India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవం పలు కారణాలతో వాయిదా పడింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ సుధీర్ ప్రేమ్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాన్వకేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు గమనించాలని కోరారు.
నిరుద్యోగులకు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి దీప్తి పేర్కొన్నారు. సీ.క్యాంపులోని కార్యాలయంలో వివిధ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించారు. ఇనోవిజన్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ప్రై. లిమిటెడ్, జియో టవర్స్, నవభారత్ ఫర్టిలైజర్స్, అమర్ రాజా కంపెనీల వారు హాజరయ్యారు. మొత్తం 197 మంది హాజరు కాగా.. 64 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఆమె తెలిపారు.
ముస్లింల బక్రీద్ పండగ పురస్కరించుకొని పొట్టేళ్లకు భలే గిరాకీ ఏర్పడింది. ధరలు ఒక్కసారిగా అధికమయ్యాయి. ఆదోని సంతలో శుక్రవారం జత పొట్టేళ్ల ధర ఏకంగా రూ.1.10 లక్షలు పలికింది. వీటిని ఆదోని పట్టణం మేతర్ మసీదు ప్రాంతానికి చెందిన ఖాజా, ఖురేషి ఇబ్రహీం కొనుగోలు చేశారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాల శాఖ కేటాయించారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ప్రతిపక్ష హోదాలో టీడీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అధికారంలోకి వస్తే రోడ్లను బాగు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ శాఖ మన జిల్లా మంత్రికి కేటాయించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాలకు చెందిన ధర్మారెడ్డిని టీటీడీ ఈవో పదవి నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో YCPకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను తొలగిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ధర్మారెడ్డిని ఇటీవలే సీఎస్ నీరభ్ కుమార్ సెలవులపై పంపారు.
శ్రీశైలం దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో ఊయలసేవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. లోక కల్యాణాన్ని ఆకాంక్షిస్తూ విశేషంగా ప్రతి శుక్రవారం రోజు పౌర్ణమి , మూలానక్షత్రం రోజులలో స్వామి, అమ్మవార్లకు ఊయలసేవ కార్యక్రమం దేవస్థానం సేవగా నిర్వహిస్తారు. శ్రీస్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహించి భక్తులకు దర్మనం కల్పిస్తారు.
నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండీ ఫరూక్ 1985లో తొలిసారి MLAగా ఎన్నికై ఉమ్మడి ఏపీలో ఎన్టీ రామారావు కేబినెట్‌లో చక్కర, వక్ఫ్&ఉర్దూ అకాడమీ శాఖ మంత్రిగా చేశారు. 1999లో చంద్రబాబు కేబినెట్‌లో ఉన్నత విద్యా, ఉర్దూ అకాడమీ, మున్సిపల్ శాఖలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం 2018లో మైనారిటీ సంక్షేమ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. ప్రస్తుతం మైనార్టీ సంక్షేమం, న్యాయ శాఖలు కేటాయించారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయించారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, గృహ నిర్మాణ శాఖ, ఎన్ఎండీ ఫరూక్‌కు ముస్లిం మైనార్టీ సంక్షేమం, న్యాయశాఖ, టీజీ భరత్‌కు పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలు కేటాయించారు. బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ తొలిసారి మంత్రులు కాగా.. ఫరూక్ నాలుగో సారి మంత్రి కావడం గమనార్షం.
ఆలూరు వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన విరుపాక్షి చిప్పగిరి మండల జడ్పీటీసీ పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆ పత్రాన్ని కర్నూలు కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సృజనకు అందించారు. విరుపాక్షి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జడ్పీటీసీ ఎన్నికల్లో చిప్పగిరి మండలం నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఆడుదాం ఆంధ్రా, CM కప్ పేరిట అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం CEO ఆర్డీ ప్రసాద్ ఆరోపించారు. ఆ రెండు కార్యక్రమాల పేరిట రూ.100 కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వీటిపై విచారణ చేయాలని తాను CIDకి ఫిర్యాదు చేశానని చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో ఇంజినీరింగ్, IIITలో అడ్మిషన్లు పొందిన వారిపైనా విచారణ చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.