India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తుగ్గలి నాగేంద్రకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని లక్ష్మికుమ్మరి శాలివాహన కోఆపరేటరేటివ్ సొసైటీ ట్రెజరర్ కుమ్మరి శంకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో కుమ్మరి శాలివాహన సంఘాన్ని గుర్తించి ఐలాపురం వెంకయ్యకు ఎమ్మెల్సీ ఇచ్చారని, 2019లో వైఎస్ జగన్ శాలివాహన సంఘాన్ని గుర్తించి ఎం.పురుషోత్తంకు ఫెడరేషన్ ఛైర్మన్ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు నాగేంద్రకు ఎమ్మెల్సీ ఇవ్వాలన్నారు.
ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా విజయం సాధించిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఎన్నిక పత్రాన్ని కౌంటింగ్ అధికారులచే అందుకున్నారు. వైసీపీ అభ్యర్థి గంగుల నానిపై అఖిల ప్రియ 12037 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో ఎన్నికల అధికారులు ఆమెకు ధ్రువీకరణ పత్రం అందజేశారు. తమ్ముడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, భర్త భార్గవ రాయుడు, ఇతర కుటుంబ సభ్యులు టీడీపీ నాయకులతో కలిసి ఆమె ఎన్నికైన పత్రాన్ని అందుకున్నారు.
నంద్యాలలో ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి తెలిపారు. స్థానిక ఆర్జీఎం కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు చెప్పిన మేరకు ఏజెంట్లు తెల్లవారుజామున 6 గంటలకు చేరుకున్నారన్నారు. భారీ పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.
ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి బీ.విరుపాక్షి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్‌పై 2,831 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2వ రౌండ్, 9, 13, 14, 18, 19, 20, 21, 22 రౌండ్లు మినహా మిగిలిన రౌండ్లలో విరుపాక్షి ఆధిక్యం కనబర్చారు. విరుపాక్షికి మొత్తం 1,00,264 ఓట్లు పోలవ్వగా.. వీరభద్ర గౌడ్‌కు 97,433 ఓట్లు పడ్డాయి. ఈ విజయంతో ఆలూరు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు భారీ మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి బీవై రామయ్యపై 1,02,822 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచి ప్రతి రౌండ్‌లోనూ నాగరాజు ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఎమ్మిగనూరు నియోజకవర్గం ఓటర్ల మద్దతు టీడీపీకి లభించింది. మంగళవారం కర్నూలులోని రాయలసీమ యునివర్సిటీలో ఎమ్మిగనూరు అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జరిగింది. ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి అఖండ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకపై 14,816 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు.
మద్దికేర మండల పరిధిలోని ఎం.అగ్రహారంలో చిన్న బసప్ప కుమారుడు రంజిత్ క్రికెట్ ఆడుతూ ఉండగా ఒక్కసారిగా పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో విద్యార్థి వీరేశ్ స్వల్పంగా గాయపడటంతో గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మృతి చెందిన రంజిత్ ఇటీవల పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించాడు. విద్యార్థి మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఆదోని ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి వై.సాయిప్రసాద్ రెడ్డి పరాజయం పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్థసారధి వాల్మీకి చేతిలో 18,563 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. పార్థసారథి గెలుపుతో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఘన విషయం సాధించారు. వైసీపీ అభ్యర్థి ఏఎండీ ఇంతియాజ్‌పై 19,200 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వీటికి ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలపాల్సి ఉండటంతో మెజారిటీ పెరగనుంది. భరత్‌కు 79,183, ఇంతియాజ్‌కు 58,449 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
మంత్రాలయం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డిపై 12,843 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కాగా వరుసగా 2009లో టీడీపీ నుంచి, 2014, 2019, 2024లో వైసీపీ నుంచి గెలిచి రికార్డు సృష్టించారు.
Sorry, no posts matched your criteria.