India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల విధుల్లో పోలీసు సహా అందరి కృషి అభినందనీయమని కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ అభినందించారు. జిల్లాలో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించిన పోలీసు అధికారుల సేవలు ఎనలేనివని ప్రశంసించారు. బుధవారం పోలీస్ ఆడిటోరియంలో విధులు నిర్వహించిన కేంద్ర, రాష్ట్ర పోలీసు సిబ్బందికి, మీడియాకు, అధికారులకు అభినందన సభ నిర్వహించారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక నేత TDP నేతగా బీసీ జనార్దన్ రెడ్డి పేరొందారు. 2014-19 వరకు అప్పటి TDP ప్రభుత్వంలో ఆయన తొలిసారి బనగానపల్లె MLAగా గెలుపొందారు. 2019లో ఓటమిని చవిచూసిన ఆయన.. 2024లో అదే స్థానం నుంచి మరోసారి MLAగా గెలిచారు. దీంతో ఈసారి CM చంద్రబాబు కేబినెట్‌లో బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని TDP శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
నంద్యాల తొలి మహిళా MPగా బైరెడ్డి శబరి రికార్డు నెలకొల్పారు. ఆమె తాత బైరెడ్డి శేషశయనారెడ్డి నందికొట్కూరు MLAగా 3సార్లు గెలిచారు. తండ్రి బైరెడ్డి రాజశేఖరరెడ్డి 1994, 1999లో TDP తరఫున నందికొట్కూరు MLAగా విజయం సాధించారు. శబరి 2014లో పాణ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత BJPలో చేరి ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇటీవల TDPలో చేరి నంద్యాల MPగా 1,36,278 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
1985లో నంద్యాల, కర్నూలు పార్లమెంట్ స్థానాల నుంచి మద్దూరు సుబ్బారెడ్డి, ఏరాసు అయ్యపురెడ్డి విజయం సాధించారు. 1989, 1991, 1996లో టీడీపీ గెలవలేకపోయింది. 1998లో నంద్యాలలో టీడీపీ గెలవగా.. కర్నూలులో కాంగ్రెస్ గెలిచింది. 1999లో కర్నూలు, నంద్యాల స్థానాల నుంచి కేఈ కృష్ణమూర్తి, భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. 2004, 2009, 2014, 2019లో ఓడిపోయింది. ప్రస్తుతం ఈ రెండు చోట్లా టీడీపీ గెలిచింది.
రాంపురం సోదరులుగా పిలువబడే ఎల్లారెడ్డి కుటుంబ సభ్యులకు ఈ ఎన్నికల్లో పరాభవం ఎదురైంది. గత ఎన్నికల్లో ఆదోని, మంత్రాలయం, అనంతపురం జిల్లా గుంతకల్లులో వైసీపీ నుంచి పోటీ చేసి వై.సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, వెంకటరామిరెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనూ అదే పార్టీ, అవే స్థానాల్లో పోటీకి దిగారు. వీరిలో మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి ఒక్కరే గెలవగా.. వెంటకరామిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి ఓటమి చెందారు.
గుమ్మనూరు జయరామ్‌కు అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రజలు పట్టం కట్టారు. వైసీపీ అభ్యర్థిపై 6,826 ఓట్ల మెజార్టీ సాధించారు. 2019లో ఆలూరు నుంచి YCP తరఫున గెలిచి మంత్రిగా పనిచేశారు. 2024లో ఆలూరు నుంచి టికెట్ దక్కకపోవడంతో TDPలో చేరి గుంతకల్లు సీటు దక్కించుకున్నారు. గుమ్మనూరు బ్రదర్స్ నియోజవకవర్గంలో మకాం వేసి గెలుపునకు కష్టపడ్డారు. జిల్లా ఏదైనా విజయం తమదే అంటూ గుమ్మనూరు అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలోని టీడీపీ హవా కొనసాగింది. 7 నియోజకవర్గాల్లో 4 స్థానాల్లో విజయం సాధించింది. కర్నూలు నియోజకవర్గంలో టీజీ భరత్, పత్తికొండలో కేఈ శ్యాంబాబు, కోడుమూరులో బొగ్గుల దస్తగిరి, ఎమ్మిగనూరులో బీవీ జయనాగేశ్వర రెడ్డి గెలిచారు. వైసీపీ కేవలం మంత్రాలయంలో వై.బాలనాగిరెడ్డి, ఆలూరులో బీ.విరుపాక్షి, బీజేపీ పోటీ చేసిన ఒకేఒక్క స్థానం ఆదోనిలో పార్థసారథి విజయం సాధించారు.
గతంలో తల్లి సర్పంచ్ కావడంతో రాజకీయాల్లోకి వచ్చిన బొగ్గుల దస్తగిరి కోడుమూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోడుమూరు ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ తరఫున 1985లో ఎం.శిఖామణి, 2014, 2019లో వైసీపీ గెలవగా.. ఈసారి ఎన్నికల్లో టీడీపీ తరఫున బొగ్గుల దస్తగిరి విజయం సాధించారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాల్లో ఆరుగురు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
☞ కర్నూలు – టీజీ భరత్ (టీడీపీ)
☞ పత్తికొండ – కేఈ శ్యాంబాబు (టీడీపీ)
☞ కోడుమూరు – బొగ్గుల దస్తగిరి (టీడీపీ)
☞ ఆదోని బీకే పార్థసారథి (బీజేపీ)
☞ నందికొట్కూరు – గిత్తా జయసూర్య (టీడీపీ)
☞ ఆలూరు – బుసినే విరుపాక్షి (వైసీపీ)
నంద్యాల జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో టీడీపీ క్వీన్ స్వీప్ చేసింది.
☞ బనగానపల్లె (బీసీ జనార్దన్ రెడ్డి)
☞ ఆళ్లగడ్డ (భూమా అఖిల ప్రియ)
☞ నంద్యాల (ఎన్ఎండీ ఫరూక్)
☞ శ్రీశైలం (బుడ్డా రాజశేఖర రెడ్డి)
☞ నందికొట్కూరు (గిత్త జయసూర్య)
☞ డోన్ (కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి)
☞ పాణ్యం (గౌరు చరితా రెడ్డి) విజయం సాధించారు.
Sorry, no posts matched your criteria.