India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు జిల్లాలో 76.80 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా ఆలూరు మండలం కురువళ్లి గ్రామంలోని 109 పోలింగ్ కేంద్రంలో 100 శాతం పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 940 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 460, మహిళలు 480 మంది ఉన్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు మంగళవారం తెలిపారు.
జిల్లావ్యాప్తంగా నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎం బాక్స్‌లను RGM, శాంతిరాం ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచినట్లు ఎస్పీ రఘువీర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం స్ట్రాంగ్‌రూమ్ వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల కేంద్ర పోలీస్ బలగాలు జిల్లా ఆర్ముడ్ పోలీసులు, సివిల్ పోలీస్ బందోబస్తును పరిశీలించి వారికి పలు సూచనలు, ఆదేశాలను జారీ చేశారు.
ఆలూరు మండలం మొలగవల్లి కొట్టాలలో ఓటు వేయడానికి వచ్చిన దుగునూరు చిట్టిబాబు(32) మృతి చెందారు. హైదరాబాద్ నుంచి బస్సులో వస్తుండగా 12వ తేదీ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతుడి భార్య పద్మావతి గత ఏడాది మరణించగా ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సిరి మోక్షిత్, సుశాంత్ తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మిగిలారు. స్థానికుడు రాజు సమాచారంతో వైసీపీ MLA అభ్యర్థి కొడుకు చంద్రశేఖర్ మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.
పిడుగుపాటుకు గురై గొర్రెల కాపారి మృతిచెందిన ఘటన మంగళవారం జరిగింది. ఆత్మకూరు మండలం అమలాపురం గ్రామానికి చెందిన తెలుగు పెద్ద ఆంజనేయులు వెంకటాపురం గ్రామ శివారులో గొర్రెలు మేపుతున్నాడు. అదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుడంగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
మండల కేంద్రం శిరివెళ్లకు చెందిన భూమా కుటుంబ ముఖ్య అనుచరుడు నాలి వలి గుండెపోటుతో సోమవారం సాయంత్రం మృతిచెందారు. ఓటు వేసేందుకు వెళ్లిన ఆయన.. పోలింగ్ కేంద్రం వద్దే కుప్పకూలి మరణించారు. మృతి పట్ల టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం శిరివెళ్లకు చేరుకుని వలి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు.
మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన ఈరన్న సోమవారం ఓటేసేందుకు వెళ్లి పోలింగ్ బూత్‌లోనే మృతిచెందారు. మాధవరంలో ప్రాథమిక పాఠశాలలో ఓటేసేందుకు గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. అప్పటికే కళ్లు తిరుగుతున్నాయని తోటి ఓటర్లతో చెప్పారు. చివరికి ఓటు వేసి బయటకు వస్తుండగా స్పృహ తప్పి పడిపోయారు. అక్కడే ఉన్న ఎన్నికల సిబ్బంది, తోటి ఓటర్లు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందారు.
నంద్యాల జిల్లా పగిడ్యాల మండల కేంద్రంలోని మజారా
గ్రామమైన బీరవోలులో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ నరసింహుడు(58) పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు.
నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి వరకు 80.92 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 83.12 శాతం, అత్యల్పంగా నంద్యాల నియోజకవర్గంలో 75.00 శాతం నమోదైంది. బనగానపల్లె 82.28, డోన్ 82.91, నందికొట్కూరు 81.69, శ్రీశైలం నియోజకవర్గంలో 81.70 శాతం ఓటింగ్ పోలైంది. కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యమైన నేపథ్యంలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కర్నూలు పార్లమెంట్ (పాణ్యం నియోజకవర్గం కలిపి) పరిధిలో నిన్న రాత్రి వరకు 75.83 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ సృజన తెలిపారు. అత్యధికంగా మంత్రాలయం నియోజకవర్గంలో 84.51, అత్యల్పంగా ఆదోని 63.51 శాతం శాతం నమోదైంది. కర్నూలు 63.87, పాణ్యం 74.09, పత్తికొండ 84.14, కోడుమూరు 76.50, ఎమ్మిగనూరు 81.80, ఆలూరు 82.77 శాతం నమోదైనట్లు ఆమె తెలిపారు.
జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిందని కలెక్టర్/ఎన్నికల అధికారి జీ.సృజన తెలిపారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. పోలింగ్ ప్రక్రియ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.