India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ యోగా గురువు డాక్టర్ ఎస్.ముంతాజ్ బేగంకు జాతీయ యోగా టీచర్ అవార్డుతో పాటు యోగారత్న అవార్డును హరియాణాకు చెందిన మానవియ్య నిర్మాణ్ మంచ్ ఇండియా ప్రకటించింది. 15ఏళ్లుగా నిర్విరామంగా యోగాతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించినందుకు గాను ఈ అవార్డు అందజేయనున్నారు. జూన్ 21న 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఈ అవార్డును ముంతాజ్ బేగం హరియణాలో అందుకోనున్నారు.
మద్దికేర మండల కేంద్రానికి చెందిన పంచాయతీ మాజీ వార్డు సభ్యుడు చాకలి నాగేశ్ (52) ఇవాళ మృతిచెందాడు. వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, సర్పంచ్ బండారు సుహాసిని, వైసీపీ నాయకులు, రజక సంఘం నాయకులు నివాళులర్పించారు.
పాములపాడు మండలంలోని వానాల గ్రామంలో ఎస్సీ కాలనీవాసులకు తెలుగు గంగ నీళ్లు వదులుతున్నారని కాలనీవాసులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. నీళ్లు అపరిశుభ్రంగా ఉంటున్నాయని వాటిని తాగడం వల్ల రోగాల బారిన పడుతున్నామని పేర్కొన్నారు. అలాగే డయేరియా సంబంధిత వ్యాధులు సంభవించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని మంచి నీటిని సరఫరా చేయాలని కోరారు.
పాములపాడు మాజీ ఎంపీపీ గాండ్ల లక్ష్మీదేవమ్మ ఆదివారం హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 9న లక్ష్మీ దేవమ్మ గృహంలో ఉదయం పూజ నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. 50% గాయాలైన ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్ చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
ఎమ్మెల్యేగా గెలిపించిన జగన్‌ను కాదని పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆలూరు ఎమ్మెల్యే విరూఫాక్షి స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లడానికి తన ఆత్మసాక్షి ఒప్పుకోదని పేర్కొన్నారు. పార్టీ మారుతున్నట్లు పత్రికల్లో వస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. వదంతులు నమ్మెుద్దని ప్రజలను కోరారు.
పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. తుగ్గలి మండలం రామలింగాయపల్లి సమీపంలో ఆ గ్రామానికి చెందిన నలుగురు కొండలో గొర్రెల మంద వద్ద కాపలాగా ఉండగా పిడుగు పడింది. ఈ ఘటనలో కామేశ్వరి(35), సుంకన్న(47) మృతిచెందగా.. మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. వారి మృతదేహాలను ఇతర కాపారులు గ్రామానికి తీసుకువచ్చారు.
శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతమైన తుంగభద్ర నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 6,560 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరుతుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. అదే సమయానికి జలాశయ నీటిమట్టం 812.20 అడుగులుగా ఉంది. నీటి నిలువ సామర్థ్యం 35.6294 టీఎంసీలు ఉంది.
హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే ఆదివారం లక్ష్మీ అనే వివాహిత పొలంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త వీరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే ఆదివారం లక్ష్మీ అనే వివాహిత పొలంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త వీరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
బేతంచెర్ల వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి ఆలయంలోని కోనేరులో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గద్వాల మండలం వడ్డేపల్లికి చెందిన కురువ మహేశ్ (34) అనే వ్యక్తి మద్దిలేటి స్వామి దర్శనం కోసం శనివారం మద్దిలేటి స్వామి ఆలయానికి వచ్చారు. ఈ రోజు10 గంటల సమయంలో కోనేరులో ఈతకు వెళ్లాడు. గుంత ఉండడంతో అందులో మునిగి కనిపించలేదు. ఆదివారం ఉదయం మృతదేహం బయటపడింది.
Sorry, no posts matched your criteria.