India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జూన్ 4వ తేదీన నిర్వహించనున్న ఎన్నికల కౌంటింగ్‌కు సచివాలయ సిబ్బంది సేవలు వినియోగించుకోవడం లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.సృజన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌంటింగ్ విధులకు ప్రభుత్వ ఉద్యోగులు తగినంత మంది ఉన్నారని, అదనంగా సచివాలయ సిబ్బంది అవసరం లేదని స్పష్టం చేశారు.
శ్రీశైలం పోలీస్ స్టేషన్‌లో తుపాకితో కాల్చుకొని మృతిచెందిన కానిస్టేబుల్ శంకర్ రెడ్డి అంత్యక్రియలు పోలీసు అధికార లాంఛనాలతో పూర్తి చేశారు. కర్నూల్ టౌన్ జారహాపురం కేసీ కెనాల్ దగ్గర ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు, శ్రీశైలం సీఐ ప్రసాదరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ అధికారులు శంకర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గత రెండు రోజులుగా ప్రముఖ దినపత్రికల్లో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని నంద్యాల జిల్లా ఎస్పీ కే.రఘువీర్ రెడ్డి అన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించామన్నారు. ఎక్కడ ఎలాంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసులు తమ విధులు నిర్వర్తించారని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజల దృష్టి మరల్చి తప్పుదోవ పట్టించే, నిరాధారమైన వ్రాతలు మానుకోవాలని ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు.
విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, తదితరులు పాల్గొన్నారు.
బేతంచెర్లకు చెందిన వై.లక్ష్మీదేవి ఈనెల 16న అదృశ్యం కాగా 17న కడప జిల్లా ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్ సమీపంలో ఆమె మృతదేహాం లభ్యమైందని బంధువులు తెలిపారు. మతిస్థిమితం లేని ఆమె కోయిలకుంట్ల నుంచి ట్రైన్‌కు వెళ్లి ఉంటుందని వారు భావిస్తున్నారు. ప్రమాదవశాత్తు రైలు కిందపడిందా.. ఆత్మహత్య చేసుకుందా అనేది తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ప్రొద్దుటూరుకు తరలించారు.
మహానంది ఆలయంపై నీలివర్ణ కాంతులు, తెల్లటి మేఘాలతో కూడిన మనోహారమైన దృశ్యం భక్తులను కనువిందు చేసింది. ప్రకృతి సోయగాల అందాలతో నల్లమల కొండల నడుమ మహానంది పుణ్యక్షేత్రం విరాజిల్లుతోంది. శుక్రవారం మహానంది ఆలయంపై ఉన్న అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులు తమ సెల్ ఫోన్‌లలో బంధించారు.
కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జీ.సృజన పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎదైనా సమస్య అనిపిస్తే తమకు సమాచారం అందించాలని తెలిపారు.
పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామానికి చెందిన చాకలి శివ(11) శుక్రవారం కరెంటు షాక్‌తో మృతిచెందాడు. చాకలి లక్ష్మి, రామాంజి కొడుకు శివ ఉదయం మిద్దెపైన వేలాడుతున్న కరెంటు వైర్ తాకడంతో షాక్ తగిలింది. కుటుంబ సభ్యులు వెళ్లి చూసేలోగా అప్పటికే శివ మృతిచెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు.
వైసీపీ నాయకుల తీరు కారణంగానే రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ ఆరోపించారు. ఎన్నికల అనంతరం హింస చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. మాచర్ల, తాడిపత్రి, తిరుపతిలో దాడులకు వైసీపీనే కారణమని విమర్శించారు. రాజంపేటలో ఉన్న అధికారి తాడిపత్రికి వచ్చి ఎలా దాడులు చేస్తారని ప్రశ్నించారు. వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
బేతంచెర్ల మండలం గోరుమానుకొండకు చెందిన సండ్రబోయిన వెంకటేశ్వర్లు, రాములమ్మ దంపతుల కుమారుడు వంశీ(22) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. వంశీ చెడు వ్యసనాలకు బానిసై బాధ్యత లేకుండా తిరుగుతుండటంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన వంశీ గ్రామ చివర్లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాల పాలైన వంశీని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.
Sorry, no posts matched your criteria.