Kurnool

News May 21, 2024

నంద్యాల: ఓ వైపు విష్ణు స్వరూపం.. మరోవైపు శివుడిగా దర్శనం

image

ఆత్మకూరు మండలం నల్వకాల్వ గ్రామసమీపంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి జయంతి వేడుకలు బుధవారం నిర్వహించనున్నారు. ఈ ఆలయంలో స్వామిఅమ్మవారు పాణిపట్టంపై కొలువుదీరి ముందు భాగంలో విష్ణుస్వరూపంగా వెనుక భాగంలో శివలింగ ఆకారంలో దర్శనమిస్తారు. ఈ ఆలయ మరో ప్రత్యేకత ఏమిటంటే ఉత్తరాయాణంలో పుష్యమాసం నుంచి ఆషాడమాసం వరకు ఉదయం సూర్యకిరణాలు స్వామిఅమ్మవార్లపై ప్రసరించడంతో గర్భాలయ గోడలపై నీడ లింగకారంలో ప్రతిబింబిస్తుంది.

News May 21, 2024

కర్నూలు జిల్లాలో 33శాతం పంట నష్టం

image

2023-24 రబీ పంటలకు సంబంధించిన నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను వ్యవసాయం యంత్రాంగం వెల్లడించింది. జిల్లాలో 70,982 హెక్టార్లలో 33 శాతంపైన పంట నష్టం జరిగిందని పేర్కొంది. 18 కరవు మండల్లాలో 58,901 మంది రైతులు పంటను నష్టపోయారని వారికి రూ.71.57 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ(పెట్టుబడి రాయితీ అవసరమవుతుందని నివేదికలోపేర్కొంది. సోషల్ ఆడిట్ చేపట్టిన అనంతరం కలెక్టర్ ద్యారా తుది నివేదిక పంపింది.

News May 21, 2024

కర్నూలు: ఆ ఇద్దరి మహిళది హత్యే

image

కర్నూలు గార్గేయపురం నగరవరం చెరువులో మహిళల మృతదేహాలు బయటపడిన సంగంతి తెలిసిందే. ఇద్దరు మహిళలో ఒకరు మహబూబ్‌‌నగర్ జిల్లాకు చెందిన జానకిగా, మరొకరు అరుణగా గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో కర్నూలుకు చెందిన ఆటోడ్రైవర్‌తో అరుణ గొడవపడి కొట్టించినట్లు తెలిసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు కక్షగట్టి నమ్మించి వారిని చెరువు వద్దకు తీసుకెళ్లి నీళ్లలోకి తోసి హత్యచేసినట్లు విచారణలో తెలింది.

News May 21, 2024

కర్నూలు: చెట్టు విరిగి పడి బాలుడు మృతి

image

హాలహర్వి మండలంలోని విరుపాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శాంతమ్మ, బసవరాజు దంపతుల కుమారుడు సంతోష్ (9) గ్రామంలోని చెట్టు కింద ఆడుకుంటుండగా గాలివాన కురిసింది. దీంతో అక్కడున్న చెట్టు కిందకు వెళ్ళారు. ఆ సమయంలో చెట్టు విరిగి సంతోశ్‌పై పడి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గాయపడిన మరో బాలుడిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

News May 21, 2024

నంద్యాల:యువకుడిపై గొడ్డలితో దాడి

image

మహానంది మండలం గాజులపల్లెకి చెందిన ఆల్తాఫ్ అదే గ్రామానికి చెందిన ఇర్ఫాన్‌పై గొడ్డలితో దాడిచేశాడు. ఎస్ఐ నాగేంద్రప్రసాద్ వివరాల మేరకు.. స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో ఇర్ఫాన్ ఉండగా ఆల్తాఫ్ తన మిత్రులతో కలిసి అతడిపై దాడికి దిగారు. గొడ్డలితో తలపై దాడి చేయడంతో తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన ఇర్ఫాన్‌ను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి కారణాలు తెలియాల్సి ఉంది.

News May 21, 2024

నంద్యాల: స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రత

image

ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్స్ భద్రతలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం పాణ్యం మండలం నెరవాడ గ్రామ సమీపంలోని ఆర్జీఎం, శాంతిరాం ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచిన ఈవీఎంల పర్యవేక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు.

News May 20, 2024

కర్నూలు: ఆరెండు మృతదేహాలు వారివే..!

image

కర్నూలు జిల్లా నగరవనం చెరువులో ఆదివారం మూడు మహిళల మృతదేహాలు కలకలం రేపిన విషయం తెలిసిందే.. అయితే వాటిలో రెండు మృతదేహాలలో రెండు ఎవరివనేది పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరు వనపర్తికి చెందిన అరుణ, జానకి కాగా.. మరో మహిళ ఎవరినేది తెలియలేదు. వీరి మృతికి గల కారణాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.

News May 20, 2024

ఆస్పరిలో ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రైవేటు బస్సు

image

ఆస్పరి మండలం శంకరబండ గ్రామ సమీపంలోని బస్టాండ్ దగ్గర ఆగి ఉన్న ట్రాక్టర్‌ని ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డాక్టర్ డ్రైవర్‌కి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా.. ఇంకెవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News May 20, 2024

పత్తికొండ: ‘రైతులు పేర్లు నమోదు చేసుకోవాలి’

image

పత్తికొండలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రాయితీపై వేరుశెనగ విత్తనాలు కావాల్సిన రైతులు ఆయా గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని పత్తికొండ మండల వ్యవసాయ అధికారి వెంకటరాముడు అన్నారు. మే 20 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు అన్ని రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. నమోదు ప్రక్రియ అనంతరం రైతులకు విత్తనాలు అందజేస్తామని అన్నారు.

News May 20, 2024

ఆదోని: ప్రబలుతున్న అతిసారం.. కారణమిదే..!

image

ఆదోని మండల పరిధిలోని ఇస్వీ గ్రామంలో అతిసారం ప్రబలడంతో 30 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మంచినీరు శుద్ధిలేక ఈ వ్యాధి ప్రబలినట్లు సమాచారం. అదే విధంగా జిల్లాలో గతంలో కూడా అతిసారంలో కొందకు మృతి చెందిన విషయం తెలిసిందే..!