Kurnool

News May 17, 2024

కూటమిదే అధికారం: కేఈ కృష్ణమూర్తి

image

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ధీమా వ్యక్తం చేశారు. కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తదితరులతో పోలింగ్ సరళిపై విశ్లేషించారు. 2019లో జగన్ మోసపూరిత వాగ్దానాలతో గెలిచారన్నారు.

News May 17, 2024

ఓట్ల లెక్కింపునకు సిద్ధం కండి: నంద్యాల కలెక్టర్

image

నంద్యాల జిల్లాలోని ఆరు అసెంబ్లీ, ఓ పార్లమెంట్ సెగ్మెంట్‌కు సంబంధించి జూన్ 4న ఓట్ల లెక్కింపునకు ఆర్ఓలు, నోడల్ అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ కే.శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఈ మేరకు JC రాహుల్ కుమార్ రెడ్డి, ఎస్పీ రఘువీర్ రెడ్డితో కలిసి సమీక్షించారు. RGM, SREC కళాశాలలో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల అనంతరం EVM ఓట్లు లెక్కించాలన్నారు.

News May 16, 2024

బాలనాగిరెడ్డికి 30వేల మెజారిటీ తథ్యం: వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్మి

image

పెద్దకడబూరు మండలంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి 6 వేల మెజారిటీ వస్తుందని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి స్పష్టం చేశారు. గురువారం పెద్దకడబూరులో ఆయన మాట్లాడుతూ.. మండలంలోని బీసీ కార్డు టీడీపీకి పనిచేసి ఉంటే వైసీపీకి 6 వేలు మెజారిటీ వస్తుందని, పని చేయకపోతే 10వేలు తప్పనిసరిగా వస్తుందని, జూన్ 4న జరిగే కౌంటింగ్లో బాలనాగిరెడ్డికి 30వేల మెజారిటీ తథ్యమని అన్నారు.

News May 16, 2024

నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్

image

ఆత్మకూరు మండలం ఇందిశ్వరం గ్రామానికి చెందిన యువకుడు తరుణ్ అదృశ్యమయ్యాడు. బర్రెలు కాచేందుకు బుధవారం నల్లమల అడవిలోకి వెళ్లిన తరుణ్ బర్రెలతో పాటు తప్పిపోయాడు. వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అతడి కుటుంబీకులు ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అడవిలో గాలిస్తున్నారు. డ్రోన్ సహాయంతో తరుణ్ జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఐ లక్ష్మీనారయణ తెలిపారు.

News May 16, 2024

ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

కర్నూలు నగరంలోని రాయలసీమ యూనివర్సిటీలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవిఎమ్ యంత్రాలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్‌లను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన గురువారం పరిశీలించారు. అనంతరం ఈవీఎంలను సిసి ఫుటేజ్ ద్వారా ఎప్పటికప్పుడు పరివేక్షించాలన్నారు. జేసీ మౌర్య, డిఆర్వో పాల్గొన్నారు.

News May 16, 2024

శ్రీశైలం: పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య!

image

కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీశైలంలో జరిగింది. శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌‌కు చెందిన శంకర్ రెడ్డి అనే కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసు స్టేషన్‌లో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న సీఐ ప్రసాద్ రావు అక్కడికి చేరుకొని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 16, 2024

బండి ఆత్మకూరు : 20మందికి వాంతులు విరోచనాలు

image

బండి ఆత్మకూరు మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలో వాంతులు విరోచనాలతో బుధవారం నుంచి సుమారు 20 మంది ఇబ్బందులకు గురయ్యారు. పలువురు నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు. వాంతులు, విరోచనాలకు కారణం కలుషిత తాగునీరు అనే గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

News May 16, 2024

కర్నూలు: పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

image

మద్దికేర : గుంతకల్ నుంచి ప్రయాణికులతో పత్తికొండకు వస్తున్న ఆర్టీసీ బస్సు బుధవారం మద్దికేర బురుజుల గ్రామాల మధ్య అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బ్రేక్ వేసి నిలిపివేయడంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మండలంలో రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి రోడ్డు పక్కన దిగడంతో నల్లరేగడి భూములు కావడంతో బస్సు అదుపు తప్పిందని స్థానికులు తెలిపారు.

News May 16, 2024

పత్తికొండలో అత్యధికం.. కర్నూలు రూరల్‌లో అత్యల్పం

image

కర్నూలు జిల్లాలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పత్తికొండలో మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు అత్యధికంగా 42.4 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. అలూరు 5.2, కౌతాళం 4.6, అస్సరి3.8, కర్నూలు అర్బన్ 3.6, కల్లూరు 3.2 ఆధోని, కర్నూలు రూరల్‌లో 1.2, మొత్తం 8 మండలాల్లో 65.2 మి.మీ వర్షపాతం నమోదైంది.

News May 16, 2024

చిప్పగిరి మండలంలో వర్షం

image

చిప్పగిరి మండలంలో భారీ వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉక్కపొతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.