India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు జిల్లాలో 2,45,229మంది లబ్ధిదారుల్లో సోమవారం 2,29,189 మందికి రూ.156.44 కోట్లు అందజేశారు. నంద్యాల జిల్లాలో2,21240మంది లబ్ధిదారుల్లో 2,11272 మందికి రూ.143.47కోట్లు అందజేశారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 93.46శాతం మందికి పంపిణీ చేసి రాష్రంలో 24వస్థానం, నంద్యాలలో 95.49శాతం మందికి పంపిణీ చేసి 13వస్థానంలో నిలిచాయి.
నిత్యం కొత్తగా వస్తున్న చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ కృష్ణకాంత్ అన్నారు. కర్నూల్ రూరల్ సర్కిల్, ఉలిందకొండ పోలీస్టేషన్ ఆవరణంలో నూతన చట్టాలపై ఎస్పీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొత్త చట్టాలతో కేసుల దర్యాప్తు, విధి విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలుగా ఉంటుందని పేర్కొన్నారు.
నందికొట్కూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డా.దేశెట్టి శ్రీనివాసులు సీఎం చంద్రబాబుపై అభిమానాన్ని వినూత్నరీతిలో చాటుకున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడి చిత్రాన్ని కోడి గుడ్డుపై చిత్రించారు. పింఛన్ల పంపిణీ సందర్భంగా చిత్రీకరించినట్లు శ్రీనివాసులు చెప్పుకొచ్చారు. ఈ వినూత్నమైన చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. గతంలోనూ కూటమి నేతల చిత్రాలను పచ్చి టెంకాయపై చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు.
నంద్యాల మండలం పుసులూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గుమ్మడి పెద్ద సుబ్బారాయుడు (75) వృద్ధాప్య పింఛన్ తీసుకున్న గంటకే మృతి చెందారు. ఉదయం సచివాలయ సిబ్బంది రూ.7 వేల పింఛన్ అందజేయగా వయసురీత్యా ఉన్న అనారోగ్యంతో కాసేపటికే తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పింఛన్ పంపిణీ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటలకు కర్నూల్ జిల్లాలో 83.82, నంద్యాల జిల్లాలో 88.76 శాతం పంపిణీ పూర్తైంది. కర్నూల్ జిల్లాలో 2,45,229 మందికి గానూ 2,05,545 మందికి అందజేశారు. నంద్యాల జిల్లాలో 2,21,240 మందికి గానూ 1,96,382 మందికి పింఛన్ నగదు పంపిణీ చేశారు.
పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవైన కర్నూలు జిల్లా ఇదే రోజున ఆవిర్భవించింది. 1858 జులై 1 నుంచి 166 సంవత్సరాలుగా కర్నూలు జిల్లా కేంద్రంగా సేవలందిస్తోంది. ఒకప్పుడు కందెనవోలుగా ప్రసిద్ధి చెంది కాలక్రమేణా కర్నూలుగా మారింది. 1953 OCT 1 నుంచి 1956 OCT 31 వరకు ఆంధ్రరాష్ట్ర రాజధానిగా కొనసాగింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ 2022లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని 6 నియోజకవర్గాలతో నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పాటైంది.
అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఓ పోలీసు అధికారి అక్రమార్జనకు తెరలేపిన ఘటన ఆదోని రైల్వే డివిజన్ పరిధిలోని ఓ స్టేషన్‌లో ఆదివారం వెలుగుచూసింది. రూ.కోటి విలువైన బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యాపారిని అదుపులో తీసుకున్న పోలీసు అధికారి.. పైఅధికారుల సహకారంతో పైరవీలు చేసి రూ.6లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని వదిలేసిన్నట్లు సోమవారం సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
బనగానపల్లె పట్టణంలోని తెలుగుపేటలోని ఇంటింటికీ సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పెన్షన్ రూ.4000 అలాగే 3 నెలల పెంపు రూ.3000 కలిపి ఒకేసారి రూ.7000 పింఛన్ లబ్ధిదారులకు బి.సి.జనార్దన్ రెడ్డి పంపిణీ చేశారు.
కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకుడ్లూరులో శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్న బసవరాజు(22)అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం నిద్ర లేచి పక్క గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న భర్తను చూసిన భార్య కవిత వెంటనే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు తెలిపింది. 2 నెలల క్రితమే హత్రి బెలగల్ గ్రామానికి చెందిన కవితకు బసవరాజుకు వివాహమైంది. వివాహమైన రెండు నెలలకే ఇలా జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి
నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌరసరఫరాలశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని గోదాముల్లో తూనికలు, కొలతలశాఖ అధికారులు సరకుల నాణ్యత పరిశీలించి నివేదికలు ఇవ్వనున్నారని JC నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జులై నెలకు సంబంధించి కార్డుదారులకు బియ్యం, జొన్నలు మాత్రమే పంపిణీ చేయాలని ఉత్తర్వులు వచ్చినట్లు చెప్పారు. కార్డుదారులు 3 కిలోల వరకు జొన్నలను బియ్యానికి బదులుగా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.