India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల క్రతువులో ముఖ్యఘట్టమైన ఎన్నికల ప్రచారం క్లోస్ అయింది. ప్రచార వాహనాలకు బ్రేక్ పడింది. సౌండ్ బాక్సుల మోతలు, డీజే శబ్దాలు ఆగిపోయాయి. చట్టసభల్లో అడుగుపెట్టేందుకు నెలరోజులుగా పోటీలో నిలిచిన నాయకులు నిత్యం ప్రజాక్షేత్రంలో ఓట్లు అభ్యర్థించగా.. హామీలు, విమర్శలు అన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది. ఇకపై ఓటర్ అన్నదే ఫైనల్ తీర్పు మిగిలి ఉంది.
☛ ఓటు హక్కు వినియోగించుకుందాం.. సరైన నాయకుడిని ఎన్నుకుందాం.
నంద్యాలలోని కలెక్టరేట్‌లో ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మే 13న ఓట్లు వేసేందుకు జిల్లాలోని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీటి వసతి, వికలాంగులకు వీల్ ఛైర్లను ఏర్పాటు చేశామన్నారు. శనివారం సాయంకాలం 6 గంటల వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చునని వెల్లడించారు.
ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. అభ్యర్థులు పార్టీ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటు తమకే వేయాలని అభ్యర్థిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలు సేకరించి వారిని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పడిన ఓట్ల ఆధారంగా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓటర్లు ఎక్కడుంటే అక్కడికే వెళ్లి తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో చరిత్రలో ఎప్పుడూ లేని ఖరీదైన ఎన్నికలు ఈసారి జరగనున్నాయి. ప్రచార ఘట్టం ముగుస్తుండటంతో డబ్బు పంపిణీపై నేతలు దృష్టి పెట్టారు. ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పంచేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బనగానపల్లెలో ఓ పార్టీ నేతలు రూ.2 వేలు పంపిణీ చేయగా.. మరో రూ.వెయ్యి కూడా పంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డ, పత్తికొండ, కర్నూలులో వెయ్యి నుంచి రూ.2 వేలు పంచుతున్నట్లు సమాచారం.
జిల్లాలో మే 13న ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ కే.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ల అనుమతి లేదని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.సృజన శుక్రవారం పేర్కొన్నారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు తమవెంట సెల్ ఫోన్లు తీసుకురావొద్దని సూచించారు. ఎన్నికల కేంద్రంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ (పీఓ)కు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని ఓటర్లు గమనించాలని కోరారు.
నంద్యాల పట్టణంలోని పప్పులబట్టి బజార్‌కు చెందిన జాకీర్ అనే వ్యక్తి మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని బ్లేడుతో గొంతు కోసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. మధ్యాహ్నం ఓ పార్టీ నాయకులు జాకీర్ కుటుంబానికి ఓట్ల డబ్బులు పంపిణీ చేశారు. తన ఓటు డబ్బులు తనకే ఇవ్వాలని భార్యను జాకీర్ బెదిరించాడు. అయినా భార్య డబ్బులు ఇవ్వకపోవడంతో జాకీర్ బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయిందని ఎంపీ సంజీవ్ కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి, మంత్రాలయం ఇన్‌ఛార్జ్ తిక్కారెడ్డి అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా జగన్ మాట్లాడడం దుర్మార్గమన్నారు. వైసీపీ పాలకుల ఇసుక దోపిడీ వల్ల సుంకేసుల జలాశయంలో నీటి కొరత ఏర్పడిందని ఆరోపించారు.
నంద్యాల-గాజులపల్లె మార్గంలో చలమ రేంజ్ అటవీశాఖలోని పెద్ద పులులు, ఎలుగుబంట్లు సంచరిస్తుండటంతో ప్రయాణీకులు జాగ్రత్తలు పాటించాలని చలమ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఈశ్వరయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ మార్గంలో ప్రయాణం చేసేవారు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేశారు.
ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. మరో 3 రోజుల్లో ప్రజాస్వామ్యంలో కీలక ఘట్టమైన ఓట్ల పండుగను మే 13న ఈసీ నిర్వహించనుంది. రేపటితో ప్రచార పర్వానికి తెరపడనుండటంతో అభ్యర్థులు ఈ 2 రోజుల పాటు తమ ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. మరోవైపు కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు డాక్టర్ జీ.సృజన, డాక్టర్ కే.శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
Sorry, no posts matched your criteria.