Kurnool

News May 22, 2024

ఈనెల 27 లోగా ఫామ్-18లో ఏజెంట్ల వివరాలు ఇవ్వండి: కలెక్టర్

image

పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు రాజకీయ పార్టీ ప్రతినిధులతో అన్నారు. నంద్యాల కలెక్టర్ ఛాంబర్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీల ఏజెంట్ల పాసుల జారీకి సంబంధించి ఈనెల 27వ తేదీలోగా కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను ఫామ్-18 ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు.

News May 22, 2024

అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇసుక అక్రమ త్రవ్వకాలను అరికట్టేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నంద్యాల కలెక్టర్ కే.శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం ఆయన ఇసుక అక్రమ తవ్వకాలపై కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అక్రమ ఇసుక రవాణా, తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించి అరికట్టాలని సబ్ డివిజనల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సిబ్బందిని అప్రమత్తం చేసి అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు.

News May 22, 2024

స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు: ఎస్పీ

image

నంద్యాల పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆర్జీఎం, శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలల వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా చర్యలు అత్యంత పకడ్బందీగా చేపట్టామని నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా ఏర్పాటు చేశామని తెలిపారు.

News May 22, 2024

విధులకు హాజరు కాని వారిపై చర్యలకు కలెక్టర్ ఆదేశం

image

ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో విధులకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జీ.సృజన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 79 మంది ఉపాధ్యాయులు, 21 మంది ఇతర శాఖలకు చెందిన అధికారులు ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారు. ఎందుకు హాజరు కాలేదని సంబంధిత అధికారులు మంగళవారం వారిని వివరణ కోరారు. వివరణ ఇవ్వని వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

News May 22, 2024

ఆదోనిలో ఓటువేయడంలో వెనుకబాటు

image

సార్వత్రిక ఎన్నికలు హోరాహోరిగా జరిగాయి. 2019 ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఆదోని నియోజకవర్గం ఓటర్లు ఇందుకు భిన్నంగా ఉన్నారు. ఆదోనిలో 66.5శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. నియోజకవర్గంలో 2,63,058మంది ఓటర్లు ఉండగా..1,75,064మంది ఓటు వేశారు. 87,994మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు.

News May 22, 2024

కర్నూలు: కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన ఎస్పీ

image

కర్నూలులో ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో భాగంగా ఎన్నికల విధులు వేసిన చోట కాకుండా వేరే బూత్‌లో విధులు నిర్వహించిన కానిస్టేబుల్ కామేశ్ నాయక్‌ను ఎస్పీ కృష్ణకాంత్ సస్పెండ్ చేశారు. కామేశ్ నాయక్ కృష్ణానగర్‌లో ఉన్న ఓ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులకు డ్యూటీ వేశారు. ఆయన సిల్వర్ జూబ్లీ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓట్లు వేయించారని వైసీపీ నాయకుల ఫిర్యాదు మేరకు ఆయనను సస్పెండ్ చేశారు.

News May 22, 2024

స్ట్రాంగ్ రూమును పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో ఈవీఎం మిషన్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ను జిల్లా కలెక్టర్ సృజన, ఎస్పీ కృష్ణ కాంత్ మంగళవారం పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన కంట్రోల్ రూమ్ నుంచి లైవ్ ఫీడ్ వారు పరిశీలించారు. రాయలసీమ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్, లైబ్రరీ సైన్స్ బ్లాక్ పరిసరాలను వారు పరిశీలించారు. పాణ్యం ఆర్ఓ నారపు రెడ్డి మౌర్య, కర్నూలు ఆర్వో భార్గవ తేజ్ పాల్గొన్నారు.

News May 21, 2024

నంద్యాల: బంధువుల ఇంటికి పంపలేదని ఆత్మహత్య

image

చాగలమర్రిలోని చింతచెరువు రస్తాకు చెందిన బొర్ర వెంకటసుబ్బమ్మ(52) పురుగుల మందు తాగి మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. బంధువుల ఇంటికి పంపలేదన్న కారణంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగింది. కుటుంబీకులు స్థానిక కేరళ వైద్యశాలకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 21, 2024

కౌంటింగ్ హాలులోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదు: కలెక్టర్

image

రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జీ.సృజన రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై పలు పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ హాలులోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదని తెలిపారు.

News May 21, 2024

22, 23న విద్యార్థులకు కౌన్సిలింగ్

image

22, 23వ తేదీల్లో ఇంటర్మీడియట్ మొదటి ఏడాదికి సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు అర్హత పొందిన విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వనున్నట్లు కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి తెలిపారు. 22న చిన్నటేకూరులో బాలురకు కౌన్సిలింగ్ నిర్వహించి అడ్మిషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 23న దిన్నేదేవరపాడులో ఉన్న గురుకుల పాఠశాలలో ఆర్డర్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.