India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గార్గేయపురం పరిధిలోని నగరవరం చెరువులో మొదట రెండు, కాసేపటికి మరో మహిళల మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే.. అయితే ఆ మూడు మృతదేహాలు ఎవరివనే విషయంపై ఇంకా స్పష్టత రానట్లు సమాచారం. వివాహేతర సంబంధం కలిగిన వ్యక్తులు ఆ ప్రాంతాలకు రాత్రిపూట ఎక్కువగా వస్తారని తెలియడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మృతులు తెలంగాణ వాసులుగా పోలీసులు అనుమానిస్తూ విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
24, 31వ తేదీల్లో కౌంటింగ్ సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై ఆర్ఓ, ఏఆర్ఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డౌట్ క్లియరింగ్ సెషన్స్‌లో నిర్దేశించిన విధంగా 17సీ, పిఓ డైరీ, 17ఏ తదితర డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.
కర్నూలులోని 44 నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరుకు చెందిన పాండు స్థానికంగా ఉన్న ఓ మహిళా ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహంలో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. కూరగాయలు తీసుకువచ్చేందుకు రోడ్డుపైకి వచ్చిన పాండును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనలో పాండు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రతిభ ఉంటే సినిమా రంగంలో గుర్తింపు లభిస్తుందని సినీ నటుడు బలగం సంజయ్ కృష్ణ తెలిపారు. మహానందీశ్వరుడి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మహానందికి వచ్చారు. శ్రీ కామేశ్వరీ దేవి, మహానందీశ్వర స్వామి వార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 50 చిత్రాల్లో నటించానన్నారు. బలగం, గుంటూరు కారం చిత్రాలు మంచి గుర్తింపు ఇచ్చాయన్నారు .
కర్నూలు అర్బన్ పీఎస్ పరిధిలోని గార్గేయపురం చెరువులో ఆదివారం ఉదయం ఇద్దరు మహిళల మృతదేహాలు కలకలం రేపాయి. పర్యాటక ప్రాంతమైన గార్గేయపురం చెరువులో మృతదేహాలు నీటిపై తేలియాడుతున్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో కర్నూలు డీఎస్పీ కరణం విజయ శేఖర్, అర్బన్ సీఐ శ్రీధర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి పరిశీలిస్తున్నారు.
కర్నూలులోని గీతాముఖర్జీ నగర్‌కు చెందిన పఠాన్ మహ్మద్ షఫీఖాన్‌పై శనివారం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‘డిగ్రీ చదువుతున్న నా కూతురిని ప్రేమిస్తున్నానంటూ షఫీఖాన్ నిత్యం వేధించేవాడు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి నా కూతురిని దూషించి, బెదిరించాడు. ఇంటి ముందు ఉన్న బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి వీరంగం సృష్టించాడు’ అంటూ యువతి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా శనివారం 11 మంది డిబార్ అయినట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. కాగా నంద్యాల పీఎస్సీ అండ్ కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నలుగురు, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఇద్దరు, నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, సెయింట్ జోసప్, ఆళ్లగడ్డ ప్రజ్ఞ డిగ్రీ కళాశాల, అనంత డిగ్రీ కళాశాలల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 11 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు తెలిపారు.
ఈవీఎం బాక్సులను భద్రపరిచిన ఆర్జీయం, శాంతిరామ్ ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ కె.శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి తెలిపారు. శనివారం కళాశాలల్లో ఉంచిన ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కౌంటింగ్ పూర్తయ్యేవరకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామన్నారు. జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఉన్నారు.
జూన్ 4న ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పథకాలకు సంబంధించి డబ్బులు చెల్లించకుండా ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసి చెల్లింపులు నిలిపివేయించారని ఆరోపించారు. చెప్పిన మాట ప్రకారం అదే ఎన్నికల సంఘం అనుమతితో ఇవాళ అన్నదాతలకు పంట నష్టపరిహారం వైసీపీ ప్రభుత్వం అందజేసిందని తెలిపారు.
బనగానపల్లె మండలం ఎర్రమల కొండల్లో శుక్రవారం రాత్రి అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ కారణంగా దద్దనాల ప్రాజెక్ట్ ఎగువన వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రధానంగా మద్దిలేటిస్వామి క్షేత్రం పరిధిలో కురిసిన వర్షాలకు ఎగువ నుంచి వచ్చిన నీటిప్రవాహంలో అడుగంటిన దద్దనాల ప్రాజెక్టుకు 4 అడుగుల నీరు చేరింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు, రైతాంగం ఆనందం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.