మీ ఐక్య సంఘం రజతోత్సవ మహాసభ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మగవాళ్లు చదువుకుంటే ఆ కుటుంబం పైకి వస్తుందని, ఒక మహిళ చదువుకుంటే ఇంటితో పాటు సమాజంలో ఉన్న వారందరూ పైకి వస్తారని అన్నారు.
నంద్యాల జిల్లా కలెక్టర్‌గా బీ.రాజకుమారి నియమితులయ్యారు. 2016 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రస్తుతం గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత కలెక్టర్ డా.కే.శ్రీనివాసులు బదిలీ అయ్యారు. కాగా ప్రభుత్వం ఆయనకు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
వర్షాలు కురవాలని డోన్ మండలం గుమ్మకొండ గ్రామస్థులు మంగళవారం కప్పలకు పెళ్లిళ్లు చేశారు. పాటలు పాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటికీ తిరుగుతూ కప్పలకు నీటిని పోస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురవకపోవడం వల్ల పొలాలలో విత్తనాలు, దుక్కులు వేసిన రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పత్తికొండ: ప్రజా సమస్యల పరిష్కారానికై “ఎమ్మెల్యే హెల్ప్ లైన్”పుస్తకాన్ని ప్రవేశ పెట్టామని పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కే.ఈ. శ్యాం కుమార్ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలను నేరుగా టీడీపీ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే హెల్ప్ లైన్ పుస్తకంలో నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు డబ్బులు వసూలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు.
రెండు నెలల కిందట తాగు నీటి కోసం కర్నూలు వరకు పులికనుమ ప్రాజెక్ట్ నుంచి పది రోజుల పాటు ఎల్‌ఎల్‌సీ కాలువకు నీరు వదిలారు. తాజాగా తాగునీటి కోసం నేరుగా తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయగా మంగళవారం ఉదయం ఎమ్మిగనూరు మండలానికి చేరుకున్నాయి. దీంతో తాగునీటి సమస్యతో పాటు పొలాలకు నీరు పెట్టుకోవచ్చని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు సాయినగర్‌కు చెందిన రఘ, రవికుమార్ అనే అన్నదమ్ములపై నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. కర్నూలులోని చింతల మునినగర్‌కు చెందిన చలపతి నుంచి రూ.12లక్షలు అప్పుగా తీసుకున్నారు. తిరిగి చెల్లించడంలో వివాదం నెలకొంది. దీంతో వారు కక్షతో బైక్‌పై వెళుతున్న చలపతిని ఢీకొట్టి హత్యాయత్నం చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కర్నూలులోని వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన కె.శంకర్‌పై నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. తల్లి సాలమ్మకు పింఛన్ ఇప్పిస్తానని చెప్పి ఆమె పేరు మీద ఉన్న ఇల్లును శంకర్ తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయంపై నిలదీస్తే గొంతు నులిమి హత్యాయత్నం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
Sorry, no posts matched your criteria.