India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాలలోని ఆర్&బీ అతిథి గృహంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, NMD ఫరూక్ శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ కే.శ్రీనివాసులు, ఎస్పీ కే.రఘువీర్ రెడ్డి, JC టీ.రాహుల్ కుమార్ రెడ్డి, MLAలతో సమీక్షించారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు బీసీ, ఫరూక్ దిశా నిర్దేశం చేశారు. MLAలు కోట్ల, గౌరు, బుడ్డా, భూమా, జయసూర్య పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా పరిధిలోని కొలిమిగుండ్ల, కొత్తపల్లి మండలాల ఎంపీడీవోల తీరుపై జిల్లా కలెక్టర్ డా.కే.శ్రీనివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ల పంపిణీ అంశంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు గైర్హాజరు కావడం, ముందస్తు అనుమతి లేకుండా సెలవుపై వెళ్లడాన్ని కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నారు. ఆ ఇద్దరు ఎంపీడీవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జడ్పీ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డిని కలెక్టర్ ఆదేశించారు.
ఉరివేసుకొని మహిళ సంగీత(23) మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఆదోని మండలం కపటి గ్రామానికి చెందిన సంగీతను పెద్దకడబూరు మండలానికి చెందిన రవికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే రవి ఫిబ్రవరి నెలలో గుండెపోటుతో మృతిచెందగా.. అప్పటి నుంచి సంగీత తల్లితండ్రులతో ఉంటోంది. కుటుంబసభ్యులు ఉదయం కూలీ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లగా ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆళ్లగడ్డలోని ఎంవీ నగర్ 24వ వార్డు కౌన్సిలర్ గురుమూర్తి శనివారం జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ తాలూకా ఇన్‌ఛార్జ్ ఇరిగెల రాంపుల్లారెడ్డి సమక్షంలో ఆయన తమ అనుచరులతో కలిసి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇరిగెల మాట్లాడుతూ.. త్వరలోనే మున్సిపల్ ఛైర్మన్ పదవి ఎన్డీఏ కూటమి వశం కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ జోన్ కమిటీ సభ్యుడు మహబూబ్ హుస్సేన్ పాల్గొన్నారు.
జులై మూడో వారంలో విజయవాడలో జరగనున్న జాతీయ స్థాయి అండర్-10 ఆర్చరీ పోటీలకు కర్నూల్ నగరానికి చెందిన యువకుడు కె.పార్థ చంద్ర ఎంపికైనట్లు జిల్లా ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి నాగరత్నమయ్య తెలిపారు. పార్థ చంద్ర ఈ నెల 22 నుంచి 24 వరకు విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో 9వ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారని వివరించారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (ఓర్వకల్లు) విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకల సంఖ్య పెరుగుతోంది. మూడేళ్ల కాలంలో 1,20,732 మంది ప్రయాణం చేశారు. వైజాగ్, చెన్నై నగరాలకు తక్కువ సమయంలోనే చేరుకోగలుగుతున్నారు. అయితే ఈ ఎయిర్ పోర్టు నుంచి విజయవాడ, తిరుపతి నగరాలకూ విమానాలు తిప్పాలని ప్రయాణికులు కోరుతున్నారు. మన రాష్ట్ర ఎంపీ రామ్మోహన్ నాయుడే కేంద్ర విమానయానశాఖ మంత్రి కావడంతో దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
ఢిల్లీకి చెందిన రాజేంద్ర శర్మ సైకిల్‌పై మహానందికి చేరుకున్నారు. వస్త్ర దుకాణంలో పనిచేసే ఆయన చిన్నప్పటి నుంచే హిందూ ధర్మం పట్ల ఆకర్షితుడై సైకిల్‌పై సంపూర్ణ భారత్ యాత్ర చేయాలని సంకల్పించాడు. ఈ ఏడాది మార్చి 13న అయోధ్య నుంచి సైకిల్ యాత్ర మొదలు పెట్టాడు. 7 రాష్ట్రాలను దాటుకుంటూ ఏపీకి చేరాడు. అందులో భాగంగా మహానంది చేరుకున్నారు. మహానందీశ్వర స్వామివారిని దర్శించుకుని అహోబిలం, తిరుపతికి వెళ్తానని చెప్పారు.
ప్రజాధనం దుర్వినియోగం చేసిన దోషులను శిక్షించాలని ఎంపీ బైరెడ్డి శబరి ప్రభుత్వాన్ని కోరారు. ‘వైసీపీ పాలనలో ప్రజాధనం ఎంతలా దుర్వినియోగం అయిందో చెప్పేందుకు ఇదొక నిదర్శనం. మాజీ సీఎం జగన్ ప్రచార పిచ్చి కోసం ప్రత్యేకంగా డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏకంగా రూ.1,861 కోట్లను దోచేశారు. ఈ అక్రమాలన్నింటిపై సమగ్ర విచారణ జరిపి ప్రజాధనం దుర్వినియోగం చేసిన దోషులకు శిక్షించాలి’ అని ఆమె ట్వీట్ చేశారు.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో నేడు జిల్లాలో వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, చెట్లు, పోల్స్, టవర్స్ కింద ఉండొద్దని సూచించింది.
పాణ్యం మండలం కౌలూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు ఆకస్మికంగా పర్యవేక్షించారు. కేంద్రంలోని హాజరు అయిన విద్యార్థులు, హాజరు పట్టీని, ఇతర రిజిస్టర్లను పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం పోషకాహార పదార్థాలను క్రమం తప్పకుండా ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.