India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదలయ్యాయి. జిల్లాలోని రైతులకు రూ.2 వేలు చొప్పున అకౌంట్లలో జమకానుంది. కర్నూలు జిల్లాలోని 2.34 లక్షల మంది రైతులకు రూ.46.97 కోట్లు, నంద్యాల జిల్లాలోని 1.95 లక్షల మంది రైతులకు రూ.39.19 కోట్ల మేర సాయం అందనుంది. లబ్ధిదారుల లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో ఈ లింక్ <
నంద్యాల జిల్లాలో గత సంవత్సరం రబీ సీజన్‌లో పంట నష్టపోయిన వివరాలను ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీంకు స్పష్టంగా నివేదించాలని జిల్లా కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన చాంబర్లో కేంద్ర కరువు బృంద పర్యటనపై జెసి టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నష్టపోయిన రైతులతో ముఖాముఖి నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
దట్టమైన నల్లమల అడవుల్లో వెలిసిన మహానంది క్షేత్రం మహదానందానికి నిలయం. కొన్ని రోజులుగా వర్షాలు పడుతుండటంతో ఆలయ పరిసరాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. భక్తులు నల్లమల అందాలు చూసి పరవశించిపోతున్నారు. ఆలయం వెనుకవైపు నల్లమల పచ్చగా కనిపిస్తూ పర్యాటకులను కనువిందు చేస్తోంది. పక్షుల కిలకిలారావాలు, నల్లమల పచ్చటి అందాలకు పొగమంచు తోడవడంతో మహానంది ఊటీ అందాలను తలపిస్తోందంటూ భక్తులు కామెంట్ చేస్తున్నారు.
ఉమ్మడి కర్నూల్ జిల్లాలో వాలంటీర్ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందు వందల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తీరా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో మళ్లీ తమను విధుల్లోకి తీసుకోవాలంటూ రాజీనామా చేసిన వాలంటీర్లు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 4806 వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయంకు ఇన్ ఫ్లో సుంకేసుల జలాశయం నుంచి 2647 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా, జలాశయ ప్రస్తుత నీటి మట్టం 813.40. అడుగులు చేరింది. జలాశయ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 36.3480 టీఎంసీలుగా నమోదైంది.
మహానందిలో చిరుత పులి మళ్లీ ప్రత్యక్షమవడం కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి దాటాక పార్వతీపురం పాత వివేకానంద స్కూల్ వద్ద కనిపించింది. భయాందోళనకు గురైన ప్రజలు గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి చిరుత పులి పారిపోయింది. గత రెండు రోజులుగా మహానంది గ్రామ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత పులి తిరుగుతోంది భక్తులూ ..జాగ్రత్త అంటూ దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు.
ఆళ్లగడ్డ(M) మర్రిపల్లెకి చెందిన రామ్మోహన్ తనకు రెండు ఎకరాల్లోని 25 సెంట్లలో 25 రకాల పంటలు పండిస్తున్నారు. గడ్డ జాతి కూరగాయలకు 3అడుగుల మేర బెడ్లు, 1.5అడుగుల కాల్వలో కూరగాయలు, ఖాళీ స్థలంలో ఆకుకూరలు వేసుకునేలా సిద్ధం చేశారు. తెగుళ్ల నివారణకు కషాయలు తయారుచేసుకొని వాడారు. నెలకు రూ.4000 పెట్టుబడితో రూ.30 వేల దాకా సంపాదిస్తున్నట్లు తెలిపారు. రసాయనాలు వాడకపోవడంతో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారన్నారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఖరీప్ సీజన్ ప్రారంభం మే నెలలో కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.2వేల చొప్పున పెట్టుబడి సాయం చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అది వాయిదా పడింది. కాగా ఆ పెట్టుబడి సాయం కేంద్ర ప్రభుత్వం ఇవాళ అందించనుంది. కర్నూలు జిల్లాలో 2.34లక్షల మంది రైతులకు రూ.46.97 కోట్లు, నంద్యాల జిల్లాలో 1.95లక్షల మంది రైతులకు రూ.39.19కోట్లు రైతుల అకౌంట్‌లోకి జమ కానుంది.
శ్రీశైల దేవస్థానంలో సోమవారం సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లకు వెండి రథోత్సవ సేవ నిర్వహించారు. కాగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి రథోత్సవంలో వేంచేపు చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణలతో మంగళ వాయిద్యాలు నడుమ ఆలయ ప్రదక్షిణ గావించారు. వెండి రథోత్సవంలో కొలువైన శ్రీ స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.
రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరూరు ఆర్ఎస్ సమీపంలో చోటు చేసుకుంది. సోమవారం రైల్వే ఎస్ఐ గోపాల్ తెలిపిన వివరాల మేరకు ఆదోని మండలం పెసలబండ గ్రామానికి చెందిన సలేంద్ర ఈశ్వర్ (20) రైలుపట్టాలపై తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.