Kurnool

News June 24, 2024

నేడు కర్నూల్, నంద్యాల జిల్లా ఎంపీల ప్రమాణ స్వీకారం

image

18వ లోక్‌సభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానుండగా జిల్లా ఎంపీలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిలతో ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రమాణం చేయిస్తారు. వీరిరువురూ తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికైన విషయం తెలిసిందే. మరోవైపు టీడీపీ పార్లమెంటరీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా బైరెడ్డి శబరి వ్యవహరించనున్నారు.

News June 24, 2024

అర్జీలు స్వీకరించనున్న నంద్యాల ఎస్పీ

image

ఈనెల 24వ తేదీన సోమవారం నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ” (పబ్లిక్‌ గ్రివియన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టం) ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదివారం తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News June 23, 2024

నంద్యాలలో భర్తను హత్య చేసిన భార్య

image

నంద్యాల పట్టణంలోని రెండవ పట్టణ పోలీసు స్టేషన్‌కు కూత వేటు దూరంలోని సుద్దుల పేటలో హత్య జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. భర్తను భార్యే కత్తెరతో పొడిచింది. తీవ్ర గాయాలైన అతడిని నంద్యాల జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News June 23, 2024

టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా బైరెడ్డి శబరి

image

లోక్‌సభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని సీఎం చంద్రబాబు నియమించారు. ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ఆమె తాజా ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచా బ్రహానందరెడ్డిపై విజయం సాధించారు.

News June 23, 2024

కర్నూలు: తపాల ఉద్యోగి సూసైడ్

image

పొలాల్లో చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. కోడుమూరు మండలం ముడుమాలగుర్తికి చెందిన మల్లికార్జున్ కర్నూలులో ఉంటూ పోస్టు ఆఫీసులో విధులు నిర్వహించేవారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలోని పంట పొలాల్లో ఉరివేసుకొని మృతిచెందారు. ఆదివారం పొలాలకు వెళ్తున్న రైతులు గుర్తించి ఉండవెల్లి పోలీసులకు సమాచారం అందించారు.

News June 23, 2024

ఎమ్మిగనూరు: సెంచరీ కొట్టిన టమోటా ధరలు

image

కూరగాయల ధరలు మండిపోతున్నాయి. డిమాండ్ కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి.రూ. 80 లోపు ఉన్న టమోటా ధర ఆదివారం ఎమ్మిగనూరు కూరగాయల మార్కెట్‌లో సెంచరీ కొట్టింది. టమోటా కేజీ ధర రూ. 100కు చేరుకోవడంతో సామాన్యులు కొనలేక బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి సబ్సిడీ కింద ఎమ్మిగనూరు కూరగాయల మార్కెట్‌లో సరఫరా చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

News June 23, 2024

టీడీపీ పార్లమెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా బైరెడ్డి శబరి

image

నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి టీడీపీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్‌గా ఎంపికయ్యారు. దీంతో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. మొదటిసారి నంద్యాల నుంచి గెలిచిన ఆమెకు ఈ అవకాశం ఇవ్వడంతో సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

News June 23, 2024

సికింద్రాబాద్‌లో రైలు కింద పడి కర్నూలు వాసి ఆత్మహత్య

image

సికింద్రాబాద్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తెలిపిన వివరాలు.. కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన కే.వీరనాగులు (46) స్థానికంగా కూలీ పనులు చేస్తూ భార్యాపిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. సరైన ఉపాధి లేక మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో ఎంఎంటీఎస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం కుటుంబసభ్యులకు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు.

News June 23, 2024

ఆదోని: రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదోని ఆర్ఎస్ యార్డు వద్ద శనివారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ గోపాల్ తెలిపిన వివరాల మేరకు రైల్వే ట్రాక్ 494/38 లైన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొన్నట్లు తెలిపారు.ఆచూకీ తెలిసిన వారు 9849157634 నంబరుకు కాల్ చేసి వివరాలు తెలపాలని కోరారు.

News June 23, 2024

రికార్డు సృష్టించిన కర్నూలు కలెక్టర్ సృజన

image

ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్‌గా బదిలీ అయిన కర్నూలు జిల్లా కలెక్టర్ డా.జీ.సృజన కర్నూలు జిల్లా తొలి మ‌హిళా క‌లెక్ట‌ర్‌గా రికార్డు సృష్టించారు. క‌ర్నూలు జిల్లా ఆవిర్భావం నుంచి ఇక్క‌డ మ‌గ‌వారే క‌లెక్ట‌ర్ల‌గా నియ‌మితుల‌వుతూ వ‌స్తున్నారు. ఇప్పటివరకు 54 మంది కలెక్టర్లుగా పని చేయగా, అందరూ పురుషులే. 2013 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన గుమ్మ‌ళ్ల‌ సృజన తొలి మహిళా క‌లెక్ట‌ర్‌గా సేవలందించారు.