India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీశైల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా సున్నిపెంటకు చెందిన ఇద్దరు ముస్లిం మైనార్టీ నాయకులను ఆయా పార్టీలు ఎంపిక చేశాయి. ఇప్పటికే జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఎస్ఎం సికిందర్ బాషా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏఎస్ ఇస్మాయిల్ త్వరలోనే నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇరువురూ నియోజకవర్గ పరిధిలో గుర్తింపు గల వ్యక్తులు కావడం, స్థానికంగా అందరితో పరిచయాలు ఉండటం విశేషం.
రాష్ట్రంలో మోడీకి అనుకూలంగా ఉన్న టీడీపీ, వైసీపీలను ప్రజలు ఓటు ద్వారా తరిమికొట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ఆదివారం కర్నూలులోని చౌక్ వద్ద ఏపీ న్యాయ యాత్ర బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చేది కాంగ్రెస్సే అని అన్నారు.
ఏలూరు నుంచి కర్నూలుకు వస్తున్న క్రాంతి ట్రాన్స్‌పోర్టు వాహనం గిద్దలూరు ఘాట్ రోడ్ బొగద మలుపు వద్ద ఆదివారం తెల్లవారుజామున కొండచరియను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతిచెందాడు. ఏలూరు నుంచి వస్తుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కొండచరియను ఢీకొంది. ఆ సమయంలో డ్రైవర్ పెద్దరాజు కిందికి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందాడు.
ఆదోని మండలంలోని మధిర క్రాస్ నుంచి ఎల్ఎల్‌సీ కెనాల్ మధ్య ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఏప్రిల్ 22వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఎన్నికల విధుల కేటాయింపు ఉత్తర్వు, ఓటరు గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీలతో కలపి ఫారం-12ను అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు.
కర్నూలు జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు నేడు పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామూల్ తెలిపారు. ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. వెబ్ సైటు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరుకావాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్, బ్లూ, బ్లాక్ పెను, పరీక్ష ప్యాడ్ తో ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
24 గంటల్లోగా రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో పూర్తి స్థాయి సదుపాయాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమీషనర్, ఆర్అండ్బీ అధికారులను కలెక్టర్ డా.జి.సృజన అదేశించారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో జరుగుతున్న మరమ్మత్తు పనులను మున్సిపల్ కమీషనర్ భార్గవ తేజతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ అతిథి గృహ ఆవరణంలో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని లింగాలపల్లి కనుగొట్ల గ్రామాలలో శనివారం తెల్లవారుజామున పిడుగు పడటంతో మూడు ఎద్దులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన బాషా అనే రైతుకు చెందిన రెండు ఎద్దులను ఇంటి సమీపంలో చెట్టుకు కట్టివేయడంతో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాయి. కలుగొట్ల గ్రామంలో సైతం ఒక ఎద్దు ప్రాణాలు కోల్పోయింది.
విద్యుత్ షాక్‌కు గురై తాయప్ప(35) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పత్తికొండ పట్టణ శివారులోని రామకృష్ణారెడ్డి నగర్లో శనివారం జరిగింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షపు నీటిని తాయప్ప తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగకు తగిలాడని స్థానికులు తెలిపారు. దీంతో అతడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిపారు.
సంజామల మండల వ్యాప్తంగా మరి కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు చెట్లు, టవర్లు, పోల్స్, పొలాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించింది. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని పేర్కొంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని APSDMA స్పష్టం చేసింది.
Sorry, no posts matched your criteria.