Kurnool

News June 8, 2024

కర్నూలు జిల్లాలో మంత్రి ఛాన్స్ ఎవరికో..?

image

ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు దాదాపు క్లీన్ స్వీప్ చేయడంతో మంత్రి పదువులకు పోటీ పెరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ సాగుతోంది. జిల్లాల సంఖ్య పెరగడంతో ప్రతి జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన నేపథ్యంలో జిల్లాకు ఒకటి లేదా రెండు కంటే మించి మంత్రి పదవులు దక్కకపోవచ్చన్న చర్చ నడుస్తోంది. జిల్లాలో మంత్రి పదవి ఎవరికి వస్తుందని భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

News June 8, 2024

ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ.. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను అందరి సమస్వయంతో దిగ్విజయంగా పూర్తి చేసిన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News June 7, 2024

కర్నూలు: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య 

image

పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన జామున కైరన్ బీ(26) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. పుట్టింటికి పంపలేదని అత్తింటి వేధింపులతో తాళలేక మనస్తాపంతో వేకువజామున ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

News June 7, 2024

అవుకు మండలంలో పొంగిపొర్లుతున్న వాగు

image

అవుకు మండల పరిధిలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, ఎర్రమల కొండలనుంచి పారే జక్కలేరు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొండల మధ్య నుంచి పారుతున్న జక్కలేరు వంక జలపాతాలు పకృతి అందాలు ఊటీని తలపిస్తూ పర్యాటకులకు కన్నుల పండుగగా కనిపిస్తుంది. అటు వర్షపు నీటి కారణంగా రిజర్వాయర్‌లో నీటి శాతం పెరిగి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News June 7, 2024

కర్నూలు: 25 ఏళ్ల తర్వాత.. 5 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ విజయకేతనం ఎగరవేసింది. 2014లో ముగ్గురు ఎమ్మెల్యేలకు పరిమితమైన టీడీపీ ఈ ఎన్నికల్లో 11 స్థానాల్లో గెలుపొందారు. జిల్లాలోని పాణ్యం, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరులో 25 ఏళ్ల తర్వాత మెుదటిసారి టీడీపీ గెలుపొందింది. కాగా కోడుమూరులో 39 ఏళ్ల తర్వాత మెుదటిసారి టీడీపీ జెండా ఎగరవేసింది.

News June 7, 2024

కర్నూలు: తండ్రీకుమారులు ఒకే పార్టీతో ప్రవేశం.. విజయం

image

తండ్రీకుమారులు టీజీ వెంకటేశ్, టీజీ భరత్ ఇద్దరూ టీడీపీతోనే రాజకీయ రంగప్రవేశం చేసి విజయం సాధించారు. టీజీ వెంకటేశ్ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా1999లో రాజకీయ ప్రవేశం చేసి గెలుపొందారు. ఆయన కుమారుడు టీజీ భరత్ 2019లో టీడీపీ నుంచి రాజకీయ ప్రవేశం చేసి ఎన్నికల్లో ఓడిపోయారు. కాగా 2024లో వైసీపీ అభ్యర్థి ఏఎండీ ఇంతియాజ్‌పై 18876 ఓట్ల మెజారీటీతో గెలుపొందారు.

News June 7, 2024

రాష్ట్రంలోనే అత్యల్ప ‘నోటా‘ ఓట్లు.. మన కర్నూలుకే

image

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలోనే కర్నూలు అసెంబ్లీ స్థానంలో ‘నోటా’(పై వారెవరూ కాదు)కు తక్కువ ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా నోటా ఓట్లు పోలైన స్థానాల్లో కేవలం 718 ఓట్లతో కర్నూలు అసెంబ్లీ రెండో స్థానంలో నిలిచింది. కాగా విశాఖ దక్షిణం 631 ఓట్లతో మెుదటి స్థానంలో ఉంది.

News June 7, 2024

హొలగుంద: టీబీ డ్యాంకు పెరిగిన ఇన్ ఫ్లో

image

కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్ ఫ్లో గురువారం పెరుగుతోంది. బుధవారం ఇన్ ఫ్లో 517 క్యూసెక్కులు ఉండగా గురువారం 1,670 క్యూసెక్కులకు పెరిగింది. ప్రస్తుతం డ్యాంలో 3.706 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అందులో 10 క్యూసెక్కులు (అవుట్లో ) రాయబసవన కెనాల్‌కు వదులుతున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయానికి 5.029 టీఎంసీల నీరు నిల్వ ఉండేదని తెలిపారు.

News June 7, 2024

తుంగభద్ర జలాశయానికి భారీగా నీరు

image

ఆలూరు నియోజకవర్గ పరిధి లోని తుంగభద్ర జలాశయంలో పూర్తిస్థాయిలో నీరు అడుగంటింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 105.788 టీఎంసీలు కాగా.. 3.373 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టం 1,633.00 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,577. 49 అడుగులు ఉన్నాయి. తుంగభద్ర డ్యాం కు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నీరు రోజురోజుకు పెరుగుతుంది.

News June 6, 2024

ఎమ్మిగనూరు: పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య

image

ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామంలో యువ రైతు వడ్డే బజారి (32) అప్పుల బాధ తాళలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన బళ్లారి ఆస్పత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.