Kurnool

News June 1, 2024

హైకోర్టును ఆశ్రయించిన మంత్రి బుగ్గన

image

2024 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో గత నెల 13న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై బేతంచెర్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. దీంతో ఈ కేసును కొట్టివేయాలని ఏపీ హైకోర్టును బుగ్గన ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ పిటిషన్ న్యాయస్థానం పరిశీలనలో ఉందని, త్వరలోనే విచారణకు వస్తుందని బాధితుడు పీఎన్ బాబు తెలిపారు.

News June 1, 2024

శ్రీశైలం: ఫారెస్ట్ సరిహద్దు పిల్లర్స్ ఏర్పాటుకు చర్యలు

image

శ్రీశైల మహా క్షేత్రంలోని టోల్‌గేట్ , నందీశ్వర డార్మెటరీ వద్ద ఫారెస్ట్ సరిహద్దు పిల్లర్స్ ఏర్పాటుకు సిద్ధం చేశారు. ఫారెస్ట్ ల్యాండ్ సర్వే చేసి సరిహద్దులలో పిల్లర్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎవరూ ఫారెస్ట్ ల్యాండ్‌ను ఆక్రమించకుండా ఉండడం కోసం ఈ పిల్లర్స్ ఏర్పాటు చేస్తున్నామని ఫారెస్ట్ రేంజర్ నరసింహులు తెలిపారు.

News June 1, 2024

శ్రీశైలం: CM జగన్‌ను కలిసిన శిల్పా

image

విదేశీ పర్యటన అనంతరం గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శనివారం తెల్లవారుజామున శ్రీశైలం నియోజకవర్గ MLA శిల్పా చక్రపాణి రెడ్డి కలిశారు. CM జగన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శిల్పా స్వాగతం పలికారు. మరికొంతమంది ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు CMను కలిశారు.

News June 1, 2024

కర్నూలు: రాయలసీమ వర్సిటీకి వరుస సెలవులు

image

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి శుక్రవారం నుంచి ఈనెల 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ నాగుల అంకన్న తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వర్సిటీ పరిధిలో 144 సెక్షన్ విధించారని తెలిపారు. వర్సిటీలోకి ఎవరినీ అనుమతించడం లేదని పేర్కొన్నారు.

News June 1, 2024

నేడే ఎగ్జిట్ పోల్స్.. కర్నూలు జిల్లాలో గెలుపెవరిది.?

image

ఎన్నికల ఫలితాల కోసం కర్నూలు జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి కర్నూలు 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.

News June 1, 2024

నంద్యాల: రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

image

తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆళ్లగడ్డ వాసులు నలుగురు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు .. ఆళ్లగడ్డకు చెందిన ఏడుగురు కారులో హైదరాబాదు బయలుదేరారు. వీరి వాహనం ఎర్రవల్లి చౌరస్తా వద్ద ముందు ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 31, 2024

నంద్యాల జిల్లా అంతటా పోలీసు నిఘా

image

ఎన్నికల ఫలితాలు సమీపిస్తున్న నేపథ్యంలో నంద్యాల జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణంలో శుక్రవారం ప్రత్యేక బలగాలతో పోలీసు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా అంతటా నిఘా ఉంచామన్నారు.

News May 31, 2024

కర్నూలు: తల్లి మృతి.. కొడుకు ఆత్మహత్య

image

తల్లి మరణించడంతో బాధ తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. పగిడ్యాల మండలం ఎస్సీ కాలనీకి గుండెపోగు మహేశ్ అనే యువకుడి తల్లి అనారోగ్యంతో మూడు రోజుల కిందట మరణించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

News May 31, 2024

నంద్యాల: ఈవీఎం స్ట్రాంగ్ రూంల చుట్టుపక్కల రెడ్ జోన్

image

నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి RGM, శాంతిరామ్ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్‌ను తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్‌గా ప్రకటించినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల చుట్టూ 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. ఈ నిబంధనలు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

News May 31, 2024

జూపాడు బంగ్లా : విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి వ్యక్తి మృతి

image

ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన జూపాడు బంగ్లా మండల పరిధిలోని తంగడంచ గ్రామం సమీపంలో శుక్రవారం జరిగింది. పారుమంచాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి జూపాడు బంగ్లాకు వెళ్లి పారుమంచాలకు వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో అతను మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.