India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈవీఎంలు తరలించే ప్రతి బస్సుకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. నియోజకవర్గాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో విధుల్లో ఉన్న సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు రూట్ మ్యాప్ సిద్ధమైంది. వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లు కవర్ అయ్యేలా షామియానాలు, మంచినీటి వసతి, ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటుచేశారు.
పోలింగ్ రోజున రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులకు సంబంధించిన వాహనాలకు పరిమితి విధించినట్లు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్, కార్యకర్తల కోసం ఒక్కొక్క వాహనాన్ని మాత్రమే అనుమతిస్తామన్నారు. ఒక వాహనంలో డ్రైవర్‌తో పాటు ఐదుగురు కంటే ఎక్కువ మందిని అనుమతించమన్నారు. జిల్లా ఎన్నికల అధికారి జారీచేసిన అనుమతులను ప్రదర్శించాలన్నారు.
కర్నూలు జిల్లాలో చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును వినియోగించుకోకుండా చూడాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతోందటూ సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సృజన ఖండించారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు.
☛ 8 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సిబ్బంది: 12,714
☛ అందుబాటులో ఉన్నవారు : 14,561
☛ అందులో పీఓలు, ఏపీఓలు కలిపి మొత్తం: 4,827
☛ పీఓలు (ఇతర పోలింగ్ సిబ్బంది): 8,974
☛ రెగ్యులర్ ఉద్యోగులు: 7,713
☛ సచివాలయ ఉద్యోగులు: 1,863
☛ అంగన్వాడీలు: 1,087
☛ కాంట్రాక్ట్ ఉద్యోగులు: 174
☛ సూక్ష్మ పరిశీలకులు: 318
☛ సెక్టార్ అధికారులు: 232
☛ బెల్ ఇంజినీర్లు: 24
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 13న జిల్లా వ్యాప్తంగా స్థానిక సెలవు మంజూరు చేస్తున్నట్లుఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ నిర్వహణ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, స్థానిక సంస్థలు, కార్యాలయాలు, పరిశ్రమలకు లోకల్ హాలిడేగా పరిగణించాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రంలో ప్రతి పార్టీ నుంచి ఒక్క ఏజెంట్ మాత్రమే లోపల ఉండేందుకు అనుమతి ఇస్తామని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జీ.సృజన శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ప్రతి పార్టీ ఒక్కో కేంద్రానికి ముగ్గురు ఏజెంట్లను నియమించుకోవచ్చని, వారిలో లోపల మాత్రం ఒక్కరినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. లోపల ఉన్న ఏజెంట్‌కు రిలీవర్లుగా మిగతా ఇద్దరు వ్యవహరించవచ్చని పేర్కొన్నారు.
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రాబోయే 5 రోజుల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద ఎవరూ ఉండకూడదని తెలిపారు.
రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 16వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెంకటేశ్వర్లు తెలిపారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీ.సుధీర్ ప్రేమ్ కుమార్ ఆదేశాల మేరకు డిగ్రీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్/సప్లిమెంటరీ, 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ, డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ వద్ద ఇబ్బంది లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన నోడల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ లలో విధులు కేటాయించిన నోడల్ అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించారు.
ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటు వజ్రాయుధమని తిమ్మాపురం గ్రామం రెవిన్యూ అధికారి సురేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. మహానంది మండల కేంద్రం తిమ్మాపురం గ్రామంలోని పోలింగ్ కేంద్రాలలో పండుగ వాతావరణం ఉట్టిపడేలా మామిడాకులు, అరటి చెట్ల తోరణాలు అలంకరించి, ఓటర్లకు స్వాగతం ఏర్పాట్లు చేశారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Sorry, no posts matched your criteria.