Kurnool

News June 2, 2024

కర్నూలు: 4వ సారి వైసీపీ అభ్యర్థి గెలుపు (Exit Polls)

image

మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని పోస్ట్ పోల్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ వైసీపీ నుంచి వై.బాలనాగిరెడ్డి, టీడీపీ నుంచి రాఘవేంద్ర పోటీ పడ్డారు. మరో సర్వే చాణక్య X కూడా బాలనాగిరెడ్డే గెలుస్తారని పేర్కొంది. ఈయన 2009లో టీడీపీ నుంచి, 2014, 2019లో వైసీపీ నుంచి గెలిచారు. ఈ సర్వేలపై మీ COMMENT.

News June 2, 2024

Exit Polls: కర్నూలు జిల్లాలో YCP హవా.. TDP గెలిచే సీట్లు ఇవే..!

image

గత నెలలో జరిగిన సాధారణ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వేలను పలు సంస్థలు నిన్న సాయంత్రం విడుదల చేశాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రజలు మరోసారి వైసీపీకే పట్టం కట్టారని చాణక్య X సర్వే అంచనా వేసింది. మొత్తం 14 నియోజకవర్గాల్లో 8 స్థానాల్లో వైసీపీ, 4 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని పేర్కొంది. మరో 2 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని వెల్లడించింది. ఈ సర్వేపై మీ COMMENT.

News June 2, 2024

జూన్ 30 వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. శనివారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లా మలేరియా అధికారి నూకరాజుతో కలిసి మలేరియా వ్యతిరేక మాసోత్సవ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ప్రజలందరూ దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News June 1, 2024

బిగ్‌టీవీ సర్వే.. కర్నూలు ఎవరికి ఎన్ని సీట్లు అంటే..?

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 సీట్లకు గాను NDA కూటమి 8-9 గెలుస్తుందని బిగ్‌టీవీ సర్వే తెలిపింది. 5-6 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తంమీద 175 అసెంబ్లీ సీట్లకు గాను 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.

News June 1, 2024

కర్నూలు: ఎమ్మెల్యే సీట్లలో కూటమి.. ఎంపీ సీట్లలో వైసీపీ ఆధిపత్యం

image

పోస్ట్ పోల్ సర్వే ప్రకారం.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్డీఏ కూటమికి 7-9 సీట్లు, వైసీపీకి 5-7 ఎమ్మెల్యే సీట్లు రానున్నాయి. మరోపక్క చాణక్య ఎక్స్ సర్వే ప్రకారం.. కర్నూలు, నంద్యాల ఎంపీ స్థానాలను వైసీపీ (బీవై రామయ్య, పోచ బ్రహ్మానంద రెడ్డి) కైవసం చేసుకోనుందని అంచనా వేసింది.

News June 1, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో YCPకి 3 సీట్లే.. కేకే సర్వే

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగిన సాధారణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను కేకే సర్వే వెల్లడించింది. 14 సీట్లలో వైసీపీ కేవలం 3 స్థానాల్లోనే విజయం సాధించబోతుందని కేకే సర్వే వెల్లడించింది. టీడీపీకి 11 సీట్లు వస్తాయని చెప్పింది. కాగా ఈనెల 4న తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్‌పై మీ COMMENT.

News June 1, 2024

కర్నూలు జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లో చెప్పిన చాణక్య స్ట్రాటజీస్ సర్వే

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగిన సాధారణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను చాణక్య స్ట్రాటజీస్ సర్వే సంస్థ వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో 6 చోట్ల వైసీపీ, 6 చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలవనున్నారని తేల్చి చెప్పింది. మరో రెండు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని వెల్లడించింది. కాగా ఈనెల 4న తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి.

News June 1, 2024

బుగ్గన మరోసారి గెలుపు.. ఆరా సర్వే

image

గత నెల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలవబోతున్నారని ఆరా సర్వే తేల్చి చెప్పింది. 2014, 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన బుగ్గన ఈసారి కూడా గెలుపు ఖాయమని చెప్పింది. 2014లో కేఈ కృష్ణమూర్తి, 2019లో కేఈ ప్రతాప్‌లపై గెలిచిన ఆయన.. ఈసారి టీడీపీ నుంచి బరిలో దిగిన కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డికి ఓటమి తప్పదని తేల్చి చెప్పింది.

News June 1, 2024

కర్నూలు జిల్లా ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి

image

మే 13న జరిగిన పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించిన కర్నూలు జిల్లా ప్రజలందరికీ కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి జీ.సృజన ధన్యవాదాలు తెలిపారు. 4న జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ సైతం సజావుగా సాగేలా జిల్లా ప్రజలు సహకరించి, ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. ఏదైనా సమాచారం, ఫిర్యాదుల కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ 08518-277305 నంబరుకు సంప్రదించాలని పేర్కొన్నారు.

News June 1, 2024

పాణ్యం తుది ఫలితం ఆలస్యం: కలెక్టర్

image

పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జీ.సృజన తెలిపారు. ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే ఈ నియోజకవర్గంలో రౌండ్లు అధికంగా ఉన్నాయని, అందువల్ల ఫలితం వెల్లడి ఆలస్యమవుతుందని అన్నారు. తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు అనంతరం EVMలు లెక్కిస్తామని, తుది ఫలితం సాయంత్రం 5:30 గంటలకు విడుదలవుతుందని స్పష్టం చేశారు.