Kurnool

News April 18, 2024

కర్నూలు: మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

చిప్పగిరి మండల కేంద్రానికి చెందిన కొండా చంద్ర అనే రైతు గురువారం కరెంట్ షాక్‌తో మృతి చెందారు. గ్రామ సమీపంలోని పొలం వద్ద మిరప పంటకు నీరు పెట్టేందుకు మోటర్ ఆన్ చేస్తుండగా
చంద్ర ఒక్కసారిగా కరెంట్ షాక్‌ గురై చనిపోయాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రైతు మృతిపై దర్యాప్తు చేస్తున్నామని చిప్పగిరి పోలీసులు వెల్లడించారు.

News April 18, 2024

కర్నూలు: మెుదటి రోజు నామినేషన్ వేసింది వీరే

image

 కర్నూలు ఎంపీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి బస్తిపాడు నాగరాజు, కె.జయసుధ, స్వతంత్ర అభ్యర్థిగా బీచుపల్లి నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా కర్నూలు నుంచి ఖలీల్ అహ్మద్ సత్తార్(SDPI), అబ్దుల్ సత్తార్(అన్నా వైసీపీ). కోడుమూరు నుంచి దస్తగిరి(TDP), ఆదిమూలపు సతీశ్(YCP). ఎమ్మిగనూరు  బుట్టారేణుక(YCP), టీడీపీ నుంచి బీవీ జయనాగేశ్వరరెడ్డి, బైరెడ్డి నిత్యాదేవి. ఆదోని అసియా బాను(బీఎస్పీ) నామినేషన్ వేశారు.

News April 18, 2024

అన్న వైసీపీ అభ్యర్థిగా అబ్దుల్ సత్తార్ నామినేషన్

image

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి భార్గవ తేజ్‌కు ఆయన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న వైసీపీ, టీడీపీలను కర్నూలు ప్రజలు చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు.

News April 18, 2024

2024 ఎలక్షన్.. కర్నూలు అసెంబ్లీ రౌండప్

image

➤నియోజకవర్గం పేరు: కర్నూలు
➤పోలింగ్ బూత్‌ల సంఖ్య: 258
➤మొత్తం ఓటర్లు: 270942
➤పురుషులు: 131150
➤మహిళలు : 139760
➤ఇతరులు: 32
➤రిటర్నింగ్ అధికారి:
➤కర్నూల్ నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవ్ తేజ
➤పోలింగ్ తేదీ: 13-05-2024
➤కౌంటింగ్ తేదీ: 4-06-2024

News April 18, 2024

కర్నూలు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్

image

కర్నూలులో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. టీడీపీ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజ్ కలెక్టర్ సృజనకు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ నేపథ్యంలో కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ ఆంక్షలు విధించారు. ఇది తొలి సెట్ కావడంతో ఆయన ఎటువంటి ఆర్భాటం లేకుండా వచ్చారు. మరో సెట్ వేసేటప్పుడు కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీ చేయనున్నారు.

News April 18, 2024

మంచి ముహూర్తం చూడండి స్వామి…!

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేటి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు పండితులు, స్వామీజీలను ఆశ్రయిస్తున్నారు. మంచి ముహుర్తాలు చూడాలని కోరుతున్నారు. పంచాంగం ప్రకారం ఈనెల 18, 19, 22, 23, 24 తేదీలు బాగున్నాయని పండితులు అంటున్నారు. కొందరు సెంటిమెంట్‌తో పాటు వారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు అనుగుణంగా శుభఘడియలు నిర్ణయించుకుంటున్నారు.

News April 18, 2024

ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల డిపాజిట్లు ఎంతంటే…!

image

ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు డిపాజిట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎంపీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసే సాధారణ(ఓసీ, బీసీ) అభ్యర్థులు రూ.25వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 డిపాజిట్ చెల్లించాలి. ఎమ్మెల్యేగా పోటీ చేసే సాధారణ అభ్యర్థులు రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు చొప్పున డిపాజిట్లు చెల్లించాల్సి ఉంటుంది.

News April 18, 2024

కర్నూలు: అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు

image

జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు చేపట్టనున్నట్లు డ్వామా పీడీ అమరనాథరెడ్డి తెలిపారు. జిల్లాలో మొత్తం 690 గ్రామాలు ఉండగా ఇప్పటికే.. 662గ్రామాల్లో పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. కొన్ని గ్రామాల్లో వారం వ్యవధిలో పనులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రోజుకు 1,53,500 మందికి పనులు కల్పించాలనేది లక్ష్యం కాగా.. 98,058 మంది ఉపాధి పనులకు హాజరవుతున్నారని పేర్కొన్నారు.

News April 18, 2024

నేను దైవ దర్శనానికి వెళ్లా: దస్తగిరి

image

వైసీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ MLA అభ్యర్థి బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తనపై కొన్ని పత్రికల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను దైవదర్శనం నిమిత్తం వేరే ఊరు వెళ్తే ప్రచారానికి దూరంగా ఉన్నట్లు రాయడం సరికాదన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.

News April 18, 2024

19న ఆలూరుకు రానున్న చంద్రబాబు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 19న టీడీపీ అధినేత చంద్రబాబు ఆలూరుకు రానున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేసేందుకు బుధవారం ఆలూరులో జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. అదే రోజు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆలూరులో పర్యటించునున్నారు.