Kurnool

News May 23, 2024

పోస్టల్ బ్యాలెట్లన్నీ సురక్షితంగా ఉన్నాయి: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలోని 8 నియోజకవర్గాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లన్నీ జిల్లా ట్రెజరీలో భద్రంగా, సురక్షితంగా ఉన్నాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జీ.సృజన గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లు భద్రపరిచిన జిల్లా ట్రెజరీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటితో పాటు డబల్ లాక్ సిస్టం కూడా ఉందని పేర్కొన్నారు. 24 గంటలూ ఆర్మ్‌డ్ గార్డ్ పర్యవేక్షణ ఉందన్నారు.

News May 23, 2024

నంద్యాల: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

image

ఉపాధి పనులకు వెళ్లి అస్వస్థతకు గురైన వ్యక్తి గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన సంపంగి రవిశేఖర్ ఉదయం ఉపాధి పనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా అస్వస్థతకు గురికావడంతో తోటి కూలీలు చికిత్స నిమిత్తం స్థానిక వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. అయితే కోలుకోలేక గుండెపోటుతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

News May 23, 2024

స్ట్రాంగ్ రూమ్ లైవ్ ఫీడ్‌ను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

రాయలసీమ యూనివర్సిటీలోని కంట్రోల్ రూమ్ నుంచి స్ట్రాంగ్ రూమ్ లైవ్ ఫీడ్‌ను ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి కలెక్టర్ సృజన గురువారం పరిశీలించారు. అనంతరం ఈవీఎంలను భద్రపరచిన లైఫ్ సైన్సెస్ బ్లాక్‌ను, కౌంటింగ్ హాల్‌ను పరిశీలించి సంబంధిత రిజిస్టర్లలో సంతకం చేశారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్, పాణ్యం ఎన్నికల అధికారి నారపురెడ్డి మౌర్య, కర్నూలు రిటర్నింగ్ అధికారి భార్గవ తేజ పాల్గొన్నారు.

News May 23, 2024

నంద్యాల: జూన్ 1తేది నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

image

నంద్యాల: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జూన్ 1 నుంచి ప్రారంభమవుతాయని డీఈఓ సుధాకర్రెడ్డి, ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ లక్ష్మీనారాయణలు తెలిపారు. జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. హాల్ టికెట్‌లను https://apopenschool.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

News May 23, 2024

కోడుమూరులో ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరు బాలికల మృతి

image

కోడుమూరు శివారులోని గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరియాణాకు చెందిన ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఇద్దరు బాలికలు మృతిచెందగా.. 20మందికి పైగా గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి బళ్లారి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 వాహనాల్లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News May 23, 2024

కర్నూలు: మహిళల మృతిలో వీడిన మిస్టరీ

image

నగరవనం చెరువులో మహిళల మృతి కేసులో ఆటోడ్రైవర్ మమబూబ్ బాషాను అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాలు..మహబూబ్‌నగర్(D)కు చెందిన జానకి, అరుణలు వేశ్యవృత్తిలో కొనసాగుతూ కర్నూలు వచ్చేవారు. ఈక్రమంలో బాషాతో పరిచయం ఏర్పడింది. మనస్పర్థలతో జానకి అతడిని కొట్టించింది. ఈనెల19న వారిద్దరు బాషా ఆటోలోనే బట్టలు ఉతకడానికి వెళ్లారు. అవకాశం కోసం చూస్తున్న బాషా జానకిని చెరువులోకి తోశాడు. కాపాడే క్రమంలో అరుణ కూడా మునిగిపోయింది.

News May 23, 2024

పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడండి: కలెక్టర్

image

10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు.

News May 22, 2024

24 నుంచి ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు: ఆర్ఐఓ

image

ఈ నెల 24 నుంచి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నామని ఆర్ఐఓ గురువయ్య శెట్టి తెలిపారు. బుధవారం నగరంలోని ఆర్ఐఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మొదటి సంవత్సరానికి 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అందులో 15,981 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, 2వ సంవత్సరానికి 22 పరీక్షా కేంద్రాలలో 6,962 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

News May 22, 2024

ఈనెల 27 లోగా ఫామ్-18లో ఏజెంట్ల వివరాలు ఇవ్వండి: కలెక్టర్

image

పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు రాజకీయ పార్టీ ప్రతినిధులతో అన్నారు. నంద్యాల కలెక్టర్ ఛాంబర్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీల ఏజెంట్ల పాసుల జారీకి సంబంధించి ఈనెల 27వ తేదీలోగా కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను ఫామ్-18 ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు.

News May 22, 2024

అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇసుక అక్రమ త్రవ్వకాలను అరికట్టేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నంద్యాల కలెక్టర్ కే.శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం ఆయన ఇసుక అక్రమ తవ్వకాలపై కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అక్రమ ఇసుక రవాణా, తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించి అరికట్టాలని సబ్ డివిజనల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సిబ్బందిని అప్రమత్తం చేసి అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు.