India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అవుకు మండలం సంగపట్నం గ్రామానికి చెందిన చాకలి చిన్న అంకాలు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై రాజారెడ్డి తెలిపారు. మద్యానికి బానిసై భార్య తాగడానికి డబ్బులు ఇవ్వలేదని మనస్థాపం చెంది పేడ రంగు నీటిలో కలుపుకుని తాగాడన్నారు. కుటుంబ సభ్యులు అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టం అంచనా వేసి వాస్తవ నివేదికను సిద్ధం చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. బుధవారం తుగ్గలి మండలం పగిడిరాయిలో దెబ్బతిన్న ఆముదం, సజ్జ, కంది, టమాటా పంట పొలాలను ఆయన పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడారు. ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేశారు? దిగుబడి ఎంత వచ్చింది? అని అడిగి తెలుసుకున్నారు.

నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాలో 196 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పీవీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. 586 మంది యువతీ, యువకులు పాల్గొనగా 196 మంది ఎంపికయ్యారన్నారు. 8 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో ఎన్ఎండీ ఫిరోజ్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఫర్హతుల్లా రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించడం అభినందనీయమని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌ను మంగళవారం ఎస్పీ కార్యాలయంలో అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పుదుచ్చేరిలో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.

నంద్యాల మీదుగా ప్రవహిస్తున్న కుందూ నది, మద్దిలేరు వాగు, పట్టణంలో గల చెరువును మంగళవారం ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పరిశీలించారు. కుందూ నది, మద్దిలేరు వాగులలో నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున ఎస్పీ వాటిని పరిశీలించి వరద ఉద్ధృతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్పీతో పాటు స్పెషల్ బ్రాంచ్ DSP సంతోశ్, రెండో పట్టణ సీఐ ఇస్మాయిల్ ఉన్నారు.

రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్య శాఖ మంత్రి, కర్నూలు నియోజకవర్గ MLA టీజీ భరత్ విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచారు. TGV గ్రూప్ ఆధ్వర్యంలో రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని సీఎం సహాయ నిధికి అందజేశారు. ఇలాంటి కష్టకాలంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సాయంగా విజయవాడ వరద బాధితులకు అండగా నిలవాలని మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు.

నందవరం మండలం నాగులదిన్నెలో విషాదం చోటుచేసుకుంది. కోళ్ల ఫారంలో కూలీ పనికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి ఇమ్మానియేల్(50) అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ పెద్దదిక్కు మృతి చెందడంతో ఆ కుటుబంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.

అనకాపల్లి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కర్నూలు జిల్లా క్రీడాకారులు 12 పతకాలు సాధించిన సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మంగళవారం తన చాంబర్‌లో అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. గెలుపే లక్ష్యంగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. డీఎస్డీఓ పాల్గొన్నారు.

విజయవాడ వరద బాధితులకు నిత్యావసర సరుకులు, వస్తువుల పంపిణీ వాహనాన్ని కర్నూలు ఎంపీ నాగరాజు మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితులలో అండగా నిలవాలని కోరారు. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు.

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ప్రభుత్వ వైన్ షాప్ ఉద్యోగులు 7న బంద్‌కు పిలుపు ఇస్తూ రాష్ట్ర యూనియన్ నిర్ణయం తీసుకుంది. సోమవారం జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, రాష్ట్ర జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జతిన్ రెడ్డి, అడ్వైసర్ నాగచంద్రు కలిసి జిల్లా మద్యం డిపో అధికారులకు బంద్ నోటీసులు ఇచ్చారు. తమకు మరో శాఖలో ఉపాధి కల్పించాలని కోరుతున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.