Kurnool

News June 30, 2024

కర్నూలు: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

ఆదోని ఆర్ఎస్ సమీపంలో ఆదివారం రైలు కింద‌ప‌డి వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ మేరకు రైల్వే ఎస్ఐ గోపాల్ వెల్లడించారు. మృతుడి కుడి భుజంపై త్రిశూలం, చేతికి రాజు అని ప‌చ్చ‌బొట్టు, నీలం క‌ల‌ర్ ఫుల్ డ్రాయ‌ర్‌, గ్రే క‌ల‌ర్ పంచ‌, చిన్న నిలువు గీత‌లున్న ష‌ర్ట్‌, రెండు కాళ్ల‌కు దారాలు, హీరో సైకిల్ ఉంద‌న్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News June 30, 2024

కర్నూలు: ‘అధికారులు మారినా.. సూచిక బోర్డులు మారలేదు’

image

జిల్లా ఉన్నతాధికారులు మారినప్పటికీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం వారి పేర్లతో పాటు ఫొటోలతో సూచిక బోర్డులు దర్శనమిస్తున్నాయి. నూతన కలెక్టర్‌గా రంజిత్ బాషా బాధ్యతలు తీసుకున్నా.. అప్పటి కలెక్టర్ డాక్టర్ సృజన ఫొటోతో పాటు అప్పటి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ వెంకట రంగారెడ్డి ఫొటో ఉన్న సూచిక బోర్డు అలాగే ఉన్నాయి. అధికారులు మారినా బోర్డులు మార్చకపోవడంపై ప్రజలు విమర్శిస్తున్నారు.

News June 30, 2024

కర్నూలు: తుంగభద్ర డ్యాంలో 5 టీఎంసీల నీటి నిల్వ

image

ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా వచ్చి చేరుతోందని తుంగభద్ర డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో డ్యాముకు ఆదివారం 6,308 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 5.79 టీఎంసీల నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు.

News June 30, 2024

ఆదోని: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

ఆదోని పట్టణంలోని స్థానిక రాయనగర్ సమీపాన గుర్తు తెలియని వ్యక్తి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై గోపాల్ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని గుర్తించి పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

News June 30, 2024

RU: 1 నుంచి PG సెమిస్టర్ పరీక్షలు

image

రాయలసీమ విశ్వవిద్యాలయంలో పీజీ-4వ సెమిస్టర్ పరీక్షలను జులై 1 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ఆచార్య వెంకటసుందరానంద్ పుచ్చ తెలిపారు. వర్సిటీ కళాశాలతో పాటు మరో ఐదు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రెగ్యులర్ 468 మంది, సప్లిమెంటరీ 103 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.

News June 30, 2024

కర్నూలు రాయలసీమ వర్సిటీ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా వెంకటేశ్వర్లు

image

రాయలసీమ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా డాక్టర్ సముద్రాల వెంకటేశ్వర్లును నియమిస్తూ వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య బీ.సుధీర్ ప్రేమకుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం డాక్టర్ వెంకటేశ్వర్లు వర్సిటీలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రిజిస్ట్రార్‌గా వ్యవహరించిన డాక్టర్ నాగుల అంకన్న బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

News June 30, 2024

మాతృ మరణాలపై డీఎంహెచ్‌ఓ సమీక్ష

image

నంద్యాల జిల్లాలో మాతృ మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్.వెంకటరమణ ఆదేశించారు. స్థానిక వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మాతృ మరణాలపై నందికొట్కూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎర్రమఠం, టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరిగిన మాతృ మరణాలపై సంబంధిత వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

News June 30, 2024

జులై 1న 100% పెన్షన్ల పంపిణీ పూర్తి కావాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద వివిధ కేటగిరీలకు చెందిన పెన్షన్ లబ్ధిదారులందరికీ జులై 1న 100% పెన్షన్ల పంపిణీ పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ డా. కే.శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

News June 29, 2024

జూలై 1న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం: కలెక్టర్

image

జూలై 1న కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని కలెక్టర్ రంజిత్ బాషా శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, మున్సిపల్, డివిజన్ కార్యాలయాల్లో సంబంధింత అధికారులు ప్రజా ఫిర్యాదులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.

News June 29, 2024

AI సృష్టించిన రాగి ముద్ద చిత్రం

image

నాటుకోడి, రాగి సంగటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీమ ప్రజలు ఆస్వాదిస్తూ తినే వంటకం ఇది. ఇటీవల AI సృష్టించిన వినూత్న ఫొటోలు నెట్టింట వైరలవుతున్న విషయం తెలిసిందే. అలాగే చట్ని, రాగి ముద్ద, నెయ్యితోనూ AI ఓ ఫొటో తయారు చేసింది. దీన్ని ఓ నెటిజన్ నెట్టింట పోస్ట్ చేయడంతో ‘సీమరుచులను ఇంకా ప్రాచుర్యంలోకి తేవాలి’ అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.