Kurnool

News September 2, 2024

సుంకేసుల డ్యామ్ భద్రతపై ఆందోళన వద్దు: మంత్రి భరత్

image

సుంకేసుల డ్యాం వ‌ద్ద తెలంగాణ వైపు మ‌ట్టి క‌ర‌క‌ట్ట కుంగిన ఘ‌ట‌న‌పై ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందొద్దని రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. డ్యాం వ‌ద్ద‌ కుంగిన మ‌ట్టి క‌ర‌క‌ట్ట‌ను పూడ్చేందుకు అధికారులు వేగంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని మంత్రి తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై జిల్లా కలెక్టర్‌తో పాటు ఇరిగేష‌న్ అధికారుల‌తో మాట్లాడారు. సుంకేసుల డ్యాం భ‌ద్ర‌త‌కు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా చూడాల‌ని అధికారులను ఆదేశించారు.

News September 1, 2024

శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు.. 20 అడుగుల ఎత్తు

image

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగటంతో డ్యామ్ 10 గేట్లను 20 అడుగుల ఎత్తుకు పెంచారు. జల వనరుల శాఖ ప్రాజెక్టు ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి స్విచ్ ఆన్ చేసి హైట్‌ను పెంచారు. 2, 3 గేట్లకు సంబంధించి ప్యానల్ బోర్డులో సాంకేతిక లోపం అనే దానిని అధికారులు ఖండించారు. వస్తున్న వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ గేట్ల ఆపరేషన్ చేపడతామని, ప్రస్తుతానికి అన్ని గేట్లు ఆపరేషన్ సక్రమంగా సాగుతుందన్నారు. ఈఈ మోహన్ దాస్ ఉన్నారు.

News September 1, 2024

మద్దికేరలో మనస్తాపంతో రైతు మృతి

image

మద్దికేరలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువరైతు నిద్రలోనే ప్రాణాలను కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మద్దికేరకు చెందిన పారా రాజేంద్ర (45) తనకు ఉన్న రెండు ఎకరాలు సాగు చేశాడు. అధిక వర్షాలతో పంట నీట మునగడంతో మనస్తాపానికి గురయ్యాడు. దానికి తోడు తీసుకున్న అప్పులు ఎలా తీర్చాలో తెలియక బాధపడేవాడు. ఆదివారం మధ్యాహ్నం నిద్రకు ఉపక్రమించిన రాజేంద్ర మంచంపైనే ప్రాణాలు వదిలినట్లు తెలిపారు.

News September 1, 2024

భారీ వర్షాలు.. కర్నూల్.జిల్లా కంట్రోల్ రూం నంబర్లు ఇవే

image

ఉమ్మడి కర్నూల్ జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కింది జాగ్రత్తలు పాటిద్దాం.
☞ శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడలు, స్తంభాల వద్ద ఉండొద్దు.
☞ వర్షం పడేటప్పుడు చెట్ల కిందికి వెళ్లకండి.
☞ నదులు, కాలువలు, మ్యాన్‌హోళ్ల వద్ద జాగ్రత్త.
☞ రోడ్డుపై నీరుంటే జాగ్రత్తగా వెళ్లండి.
➠జిల్లా కంట్రోల్ రూం నంబర్: కర్నూల్ 08518277305

News September 1, 2024

రేపు కర్నూలు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ పి రంజిత్ బాషా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రేపు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ ఆదేశాన్ని అతిక్రమించి పాఠశాలలు తెరిచినట్లయితే స్కూల్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 1, 2024

శ్రీశైలం వచ్చే పర్యాటకులకు విజ్ఞప్తి

image

రెండు రోజులుగా శ్రీశైలం మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే. దీంతో నల్లమల ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని.. శ్రీశైలం వచ్చే భక్తులు, పర్యాటకులు తమ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మన్ననూర్ చెక్ పోస్టును తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ ప్రకటించారు.

News September 1, 2024

సెంట్రల్ సూపర్‌వైజరీ బోర్డు సభ్యురాలిగా శబరి

image

నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి కేంద్రంలో మరో కీలక పదవి లభించింది. ఆమెను సెంట్రల్ సూపర్‌వైజరీ బోర్డు సభ్యురాలిగా నియమించారు. దేశ వ్యాప్తంగా లింగ నిర్ధారణ పరీక్షల నిషేధాన్ని ఈ బోర్డు పర్యవేక్షిస్తుంటుంది. ఈమెతో పాటు మహారాష్ట్రలోని దూలే ఎంపీ డాక్టర్ బచావ్ శోభా దినేశ్‌ను సభ్యురాలిగా కేంద్రం నియమించింది. దీంతో బైరెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

News August 31, 2024

ఆదోని: 175 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

image

ఆదోనిలో దాదాపు 94% పెన్షన్ల పంపిణీ జరిగిందని మున్సిపల్ అధికారులు శనివారం తెలిపారు. పెన్షన్ల పంపిణీ 100% పూర్తి చేయని 175 మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఉదయం ఐదు గంటలు నుంచి పెన్షన్లు పంపిణీ చేశామని ఒకరిద్దరు మిగిలిన చర్యలు తీసుకోవడం సరికాదని సచివాల ఉద్యోగులు వాపోయారు. రెండో తేదీ వరకు పంపిణీ చేయవచ్చని ఆదేశాలు ఉన్న అధికారులు చర్యలు తీసుకోవడం భావ్యం కాదన్నారు.

News August 31, 2024

నంద్యాల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్పాట్ డెడ్

image

వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదాపూర్ గ్రామా సమీపాన జాతీయ రహదారి 44పై శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డేవిడ్ పాల్, పాలెం జయ కుమార్ ఇద్దరు డోన్ వైపు వెళ్తుండగా వెనకాల వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో ఇద్దరూ అత్యంత ఘోరంగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

News August 31, 2024

భారీ వర్షాలు.. కర్నూల్.జిల్లా కంట్రోల్ రూం నంబర్లు ఇవే

image

ఉమ్మడి కర్నూల్ జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కింది జాగ్రత్తలు పాటిద్దాం.
☞ శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడలు, స్తంభాల వద్ద ఉండొద్దు.
☞ వర్షం పడేటప్పుడు చెట్ల కిందికి వెళ్లకండి.
☞ నదులు, కాలువలు, మ్యాన్‌హోళ్ల వద్ద జాగ్రత్త.
☞ రోడ్డుపై నీరుంటే జాగ్రత్తగా వెళ్లండి.
➠జిల్లా కంట్రోల్ రూం నంబర్: కర్నూల్ 08518277305