India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నంద్యాల జిల్లా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శోభన్ బాబుకు ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా పడింది. ఈ మేరకు మొదటి అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జ్యోత్స్నాదేవి తీర్పు చెప్పారు. 2019లో కర్నూలులోని ఓ మహిళపై కానిస్టేబుల్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు కాగా విచారణలో నేరం రుజువు కావడంతో జైలు శిక్ష, జరిమానా విధించారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు నంద్యాల జిల్లాకు రానున్నారు. ఉదయం10 గంటలకు ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హుసేనాపురం, పాణ్యం, నంద్యాల బైపాస్ మీదుగా సీతారామపురం చేరుకుంటారు. ఇటీవల హత్యకు గురైన సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

నంద్యాల జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. 20 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా 15 మందికి వివిధ మండలాలకు పోస్టింగ్ ఇవ్వగా, మరో ఐదుగురు ఎస్సైలను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఈ మేరకు ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

నంద్యాల జిల్లాలో రేపు YCP అధినేత, మాజీ CM వైఎస్ జగన్ పర్యటించనున్నట్లు YSRCP (X)లో వెల్లడించింది. ప్రత్యర్థుల దాడిలో మృతి చెందిన నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం సీతారామపురం గ్రామానికి చెందిన YCP కార్యకర్త పెద్ద సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నట్లు పేర్కొంది. కాగా, జగన్ రేపటి నంద్యాల షెడ్యూల్ ను మాజీ MLA కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇప్పటికే మీడియాకు వెల్లడించారు.

ఆస్పిరేషనల్ జిల్లా/బ్లాకులకు సంబంధించిన ఇండికేటర్స్‌లో సెప్టెంబరు 30వ తేదిలోపు పురోగతి సాధించాలని నీతి అయోగ్ సీఈఓ బివిఆర్.సుబ్రహ్మణ్యం అన్ని రాష్ట్రాల జిల్లా కలెక్టర్లకు సూచించారు. గురువారం ఢిల్లీ నీతి అయోగ్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల కలెక్టర్లతో వివిధ అంశాలపై నీతి అయోగ్ సీఈఓ సమీక్ష నిర్వహించారు. కర్నూల్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొన్నారు.

మాజీ సీఎం జగన్ శుక్రవారం మహానంది మండలం సీతారామపురానికి రానున్నారు. వైసీపీ నేత పసుపులేటి సుబ్బరాయుడు ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ వస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మహానంది, బండిఆత్మకూరు మండలాల నుంచి వైకాపా నాయకులు తరలి రానున్నట్లు సమాచారం.

అనంతపురం జిల్లా గుత్తి జీఆర్‌పీ పరిధిలోని రాయలచెరువు రైల్వే స్టేషన్ వద్ద రైల్వే కూలీ (ప్యాకింగ్ మిషన్ కూలీ) మనోహర్(23) గురువారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్‌పీ ఎస్ఐ నాగప్ప చెప్పారు. నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన మనోహర్ కొన్ని రోజులుగా గుత్తి జీఆర్‌పీ పరిధిలో రైల్వే పనులు చేస్తున్నాడు. అయితే అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఎమ్మిగనూరు మండలం కందనాతి వద్ద గురువారం ఉదయం స్కూల్ విద్యా కమిటీ ఎన్నికల విధులకు వెళ్తున్న ఎమ్మిగనూరు రూరల్ ASI బాలా నాయక్, కానిస్టేబుల్ సర్వేశ్వర్ రెడ్డి బైకును ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం వెంటనే కర్నూలు మెడికల్ కళాశాలకు తరలించారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఇద్దరు కొత్త డీఎస్పీలు నియమితులయ్యారు. నంద్యాల డీఎస్పీగా యుగంధర్ బాబు, ఆదోని డీఎస్పీగా డీ.సోమన్నను నియమిస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదోని, పత్తికొండ డీఎస్పీలు జే.శివ నారాయణస్వామి, పీ.శ్రీనివాస రెడ్డిని పోలీస్ హెడ్ క్వార్టర్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కర్నూలు డీఎస్పీ విజయ్ శేఖర్‌ను తిరుమల డీఎస్పీగా నియమించారు.

డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి సోదరి, ప్రముఖ సినీ నిర్మాత ఎం.శ్యాం ప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి బుధవారం రాత్రి 10 గంటల సమయంలో మరణించారు. ఆమె మృతి పట్ల నియోజకవర్గంలోని రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, పలువురు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Sorry, no posts matched your criteria.