Kurnool

News May 31, 2024

మంత్రాలయం ఎన్నికల రిటర్నింగ్ అధికారి బదిలీ

image

మంత్రాలయం -145 నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మురళిని బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన స్థానంలో చెల్లా విశ్వనాథను నియమించారు. మురళి ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, రికార్డులలో సక్రమంగా నమోదు చేయకపోవడం, సిబ్బందికి సరైన సూచనలు ఇవ్వడంలో విఫలమైనట్లు పేర్కొంటూ బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

News May 31, 2024

కర్నూలు జిల్లాలో తొలిఫలితం విడుదల ఇక్కడే..?

image

కర్నూలు జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ రాయలసీమ వర్శిటీలో జరగనుంది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నియోజకవర్గాలకు సంబంధించి 17 నుంచి 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉండనుంది. కాగా తొలిఫలితం మంత్రాలయానిది వెలువడే అవకాశం ఉంది. చివరన ఆలూరు నియోజకవర్గ ఫలితం తెలియనుంది. మధ్యాహ్నం 3.30గంటలకు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎం కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

News May 31, 2024

డోన్: 14 మంది మున్సిపల్ ఉద్యోగులపై కేసు నమోదు

image

టీడీపీ ప్రభుత్వ హయాంలో డోన్ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అవినీతికి బాధ్యులైన 14 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణం, డీజిల్ కొనుగోలులో రూ.24 లక్షల అవినీతి జరిగినట్లు విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. అందుకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

News May 31, 2024

స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన నంద్యాల కలెక్టర్

image

జూన్ 4న నిర్వహించే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. గురువారం పాణ్యం మండలం నెరవాడ గ్రామ సమీపంలోని ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు అనుసంధానంగా కౌంటింగ్ కేంద్రాలలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.

News May 30, 2024

లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేయండి: కలెక్టర్

image

జూన్ 4న నిర్వహించే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు.
గురువారం ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు అనుసంధానంగా కౌంటింగ్ కేంద్రాలలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు.

News May 30, 2024

కర్నూలు: పెళ్లి కావడం లేదని సూసైడ్

image

కర్నూలు బి.క్యాంప్ లో నివాసముంటున్న రఘు నాయక్ (27) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై గదిలో ఉరి వేసుకున్నాడు. తల్లి లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మూడో పట్టణ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు.

News May 30, 2024

గాజులపల్లె : రైల్వే ప్లాట్ ఫాం వద్ద మహిళ మృతి

image

మహానంది మండలం గాజులపల్లె రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం వద్ద గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మహిళ వయసు సుమారు 40 ఏళ్లకు పైగా ఉంటుంది అని, ఆకుపచ్చ చీర ధరించి ఉందన్నారు. గత రాత్రి మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. మృతి చెందిన మహిళ ఎవరు..? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

News May 30, 2024

కర్నూలు : డిగ్రీ పరీక్షలకు 350 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లాలోని రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షలకు బుధవారం 350 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వీసీ సుధీర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. మరోవైపు ఇద్దరు విద్యార్థులు పరీక్షలు రాస్తూ డిబార్ అయినట్లు వీసీ ప్రకటించారు. నాలుగో సెమిస్టర్‌లో మొత్తం 3,709 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 3,359 మంది హాజరయ్యారని వీసీ సుధీర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు.

News May 30, 2024

కర్నూలు: వేరు వేరు ఘటనల్లో ఐదుగురి ఆత్మహత్య

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఒకేరోజు ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదుగురూ కూడా యువకులే కావడం గమనార్హం. శ్రీశైలంలో పూజారి మహేశ్(26), పాణ్యంలో చాకలి మోహన్ వంశీ(23), దేవనకొండ మండలం జిల్లెబుడకల గ్రామంలో కొండమీద హరిచంద్ర(39), కర్నూల్ బి.క్యాంపులో రఘునాయక్(27), పగిడ్యాల మండలకేంద్రంలో రమేశ్(20) ఒకే రోజు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కారణాలు ఏవైనా వీరి ఆత్మహత్య విషాదాన్ని నింపుతోంది.

News May 30, 2024

దేవనకొండ: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం దేనవకొండ మండలంలో జరిగింది. జిల్లేడుబుడకలలో కొండమీద లక్ష్మన్న కుమారుడు బోయ హరిచంద్రుడు(42) అప్పుల బాధ తట్టుకోలేక విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి 5 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం కోసం చేసిన అప్పుల తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు.