Kurnool

News August 31, 2024

పండగలా పింఛన్ల పంపిణీ

image

ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటలకు కర్నూలు జిల్లాలో 92.58%, నంద్యాల జిల్లాలో 90.27% పంపిణీ పూర్తయింది. కర్నూలు జిల్లాలో 2,42,583 మందికి గానూ 2,24,583 మందికి, నంద్యాల జిల్లాలో 2,19,046 మందికి గానూ 1,97,730 మందికి పింఛన్ సొమ్మును అందజేశారు.

News August 31, 2024

పారా రోయింగ్‌ పోటీల్లో ప్యాపిలి యువకుడి ప్రతిభ

image

పారిస్‌లో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో కర్నూలు జిల్లా ప్యాపిలికి చెందిన అథ్లెట్ కొంగనపల్లి వెంకటనారాయణ సత్తా చాటారు. పారా రోయింగ్‌ పోటీల్లో రాజస్థాన్‌కు చెందిన అనితతో కలిసి బరిలోకి దిగారు. థాయిలాండ్, ఆస్ట్రేలియా, యూఎస్ఎ, ఉక్రెయిన్, ఫ్రాన్స్ తదితర దేశాలతో తలపడిన వారు ఐదో స్థానంలో నిలిచారు. రెండు కిలోమీటర్ల దూరాన్ని 8 నిమిషాల 6 సెకన్లలో చేరుకున్నారు. శనివారం మెక్సికోతో తలపడనున్నారు.

News August 31, 2024

సాక్షుల విచారణను తిరిగి తెరిచేలా ఆదేశించండి

image

నందికొట్కూరు మార్కెట్‌ యార్డు మాజీ వైస్‌ ఛైర్మన్‌ తెలుగు సాయిశ్వరుడి హత్య కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నిందితులైన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, కటిక చికెన్‌ బాషాల మధ్య జరిగిన ఫోన్‌ కాల్‌ వాయిస్‌ డేటా లభ్యమైందని, సాక్షుల విచారణను తిరిగి తెరవాలని కోరుతూ మృతుడి కుమార్తె జ్యోతి రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పూర్తిస్థాయి వాదనలకు సమయం లేకపోవడంతో కోర్టు విచారణను సెప్టెంబరు 5కు వాయిదా వేసింది.

News August 31, 2024

నేడు ఓర్వకల్లుకు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇలా

image

★ మధ్యాహ్నం 1.30 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరిక
★ 1.40 గంటలకు రోడ్డు మార్గం ద్వారా ఓర్వకల్లు గ్రామానికి బయలుదేరుతారు
★ 1.50కి ఓర్వకల్లు గ్రామానికి చేరుకుంటారు
★ 2 నుంచి 2.30 గంటల వరకు పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు
★ 2.30 నుంచి 3.30 వరకు గ్రామస్థులతో ముఖాముఖీ
★ 3:30 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి పయనం
★ 3:40కి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్తారు

News August 31, 2024

వైభవంగా తిరుచ్చి మహోత్సవం

image

బేతంచెర్ల మండల పరిధిలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా తిరుచ్చి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఉప కమిషనర్, ఈవో రామాంజనేయులు ఆధ్వర్యంలో వేద పండితులు కళ్యాణ్ చక్రవర్తి, అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని పల్లకిలో కొలువుంచి మంగళ వాయిద్యాలతో ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు.

News August 30, 2024

పత్తికొండ పర్యటన రద్దు.. ఓర్వకల్లుకు సీఎం

image

వర్షం కారణంగా పత్తికొండ పర్యటన రద్దు కావడంతో సీఎం చంద్రబాబు శనివారం ఓర్వకల్లులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్‌తో కలిసి కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం 1.50 గంటలకు సీఎం ఓర్వకల్లు గ్రామానికి చేరుకుని పింఛన్లు పంపిణీ చేస్తారు.

News August 30, 2024

సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన రద్దు

image

సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పత్తికొండ పర్యటన రద్దయింది. వర్షాలు పడుతుండటంతో ఈ పర్యటన రద్దయినట్లు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కా రెడ్డి తెలిపారు. కాగా రేపు నంద్యాల జిల్లాలోని ఓర్వకల్లు మండలంలో సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీలో పాల్గొంటారని సమాచారం.

News August 30, 2024

మొక్కలు నాటిండి: మంత్రి ఫరూక్

image

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాలలో వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నూతన మెడికల్ కాలేజ్ ఆవరణంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌లతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని భావితరాలకు ఆక్సిజన్ అందించేలా పెంచాలని అన్నారు.

News August 30, 2024

నీటి కుంటలను తలపిస్తున్న మహానంది క్షేత్రానికి వెళ్లే రహదారి

image

మహానంది పుణ్య క్షేత్రంలోని స్వామి అమ్మవార్ల దర్శనం కోసం ప్రతి నిత్యం భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. అయితే వ్యవసాయ కళాశాల నుంచి మహానంది పుణ్యక్షేత్రం వరకు ఉన్న 3 కిలోమీటర్ల మేర రహదారి భక్తులకు నరకయాతన అనుభవించే విధంగా అడుగుకో గుంతతో దర్శనమిస్తోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు చెరువులు, నీటి కుంటలను తలపిస్తున్నాయి.

News August 30, 2024

కర్నూలు: మిరపకాయల లోడు లారీ బోల్తా

image

పత్తికొండ నియోజకవర్గం అటికెలగుండులోని బస్టాండ్ సమీపాన కర్నూలు-బళ్లారి ప్రధాన రహదారిపై వేకువజామున బళ్లారికి ఒట్టి మిరపకాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. లారీ వేగంగా వెళ్తుండగా కుక్క అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేయడం వల్ల అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.