Kurnool

News September 27, 2024

జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అహోబిలం

image

జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అహోబిలం ఎంపికైంది. ప్రపంచం పర్యాటక దినోత్సవం సందర్బంగా నేడు ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ చేతుల మీదుగా అవార్డును నంద్యాల ఇంటాచ్ చాప్టర్ కన్వీనర్ శివ కుమార్ రెడ్డి, ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖాధికారి లంజ్వంతి నాయుడు కలిసి అందుకున్నారు.

News September 27, 2024

రాష్ట్రస్థాయి లాంగ్ జంప్ పోటీలకు నందవరం కేజీబీవీ విద్యార్థిని ఎంపిక

image

నందవరం కేజీబీవీ 8వ తరగతి విద్యార్థిని జీ.స్వాతి రాష్ట్రస్థాయి లాంగ్ జంప్ పోటీలకు ఎన్నికైనట్లు నందవరం కేజీబీవీ ప్రిన్సిపల్ శైలజ తెలిపారు. 26న జరిగిన జిల్లాస్థాయి లాంగ్ జంప్ పోటీలో స్వాతి ప్రతిభ కనబరిచి నాలుగో స్థానంలో విజయం సాధించిందని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన స్వాతిని ఆమె అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలలో మెరుగైన ప్రతిభను కనబరిచి విజయం సాధించాలని కోరారు.

News September 27, 2024

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు మద్దికేర విద్యార్థి ఎంపిక

image

మద్దికేరకు చెందిన ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న యువరాజ్ రాష్ట్రస్థాయి అండర్-19 క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. పట్టుదలతో కొన్నేళ్లుగా శ్రమించిన దానికి ఫలితం నేడు దక్కిందని కరస్పాండెంట్ యజ్ఞం వెంకట్ మాధవ్ అన్నారు. ప్రిన్సిపల్ సునీత, ఉపాధ్యాయుడు భాస్కర్ యాదవ్ విద్యార్థిని అభినందించారు.

News September 27, 2024

ఈవీఎంలు భద్రపరచిన గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్

image

ఈవీఎంలు భద్రపరచిన గోడౌన్‌ను కలెక్టర్ రంజిత్ బాషా శుక్రవారం పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సీసీ కెమెరాల నిఘాలో ఈవీఎంలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సంబంధిత రిజిస్టర్‌లో కలెక్టర్ సంతకం చేశారు. ఆయనతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఉన్నారు.

News September 27, 2024

కర్నూలు: పెన్షన్లకు రూ.102.97 కోట్లు

image

అక్టోబర్ నెలలో కర్నూలు జిల్లాలో పెన్షన్ల పంపిణీకి గాను రూ.102.97 కోట్ల నిధులు విడుదలైనట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడీ సలీం బాషా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,41,843 పెన్షన్లకు నగదు మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఎంపీడీవోలు డ్రా చేసుకుని నేరుగా సచివాలయ ఉద్యోగులకు అందజేయాల్సి ఉంటుందని తెలిపారు.

News September 27, 2024

మీ ఫేవరెట్ పర్యాటక ప్లేస్ ఏది?

image

ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యాటకులకు స్వర్గధామం. ఎన్నో దర్శనీయ స్థలాలు మన జిల్లాలో ఉన్నాయి. శ్రీశైలం, మహానంది, అహోబిళం, మంత్రాలయం, యాగంటి, కొండారెడ్డి బురుజు, యల్లర్తి దర్గా, నందవరం చౌడేశ్వరి దేవి దేవాలయం, బెలుం గుహలు, ఓర్వకల్ రాక్ గార్డెన్ ఇలా ఎన్నో మధురానుభూతులు పంచే పర్యాటక ప్రాంతాలు మన జిల్లా సొంతం. మరి జిల్లాలో మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి..
#World Tourism Day

News September 27, 2024

ఉపాధి హామీ నిర్దేశిత పనులను పూర్తి చేయండి: కలెక్టర్

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి ఎంపీడీవోలు, ఏపీడీలు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఉపాధి హామీ పథకం కింద నిర్ధేశించిన లేబర్ బడ్జెట్, వంద రోజుల పనిదినాల కల్పన, హార్టికల్చర్, అవెన్యూ ప్లాంటేషన్ పనులు ప్రగతి లక్ష్యాలపై క్లస్టర్ల వారీగా సమీక్షించారు.

News September 27, 2024

కర్నూలు కలెక్టరేట్ పరిపాలన అధికారిగా విజయశ్రీ

image

కర్నూలు కలెక్టరేట్ పరిపాలన అధికారిగా విజయశ్రీ గురువారం ఏవో ఛాంబర్‌లో ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. గతంలో సీ.బెళగల్ మండలంలో తహశీల్దార్‌గా బాధ్యతలు నిర్వహించిన విజయశ్రీ సాధారణ బదిలీలలో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పరిపాలన అధికారిగా పనిచేసిన రాజేశ్వరి కలెక్టరేట్ రెవెన్యూ సెక్షన్‌లోనే నియమితులయ్యారు.

News September 26, 2024

నంద్యాల సబ్ డివిజన్ పోలీసులతో ఎస్పీ సమీక్ష

image

నంద్యాల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో గురువారం ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావంతో ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించాలని పోలీసులకు ఎస్పీ పిలుపునిచ్చారు. విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎక్కడా మట్కా, గ్యాంబ్లింగ్, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు.

News September 26, 2024

పోలీసులకు కర్నూలు డీఐజీ కీలక ఆదేశాలు

image

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, కర్నూలు ఎస్పీ జీ.బిందు మాధవ్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఐజీ మాట్లాడుతూ అల్లరి మూకలు, ఫ్యాక్షన్ చరిత్ర కలిగిన వారిపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. రాబరీ, డెకాయిటి వంటి కేసులపై దర్యాప్తులు పకడ్బందీగా చేయాలన్నారు.