India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, కర్నూలు ఎస్పీ జీ.బిందు మాధవ్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఐజీ మాట్లాడుతూ అల్లరి మూకలు, ఫ్యాక్షన్ చరిత్ర కలిగిన వారిపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. రాబరీ, డెకాయిటి వంటి కేసులపై దర్యాప్తులు పకడ్బందీగా చేయాలన్నారు.

విజయవాడలోని R&B ఈఎన్సీ కార్యాలయంలో CM చంద్రబాబు ఆదేశాల మేరకు పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారుల అప్ గ్రేడేషన్‌కు సంబంధించి గురువారం నిర్వహించిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. భూసేకరణ సమస్యలు, అటవీ క్లియరెన్స్, తదితర సమస్యలపై ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి బీసీ, వారికి దిశానిర్దేశం చేశారు.

ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలిని సస్పెండ్ చేస్తూ జిల్లా వైద్యశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విధుల్లో నిర్లక్ష్యంతో బేబీ డెత్‌కు కారణమైనట్లు ఆరోపణలు రావడం, సహచర వైద్యులతో విభేదాలు తలెత్తి ఒకరినొకరు ఫిర్యాదులు చేసుకోవడంతో నిన్న విచారణ చేపట్టిన జిల్లా వైద్యాధికారి మాధవి.. నేడు మైథిలిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉమ్మడి కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. కరివేన గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. సతీశ్ అనే వ్యక్తి తన భార్యపై అనుమానంతో చలమయ్యపై కోపం పెంచుకున్నాడు. నిన్న చలమయ్య తన బాబాయ్ ఇంటికి వెళ్లిన సమయంలో సతీశ్ గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో చలమయ్యకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటనారాయణ రెడ్డి తెలిపారు.

సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన మళ్లీ వాయిదా పడింది. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో నేడు సీఎం పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. తాజాగా ఈ పర్యటన మళ్లీ వాయిదా పడింది. గతనెల 31న సీఎం పత్తికొండకు రావాల్సి ఉండగా వర్షం కారణంగా పర్యటన రద్దైన విషయం తెలిసిందే.

నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పోలీస్ కార్యాలయంలో ఆళ్లగడ్డ సబ్ డివిజన్‌కు సంబంధించి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరు, పురోగతిపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీశారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించాలి.

పెద్దకడబూరులోని ఆది ఆంధ్ర MPP స్కూళ్లో పనిచేస్తున్న HM సుప్రసాద్ పై పోక్సో కేసు నమోదైనట్లు ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు. కాగా ఆయన ఈ ఏడాది ఆగస్టులో బాలికలకు ఫోన్లో అసభ్యకర వీడియోలను పంపించారు. దీనిపై MEO సువర్ణల సునియం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మంగళవారం కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల నిన్న రాత్రి వరకు కురిసిన వర్షానికి లోత్టటు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నందవరం మండలం కనకవీడు గ్రామంలో నరసింహుడు అనే వ్యక్తి మట్టి మిద్దె వర్షానికి కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకుపోవడంతో ప్రమాదం తప్పింది. పలు చోట్ల వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

బేతంచెర్ల పట్టణానికి చెందిన డీజే మధు డాన్స్ బృందం విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి ప్రథమ స్థానం కైవసం చేసుకుని రూ.50వేల నగదు బహుమతిని అందుకున్నారు. విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీలకు 17 జట్లు హాజరయ్యాయి. ఈ పోటీల్లో బేతంచెర్ల డీజే మధు బృందం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా పట్టణవాసులు బృందం సభ్యులను అభినందించారు.

ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీగా ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. ఒకేసారి 42 మంది ఎంపీడీవోలకు స్థానాలు కేటాయిస్తూ జెడ్పి సీఈవో నాసరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ముగ్గురు ఎంపీడీవోలను కడప జిల్లా నుంచి జిల్లాకు కేటాయించగా, మరో ఆరుగురు ఎంపీడీవోలను అనంతపురం జిల్లా నుంచి కర్నూలు జిల్లాకు కేటాయించారు.
Sorry, no posts matched your criteria.