India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం చంద్రబాబు కేబినెట్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు 3 మంత్రి పదవులు దక్కిన సంగతి తెలిసిందే. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్, నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండీ ఫరూక్, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి నిన్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి శాఖలు కేటాయించాల్సి ఉంది. YCP ప్రభుత్వంలో ఇద్దరే మంత్రులుగా చేశారు. ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రిగా గుమ్మనూరు జయరాం పనిచేశారు.
మహానంది మండలం సీతారామపురం సమీపంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. నాగులు అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో స్కూటర్‌పై నంద్యాల వైపు నుంచి, గాజులపల్లె వైపు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. నాగులు అక్కడికక్కడే మృతిచెందగా.. భర్త బాబు, పిల్లలకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఉమ్మడి జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతానని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ‘ఉన్నతాధికారులతో సమావేశమై ఏ ప్రాజెక్టులను ముందుగా చేపడితే మంచిదన్న అంశాలను సమీక్షిస్తా. ఏ ప్రాజెక్టులతో ఎక్కువ మందికి ప్రయోజనం?, ఏవి వేగంగా పూర్తవుతాయి, జిల్లాకు మేలు చేసే ప్రాజెక్టులు ఏమిటి? పెండింగ్‌లోని ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి? తదితర విషయాలను విశ్లేషించి నిర్ణయం తీసుకుంటా’ అన్నారు.
ఎన్ఎండీ ఫరూక్ నాలుగోసారి మంత్రి పదవిని దక్కించుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉమ్మడి జిల్లాలో రహదారులు దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. వాటి మరమ్మతులకు ప్రాధాన్యం ఇస్తా. తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. కర్నూలు నుంచి నంద్యాలకు నూతన రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా. పలు పరిశ్రమలు రావడానికి కృషి చేస్తా’ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, NMD ఫరూఖ్, టీజీ భరత్ పాల్గొన్నారు. కాగా రేపటిలోగా నూతన మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ శాఖ వరిస్తుందోనని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, NMD ఫరూఖ్, టీజీ భరత్ పాల్గొన్నారు. కాగా రేపటిలోగా నూతన మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ శాఖ వరిస్తుందోనని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
నందికొట్కూరు పట్టణానికి చెందిన చిత్రకారుడు దేశెట్టి శ్రీనివాసులు నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం పురస్కరించుకొని పచ్చి టెంకాయ పై దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి పవన్ కళ్యాణ్ చిత్రాలను గీసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నాను ఆయన తెలిపారు.
కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈయనకు మంత్రి పదవి రావడం తొలిసారి. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోదీకి నమస్కరించి కాసేపు ముచ్చటించారు.
చంద్రబాబుకు విధేయుడిగా ఉన్న బనగానపల్లె MLA బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటుదక్కింది. ఉమ్మడి జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వగా.. రెడ్డి సామాజికవర్గం నుంచి బీసీ జనార్దన్ రెడ్డికి అవకాశం దక్కింది. ఈయన 2014లో ఎమ్మెల్యేగా తొలిసారిగా గెలిచారు. 2019లో ఓడిపోయినా పార్టీ కష్టకాలంలో అండగా నిలబడ్డారు. ఆయన విధేయతకు ఎన్నికలకు ముందు నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఇన్‌ఛార్జ్‌గా చంద్రబాబు నియమించారు.
ఆళ్లగడ్డ నుంచి గెలుపొంది భూమా అఖిల ప్రియకు నిరాశ ఎదురైంది. తల్లి శోభా నాగిరెడ్డి మరణంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆమె.. 2014 ఉప ఎన్నికలో YCP తరఫున MLAగా ఏకగ్రీవమయ్యారు. 2016లో TDPలో చేరి చంద్రబాబు మంత్రివర్గంలో పర్యాటక, తెలుగు భాష, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో ఓటమి చెందినా ఈ ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. మరోసారి మంత్రి పదవి వస్తుందని భావించినా చివరికి నిరాశ ఎదురైంది.
Sorry, no posts matched your criteria.