India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంత్రి పదవి ఆశించిన సీనియర్లకు నిరాశ ఎదురైంది. జిల్లాకు 3 మంత్రి పదవులు దక్కాయి. సీనియర్ నాయకులు కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి, బీవీ జయనాగేశ్వర రెడ్డి, బుడ్డా రాజశేఖర రెడ్డి కేబినెట్‌లో చోటు దక్కుతుందని భావించారు. అయితే సీనియర్ నేతలు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, యువ నేత టీజీ భరత్‌కు మాత్రమే దక్కింది. ఇటు కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన పార్థసారథికి కూడా దక్కలేదు.
కర్నూలు MLA టీజీ భరత్‌ను మంత్రి పదవి వరించింది. జిల్లా నుంచి ఈయనకు మాత్రమే కేబినెట్‌లో స్థానం దక్కింది. భరత్ 2019లో పోటీ చేసి ఓడినా.. ఈ ఎన్నికల్లో YCP అభ్యర్థి ఇంతియాజ్‌పై భారీ మెజారిటీతో తొలిసారి గెలుపొందారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా వైశ్యుల నుంచి రాష్ట్రంలో కేటాయించిన ఒకేఒక్క మంత్రి పదవి భరత్‌కు చంద్రబాబు కేటాయించారు. దీంతో భరత్ అభిమానులు, TDP నేతలు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు వరించాయి. నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండీ ఫరూఖ్, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్‌కు కేబినెట్‌లో చోటు దక్కింది. మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. కాగా, ఉమ్మడి జిల్లాలో 11 స్థానాల్లో టీడీపీ, 2 స్థానాల్లో వైసీపీ, ఒకటి బీజేపీ గెలుపొందాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. బుధవారం ఉదయం 10.00 గంటల నుంచి ఈ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుందన్నారు.
ఈనెల 13న పాఠశాలలో పునః ప్రారంభిస్తున్నట్లు కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్యామల్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 13వ తేదీన ప్రారంభమవుతాయని తెలిపారు.
నీటికుంటలో పడి మూడేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామపంచాయతీలోని సంఘాలకు చెందిన మహానంది, గాయత్రి దంపతుల కుమారుడు అనిల్(3) ఆడుకోవడానికి బయటకి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గ్రామంలోని బీసీ కాలనీలోని నీటి కుంటలో పడి మృతిచెందారు.
ఉమ్మడి జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయాల ప్రాంగణాల్లో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని భారీ తెరలపై వీక్షించే ఏర్పాట్లు చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ‘లైవ్ స్ట్రీమింగ్’ విధానంలో తెరలపై ప్రదర్శిస్తారు. నియోజకవర్గంలో ఒకచోట ఎక్కువ మంది వీక్షించేలా భారీ తెరలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
కర్నూలును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని ఏ-కన్వెన్షన్ హోటల్‌లో శాసనసభా పక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ, బీజేపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కర్నూలును జ్యుడీషియల్ రాజధానిగా ప్రకటించిందని, కానీ ఏమీ చేయలేదని అన్నారు. సీమలో కూటమికి మంచి సీట్లు వచ్చాయని చెప్పారు.
కర్నూలు మండల పరిధిలోని పడిదంపాడు వద్ద కేసీ కాలువకు గండి పడింది. వర్షాలకు వాగులు, వంకలు పొంగి ఉద్ధృతంగా ప్రవహించడంతో కేసీ కాలువలోకి పెద్దఎత్తున నీరు చేరి కట్ట కొంతమేర తెగిపోయింది. నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. నీటి ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టిన వెంటనే మరమ్మతులు చేస్తామని కేసీసీ కర్నూలు డీఈఈ రఘురామిరెడ్డి, ఏఈ చిన్నరాజా తెలిపారు.
జడ్పీ సర్వసభ్య సమావేశం 19వ తేదీ ఉదయం 11 గంటలకు ఛైర్మన్ అధ్యక్షతన నిర్వహించను న్నట్లు సీఈవో జి.నాసర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, నీటి పారుదల శాఖలపై సమీక్షించనున్నట్లు చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు హాజరు కావాలని కోరారు.
Sorry, no posts matched your criteria.