India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని స్థానిక దిన్నెదేవరపాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో పార్ట్ టైం టీచర్ల భర్తీకి గురువారం డెమో నిర్వహించనున్నట్లు ఏపీఎస్ఈబ్ల్యూఆర్ఐఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల భర్తీకి ఇప్పటికే అర్హులైన (టెట్, బీఎడ్, పీజీ/ సంబంధిత మెథడాలజీ ) అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు.
కర్నూలు జిల్లాలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. ఆదోని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐ తేజోమూర్తి వైఎస్సార్ జిల్లా చిన్న చౌక్ స్టేషన్‌కు, ప్రొద్దుటూరు ఫ్యాక్షన్ జోన్‌లోని కంబగిరి రాముడు కర్నూలు సీపీఎస్‌కు బదిలీ అయ్యారు. చచిన్న చౌక్ పీఎస్ సీఐ భాస్కర్ రెడ్డి, ఖాజీపేట అర్బన్ సీఐ రామాంజనేయులును కర్నూలు రేంజ్ వీఆర్‌కు పంపుతూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు కర్ణాటక రాష్ట్రానికి అడిషనల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మారుతి సాంబ్రాణి కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి మఠం సహాయ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి స్వాగతం పలికారు. అనంతరం మంచాలమ్మ దేవికి విశేష కుంకుమార్చన నిర్వహించారు. గురురాయల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించుకుని ముక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం శ్రీమఠంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.7,476 పలికింది. మంగళవారంతో పోలిస్తే పత్తి ధర స్వల్పంగా రూ.20 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా పత్తి కనిష్ఠ ధర రూ.4,002గా ఉంది. వేరుశనగ గరిష్ఠ ధర రూ.6,246, కనిష్ఠ ధర రూ.4,169 పలికింది. ఆముదాలు గరిష్ఠ ధర రూ.5,200, కనిష్ఠ ధర రూ.4,560 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
ఈ నెల 21న కర్నూలులోని సీ-క్యాంప్‌లో ఉన్న ఉపాధి కల్పనా కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి పీ.దీప్తి తెలిపారు. ఈ జాబ్ మేళాలో మూడు ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయని పేర్కొన్నారు. ఎంపికైన వారికి జీతం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటుందని తెలిపారు.
ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్న జోనల్ స్థాయి స్కేటింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు స్కేటింగ్ సంఘం ఉపాధ్యక్షుడు సునీల్ కుమార్ బుధవారం తెలిపారు. జోనల్ పోటీలకు.. జయంత్, శృతిక్, మాన్వి శ్రీ, సాహితీ, జశాంక్ ఆర్య, సాయి దతేశ్ ఎంపికయ్యారు. కోశాధికారి అబూబకర్, స్కేటింగ్ అసోసియేషన్ సభ్యులు క్రీడాకారులను అభినందించారు.
ఆత్మకూరు(M) కురుకుందకు చెందిన ఖాదర్‌వలి హత్యకు గురయ్యాడు. సీఐ లక్ష్మీనారాయణ వివరాలు.. ఈనెల 16న కురుకుందకు చెందిన ఫారుక్, కృష్ణాపురానికి చెందిన ముర్తుజావలి హైదరాబాద్ నుంచి ఆత్మకూరుకు బస్సుల్లో వస్తుండగా డ్రైవర్ పక్కన కూర్చొనే విషయంలో గొడవపడ్డారు. 17న ఫారుక్ కురుకుందలో ఉన్నాడని తెలుసుకుని ముర్తుజావలి తన మిత్రులతో(ఖాదర్)కలిసి వెళ్లి వాగ్వాదానికి దిగారు. గొడవలో ఖాదర్‌ని కత్తితో పొడవడంతో చనిపోయాడు.
ఆటో బోల్తాపడి బాలిక మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాలు..గోనెగండ్లకు చెందిన రహంతుల్లా కుటుంబంతో కలిసి తన సోదరి భానును చూసేందుకని ఎమ్మిగనూరు వచ్చారు. ఈ క్రమంలో రహంతుల్లా పెద్ద కూతురు ఆల్పీషా(12)ను తీసుకుని భాను మార్కెట్‌కి వెళ్లింది. పని ముగించుకుని ఆటోలో తిరిగి వస్తుండగా ఎమ్మిగనూరు ఎద్దుల మార్కెట్ వద్ద ఆవులు అడ్డంగా వచ్చాయి.తప్పించబోయి ఆటో బోల్తా పడటంతో ఆల్పీషా మృతిచెందింది.
కర్నూలు నగరంలోని సి.క్యాంప్ రైతుబజార్‌లో టమాటా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు నారాయణమూర్తి తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో టమాట కిలో ధర రూ.70 నుంచి రూ.80 వరకు ఉందన్నారు. ఈ నేపథ్యంలో మదనపల్లి నుంచి టమాట కొనుగోలు చేసి సి.క్యాంప్ రైతుబజార్‌లో వినియోగదారులకు నో లాస్ .. నో గెయిన్ కింద పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. మంగళవారం అల్లూరు గ్రామం మాండ్ర శివానందరెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో రైతులకు టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. సబ్సిడీల ద్వారా రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.