Kurnool

News May 10, 2024

వేసవికి ప్రత్యేక రైలు ఏర్పాటు

image

వేసవి సెలవులు దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ కర్నూలు జిల్లా ప్రజలకు శుభవార్త చెప్పింది. ఆదోని మీదుగా సికింద్రాబాబ్-తిరుపతి(07489) ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే 11వ తేదీ నుంచి రైలు అందుబాటులో ఉంటుందన్నారు. సికింద్రాబాద్‌లో రాత్రి 10:05 గంటలకు బయలుదేరి గద్వాల, రాయచూర్ మీదుగా ఆదోనికి రాత్రి 3:10 గంటలకు చేరుకుంటుందన్నారు.

News May 10, 2024

11వ తేదీ సాయంత్రం ప్రచారం సమాప్తం

image

11వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుందని ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ సృజన పేర్కొన్నారు. ఆ తర్వాత ఎవరూ ప్రచారం చేయకూడదని, ప్రచారం చేసినా, ఓటర్లకు నగదు, కానుకలు పంపిణీ చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాకు సంబంధం లేని ఇతర జిల్లాల ఓటర్లు వెంటనే జిల్లా నుంచి వెళ్లిపోవాలన్నారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 7 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేస్తామన్నారు.

News May 10, 2024

ఫోన్లకు అనుమతి లేదు: కలెక్టర్

image

పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ల అనుమతి లేదని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జీ.సృజన పేర్కొన్నారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు తమ వెంట సెల్ ఫోన్లు తీసుకురావొద్దని సూచించారు. ఎన్నికల కేంద్రంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ (పీఓ)కు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని ఓటర్లు గమనించాలని కోరారు.

News May 10, 2024

కర్నూలు: ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

image

కర్నూలు జిల్లాలోని 8 నియోజకవర్గాలకు సంబంధించి ఫెసిలిటేషన్ సెంటర్లలో 4 రోజులుగా నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ గురువారం ముగింసింది. పోలింగ్ సిబ్బంది, పోలీసులు, వయో వృద్ధులు, వికలాంగులు.. ఇలా అందరూ కలిపి 23,612 మంది పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకోగా.. 20,733 (81.87శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

News May 10, 2024

నంద్యాల జిల్లాకు విచ్చేసిన 9మంది ట్రైనీ ఐపీఎస్‌లు

image

ట్రైనింగ్‌లో భాగంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి భద్రత పరమైన చర్యలను గురించి తెలుసుకునేందుకు తొమ్మిదిమంది ట్రైనీ ఐపీఎస్‌లకు జిల్లాకు విచ్చేశారు. వారు ఎస్పీ రఘువీర్ రెడ్డిని గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారికి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి తీసుకుంటున్న చర్యలు, బందోబస్తు ఏర్పాట్ల గురించి ఎస్పీ వివరించారు.

News May 9, 2024

కర్నూలు జిల్లాలో 11వ తేదీ నుంచి మద్యం దుకాణాలు బంద్

image

ఎన్నికల దృష్ట్యా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్/ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.సృజన సంబంధిత అధికారులను గురువారం ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. క్షేత్రస్థాయి అధికారులు మద్యంపై నిఘా ఉంచాలన్నారు.

News May 9, 2024

48 గంటల ముందు నుంచే మద్యం దుకాణాలు బంద్:  కలెక్టర్

image

ఎన్నికల దృష్ట్యా ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

News May 9, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షపాతం వివరాలు

image

ఎండలు, వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలు వర్షాలతో చల్లబడ్డారు. బుధవారం నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవగా.. కర్నూలు జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి. అవుకు మండలంలో 102.మి.మీ, చాగలమర్రి 76.4, శిరివెళ్ల 72, గడివేముల 65.2, బండి ఆత్మకూరు 64.2, వెలుగోడు 52.2, పాణ్యం 51.4, గూడూరు 39.6, తుగ్గలి 36, పత్తికొండ 15.2 మి.మీ వర్షపాతం నమోదైంది.

News May 9, 2024

గిరిజన విద్యార్థులకు జాతీయ ఓవర్సీస్ స్కాలర్షిప్

image

2024-25 విద్యా సంవత్స రానికి సంబంధించి గిరిజన విద్యార్థినీ, విద్యార్థుల ఉన్నత విద్యకు జాతీయ ఓవర్సీస్ స్కాలర్షిప్ అందిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి రంగ లక్ష్మిదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్కాలర్షిప్ పొందేందుకు మాస్టర్ లెవెల్ పీహెచ్ఏ, పోస్టు డాక్టరల్ రీసర్చ్ ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News May 9, 2024

కర్నూలులో వైఎస్ జగన్ నేటి పర్యటన షెడ్యూల్

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలుకు రానున్నారు. ఉదయం 10.15 గంటలకు విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు. 10.35 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. 10.55 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానం సమీపంలోని వైఎస్ఆర్ సర్కిర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని స్రసంగిస్తారు. 11.50 గంటలకు సభ ముగించుకుని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బయలుదేరుతారు.