India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కిషోర్ రెడ్డిపై 11,950 మెజార్టీతో విజయం సాధించారు. ఫరూక్ గెలవడంతో టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు, అభ్యర్థి కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. దీంతో నంద్యాల పట్టణం పసుపు మయంగా మారింది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గాను 12 స్థానాల్లో TDP ముందంజలో కొనసాగుతోంది. 2 స్థానాల్లో (పత్తికొండ, ఆలూరు) మాత్రమే వైసీపీ ఆధిక్యంలో ఉంది. ఇందులో డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి 12,000 మెజార్టీతో కొనసాగుతున్నారు. శ్రీశైలం బుడ్డా, ఆళ్లగడ్డ అఖిలప్రియ, నంద్యాల ఫరూక్, కర్నూలు భరత్, నందికొట్కూరు జయసూర్య, ఎమ్మిగనూరు బీసీ జయనాగేశ్వర్ రావు, తదితర TDP అభ్యర్థులు ముందున్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌లో భాగంగా నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ముందంజలో కొనసాగుతున్నారు. 113 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. నంద్యాలలోని శాంతిరాం, ఆర్జీఎం కాలేజీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
కర్నూలు నగర శివారులోని రాయలసీమ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లా యంత్రాంగం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు సగటున 10 గంటల నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మొదటిగా మంత్రాలయం.. చివరన పాణ్యం నియోజకవర్గాల ఫలితాలు వెళ్లడి కానున్నాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాన పార్టీలు YCP, TDP మధ్య పోరు బలంగా ఉంటుందని ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనా వేశాయి. నేడు ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఏ సర్వే అంచనాలు నిజం కానున్నాయి. ఎగ్జాక్ట్ పోల్స్ ఆయా సర్వేల అంచనాలను తలకిందులు చేస్తాయా అనేది ప్రజల్లో ప్రశ్నార్థకంగా మారింది. Rtv: YCP-7, TDP-7చాణక్య X: YCP-8, TDP-4, 2 స్థానాలు టఫ్ ఫైట్BIG TV: TDP-8-9, YCP-5-6KK: TDP-11, YCP-3
ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సెగ్మెంట్ స్థానాలకు రాయలసీమ యూనివర్సిటీ, శాంతిరాం ఇంజనీరింగ్, ఫార్మసీ, RGM కళాశాలలో ఇవాళ ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో ఈ ప్రక్రియ ప్రారంభం కానుండగా అనంతరం EVMలను లెక్కించనున్నారు. ఈ క్రమంలో కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు/DEOలు డాక్టర్ జీ.సృజన, డాక్టర్ కే.శ్రీనివాసులు చర్యలు చేపట్టారు.
నైరుతి ఋతుపవనాలు రాయలసీమను తాకడంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. రాబోయే నాలుగు రోజులు పాటు వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి RTV ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. వీరి ప్రకారం TDP-7, YCP-7 స్థానాలో గెలుస్తుందని తెలిపారు. మంత్రాలయం, కోడుమూరు, ఎమ్మిగనూరు, కర్నూలు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లి స్థానాల్లో TDP పాగా వేస్తుందని, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూర్,డోన్, పత్తికొండ, ఆలూరు, ఆదోనిలో YCP గెలిచే అవకాశం ఉందన్నారు. రేపు కౌటింగ్ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సాధారణ ఎన్నికలు-2024 కౌంటింగ్ నిర్వహణపై జనరల్ అబ్జర్వర్స్ జాఫర్, మీర్ తారిఖ్ అలీ, బిపుల్ సైకియా సమక్షంలో మైక్రో అబ్జర్వర్లకు కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్జే మధుసూదన్ రావు, ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులు సోమశేఖర్ రెడ్డి, మారుతి ప్రసాద్, సిద్ధలింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.
గడివేముల నుంచి కర్నూలుకు వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం కాల్వ గ్రామం వద్ద బస్సు డ్రైవర్ ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి బస్సు దూసుకెళ్లింది. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కండక్టర్ ప్రయాణికులను ఇంకో బస్సులో తరలించారు.
Sorry, no posts matched your criteria.