India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో YCP, TDPలకు SDPI గట్టి పోటీ ఇచ్చిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అబ్దుల్ సత్తార్ పేర్కొన్నారు. నంద్యాలలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మహబూబ్ బాషా అధ్యక్షతన శ్రీశైలం నియోజకవర్గ నాయకుల సమావేశం ఆదివారం నిర్వహించారు. అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ.. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వార్డు, బూత్ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు.
డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు విజయవాడలోని ఎన్జీవో హోంలో జరిగాయి. ఈ కౌన్సిల్‌లో రాష్ట్ర కమిటీలోకి కర్నూలు జిల్లాకు చెందిన కరె కృష్ణను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా గట్టు తిమ్మప్పను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా సంఘం నాయకులు తెలిపారు. ఎన్నికైన వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని అన్నారు.
వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లెలో పట్టపగలే దారుణం జరిగింది. గ్రామానికి చెందిన గిరి చౌదరి అనే వ్యక్తిని సాయంత్రం కొందరు దారుణ హత్య చేశారు. ఈ సమాచారం అందుకున్న వెల్దుర్తి పోలీసులు ఘటనా స్థలం చేరుకుని హత్యకు గల కారణాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కర్నూలులోని యునైటెడ్ క్లబ్ ఆవరణలో రాష్ట్రస్థాయి కరాటే పోటీలను మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్ పర్సన్ శమంతకమణి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలు తమను తాము రక్షించడంతో పాటు ఇతరులను రక్షించేందుకు కరాటే సాధన ఉపకరిస్తుందన్నారు. పోటీల నిర్వాహక కార్యదర్శి ఆర్.హుస్సేన్ మాట్లాడుతూ.. వివిధ జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు.
నంద్యాలలో ఆదివారం నిర్వహించిన లా సెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని సెట్ కన్వీనర్ తెలిపారు. 90 శాతం మేర అభ్యర్థులు హాజరయ్యారని వెల్లడించారు. అభ్యర్థులు మాట్లాడుతూ.. గతంలో కంటే ఈసారి ప్రశ్నాపత్రం కఠినంగా ఉందని తెలిపారు. నిమిషం నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేశారన్నారు. దీనివల్ల శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలలో ఆలస్యంగా వచ్చిన ఒక అభ్యర్థిని పరీక్ష రాయకుండానే వెను తిరిగారని పేర్కొన్నారు.
కొత్తపల్లి మండల పరిధిలో ప్రవహించే కృష్ణ నది తీరంలో వలస పక్షులు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. సంగమేశ్వరం ఆలయ సమీపంలో ఒకవైపు పచ్చదనంతో కూడుకున్న నల్లమల అడవులు మరోవైపున ప్రవహించే కృష్ణ నది తీరంలో వలస పక్షుల అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఆదివారం సెలవు కావడంతో సంగమేశ్వరం ఆలయానికి వచ్చిన భక్తులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.
ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం సాయంత్రం జరిగింది. ఆదివారం పోలీసుల తెలిపిన వివరాలు.. మిడుతూరు మండలం అలగనూరు గ్రామానికి చెందిన మక్బుల్ బాషా(25) ట్రాక్టర్‌తో వ్యవసాయ పనులు చేసుకోవడానికి పోలానికి వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఎస్సార్ బీసీ కాలువలో పడింది. ఈ ఘటనలో మక్బుల్ కాలువలో పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.
కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రొళ్ల మండలం పిల్లిగుండ్లపల్లికి తేజేశ్వర్ రెడ్డిగా గుర్తించారు. ఆదివారం ఉదయం మెడికల్ కాలేజీలోని రీడింగ్ రూమ్‌లో చదువుకొని హాస్టల్‌కి బైక్‌పై వెళుతుండగా బుదవారంపేట పెట్రోల్ బంక్ సమీపంలో వెనుక నుంచి నందికొట్కూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తేజేశ్వర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.
కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో శనివారం జరిగిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలో ముగ్గురు విద్యార్థులు మాస్ కాఫీయింగ్‌కు పాల్పడుతూ డీబార్ అయ్యారు. ఉదయం జరిగిన పరీక్షకు 87 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 91 శాతం విద్యార్థులు హాజరయ్యారని సంబంధిత అధికారులు వెల్లడించారు.
ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మోదీ, ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రాలను బియ్యపు గింజలపై పెయింటింగ్ వేసి తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
Sorry, no posts matched your criteria.