India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తనపై చిరుత పులి దాడి చేసిందని శనివారం ఓ మహిళ ఆరోపించారు. నంద్యాలలోని పచ్చర్ల గ్రామంలో షేక్ బీబీ అనే మహిళ తన ఇంట్లో నిద్రిస్తుండగా, చిరుత పులి అకస్మాత్తుగా వచ్చి తల భాగంపై దాడి చేసిందని, ఆమె కేకలు వేయడంతో సమీపంలోని అడవి ప్రాంతంలోకి పారిపోయిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
డయేరియా వ్యాధి ప్రబలకుండా చర్యలు చేపట్టాలని కర్నూలు కలెక్టర్ డా.సృజన వైద్య, సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. తరచూ RWS శాఖ అధికారులు నీటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో డయేరియా నివారణలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వర్షాల వల్ల డయేరియా, డెంగ్యూ, మలేరియా, తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఇప్పటి వరకు కర్నూలు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన డా.సృజన తనదైన మార్క్ వేశారు. గత ఎడాది ఏప్రిల్ 11న బాధ్యతలు చేపట్టిన సృజన దాదాపు 15 నెలలపాటు కలెక్టర్‌గా సేవలందించారు. కాగా కలెక్టర్ హోదాలో సృజనకు కర్నూలు జిల్లా తొలి పోస్టింగ్. గతంలో ఆమె తండ్రి బలరామయ్య కూడా ఇదే జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు. తండ్రికి తగ్గ కుమార్తెగా సృజన కర్నూలు జిల్లాను అభివృద్ధిలో తనదైన పరిపాలనతో పరుగులు పెట్టించారు.
కర్నూల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన బదిలీ అయ్యారు. ఆమెను ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. జిల్లాకు కొత్త కలెక్టర్‌గా పి.రంజిత్ బాషాను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన ప్రస్తుతం బాపట్ల జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. కర్నూలు, నంద్యాల ఎంపీలు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి, పలువురు ఎంపీలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన విధివిధానాలపై ఎంపీలకు బాబు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశం సందర్భంగా ఎంపీలు మంత్రి నారా లోకేశ్‌ను సత్కరించారు.
జులై 1 నుంచే పింఛన్ పెంపును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. జులై 1న ఇచ్చే రూ.4 వేలు, ఏప్రిల్ నుంచి 3 నెలలకు రూ.వెయ్యి చొప్పున కలిపి లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ లెక్కన అవ్వతాతలకు జులై 1న ₹7 వేల పింఛన్ అందనుంది. ఈ పెంపుతో కర్నూలు జిల్లాలో సుమారు 2.45 లక్షలు, నంద్యాల జిల్లాలో 2.24 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 4.69 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
నంద్యాలలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఫొటోల గొడవ జరిగింది. నంద్యాలలోని 29వ సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఫొటోలు పెట్టడానికి వెళ్లిన టీడీపీ నాయకులకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఛైర్‌పర్సన్ తనపై దుర్భాషలాడారని టీడీపీ నాయకుడు సుబ్బారాయుడు పేర్కొన్నారు. మరోవైపు సచివాలయానికి పనిపై వెళ్తే తనను అవమానించారని ఛైర్‌పర్సన్ మాబున్నిసా ఆవేదన వ్యక్తం చేశారు.
సభాపతి స్థానానికి ఎన్నికైన అయ్యన్నపాత్రుడికి రోడ్డు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో అక్రమ కేసుల బాధను తాను అనుభవించానన్నారు. అరెస్ట్‌చేసి 32రోజులు జైలు పెట్టినప్పుడు జరిగిన అవమానాలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం ఎలా ఉంటాయో తెలుసనన్నారు. ఎన్ని కేసులు, ఇబ్బందులు పెట్టినా పోరాడిన అయ్యనపాత్రుడి రాజకీయ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు.
తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల(D) రాజోలి ప్రాంత వాసులు ఆంధ్రా సరిహద్దుల్లో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. మా ప్రాంతంలో చేస్తున్నామని రాజోలి వాసులు..ఏపీ సరిహద్దులో జరుగుతున్నాయని అధికారుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో మైనింగ్, పోలీసు, రెవెన్యూ అధికారులు రాజోలి వద్ద రవాణా చేస్తున్న 51ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. ఫైన్ వసూలుచేసి ట్రాక్టర్‌లు విడుదల చేసినట్లు తెలిపారు.
తుగ్గలి మండలం జొన్నగిరిలో శుక్రవారం వజ్రం లభ్యమైంది. జొన్నగిరికి చెందిన ఒక రైతు తన పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండగా వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని గ్రామానికే చెందిన వ్యాపారస్థుడు రూ.2.8 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు మండలంలో ఈ సంవత్సరం 40వజ్రాలకు పైగా దొరికాయి. వర్షం పడితే వజ్రాల కోసం ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు తండోపతండాలుగా ఇక్కడికి వస్తుంటారు.
Sorry, no posts matched your criteria.