Kurnool

News June 9, 2024

యర్రగుంట్ల SBIలో వ్యాపించిన మంటలు

image

శిరివెళ్ల మండల పరిధిలోని యర్రగుంట్ల మేజర్ పంచాయతీ గ్రామంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది, పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News June 8, 2024

కర్నూలు: జీడీపీకి చేరుతున్న వరద నీరు

image

గాజులదిన్నె ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జీడీపీలోకి దాదాపు 1100 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరినట్లు ఏఈ మహమ్మద్ అలీ తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో 0.7 టీఎంసీలకు చేరిందని వెల్లడించారు. 4.5 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాల కోసం కర్నూలుకు 30 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు తెలిపారు.

News June 8, 2024

నంద్యాల: రేపు లా సెట్ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

image

లా సెట్ పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నట్లు లా సెట్ కన్వీనర్ తెలిపారు. నంద్యాలలోని శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలలో ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తామన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలని తెలిపారు.

News June 8, 2024

డీసీసీ బ్యాంక్ ఛైర్ పర్సన్ పదవికి విజయ మనోహరి రాజీనామా

image

డీసీసీ బ్యాంక్ ఛైర్ పర్సన్ పదవికి వైసీపీ నేత విజయ మనోహరి శనివారం రాజీనామా చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అతి తక్కువ సమయం ఛైర్మన్‌గా పనిచేశానని అన్నారు. విధి నిర్వహణలో తనకు సహాయ సహకారాలు అందించిన బ్యాంకు అధికారులకు, సిబ్బందికి, APCOB వారికి, ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన 99 సహకార సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా రుణపడి ఉంటానని అన్నారు.

News June 8, 2024

కర్నూలు: పోలీసులనూ వదలని సైబర్ నేరగాళ్లు

image

కర్నూలు జిల్లాలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలనే కాకుండా పోలీసులకు సైతం కుచ్చుటోపీ పెట్టి సవాల్ విసురుతున్నారు. తాజాగా కోడుమూరు సీఐ మన్సురుద్దీన్ అకౌంట్ నుంచి రూ.2.20 లక్షలు కొట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న తన ఖాతా నుంచి డబ్బులు మాయమైనట్లు సీఐ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

News June 8, 2024

నంద్యాల జిల్లాలోని మండలాలలో వర్షపాతం వివరాలు

image

నంద్యాల జిల్లాలో 16 మండలాలలో వర్షపాతం నమోదైంది. జిల్లాలో బేతంచెర్ల మండలంలో అత్యధికంగా 65.8 మి.మీ వర్షపాతం నమోదైంది. గోస్పాడు 46.2మి.మీ పాణ్యం 44.6, బండి ఆత్మకూరు 42.6, ఉయ్యాలవాడ 42.4, దొర్నిపాడు 42.2 మిమీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యల్పంగా గడివేముల 3.4 మిమీ, డోన్ 0.8 వర్షపాతం నమోదైంది.

News June 8, 2024

అక్షర యోధుడు అస్తమించారు: కలెక్టర్ సృజన

image

ఈనాడు గ్రూప్ అధినేత, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత డా.రామోజీరావు మృతిపై కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఓ శకం ముగిసింది. కానీ వారసత్వం జీవిస్తుంది. లెజెండరీ రామోజీరావు కన్నుమూశారు. ఆయనను కలవడం గొప్ప గౌరవం’ అని కలెక్టర్ రాసుకొచ్చారు. గతంలో రామోజీరావును తన భర్త రవితేజతో కలిసిన ఓ ఫోటోను కలెక్టర్ సృజన ట్విటర్ వేదికగా పంచుకున్నారు.

News June 8, 2024

కర్నూలు: తండ్రీకోడుకులు టీడీపీ నుంచి 6సార్లు గెలుపు

image

ఎమ్మిగనూరులో తండ్రీకొడుకులు ఆరుసార్లు గెలుపొందారు. మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వరుసగా 1985 నుంచి1999 వరకు వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. ఆయన వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన బీవీ జయనాగేశ్వరరెడ్డి 2014 ఎన్నికల్లో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకపై రెండోసారి గెలిచి టీడీపీ జెండా ఎగరవేశారు.

News June 8, 2024

మద్దికేర: ఒక్కరోజు ఎస్సైగా మాత్రమే విధులు

image

మద్దికేర పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వెంకటరామిరెడ్డి ఎస్ఐగా పదోన్నతి పొంది ఒక్క రోజు మాత్రమే పని చేశాడు. 31వ తేదీన జిల్లా ఉన్నతాధికారులు ఎస్ఐగా పదోన్నతి ఇచ్చారు. అదే రోజు పదవి విరమణ చేశారు. అయితే ఎక్కడ కూడా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకపోవడంతో మద్దికెర స్టేషన్‌లోనే పదవి విరమణ పొందారు. డి. ఎస్. పి సీఐ ఎస్ఐలు తోపాటు, సిబ్బంది బంధుమిత్రులు ఆయనను సత్కరించడం జరిగింది.

News June 8, 2024

ఆలూరు నియోజకవర్గం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు

image

సార్వత్రిక ఎన్నికల్లో ఆలూరు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యేగా చిప్పగిరి మండల కేంద్రానికి చెందిన విరూపాక్షి, ఆలూరు మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ IAS ఆఫీసర్ బర్ల రామాంజనేయులు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామానికి చెందిన గుమ్మనూరు జయరాం గుంతకల్లు ఎమ్మెల్యేగా గెలిచారు.