India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో మే 13వ తేదీన సజావుగా ఎన్నికలు నిర్వహించేలా పోలింగ్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన బుధవారం తెలిపారు. పోలింగ్ స్టేషన్‌లలో నిర్దేశించిన కనీస మౌలిక వసతుల ఏర్పాటు చేయడంతో పాటు వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల నియామకం, తగినంత పోలీసు బలగాలను నియమించిన అంశాలపై సమావేశాన్ని నిర్వహించారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు మే 12వ తేదిన వారికి కేటాయించిన నియోజకవర్గాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా రవాణా సదుపాయం కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా వారికి కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం స్వీప్ యాక్టివిటీ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై టోపీలను ఆవిష్కరించారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని తమకు నచ్చిన వారికి ఓటు వేసి జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచాలని అన్నారు.
కర్నూలు జిల్లాలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీస్ అధికారులపై ఎన్నికల పోలీస్ అబ్జర్వర్ ఉమేష్ కుమార్‌కి కర్నూలు టీడీపీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు. జిల్లాలో వైసీపీ నాయకులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆయన కోరారు. కర్నూలు ఎంపీ సంజీవ కుమార్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నంద్యాల నాగేంద్ర ఉన్నారు.
శ్రీశైలంలోని ఎస్టీ కాలనీలో గంజాయి విక్రయిస్తున్న బొడ్డపాటి మల్లికార్జున అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ జి.ప్రసాద్ రావు బుధవారం తెలిపారు. సమాచారం మేరకు తనిఖీలు చేయగా మల్లికార్జున వద్ద నుంచి 105 గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఏఎస్ఐ గురవయ్య, సుంకన్న, రఘునాథుడు, బాలకృష్ణ, మహేశ్, శివ మహేంద్ర రెడ్డి ఉన్నారు.
ఈనెల 9న వైసీపీ అధినేత వైఎస్ జగన్ కర్నూలుకు రానున్నట్లు జిల్లా అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ తెలిపారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో వైసీపీ నాయకుడు ఎస్వీ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్, రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డితో కలిసి ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. 9న వైఎస్సార్ సర్కిల్లో బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.
రాయలసీమ విశ్వవిద్యాలయ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలకు సంబంధించి బీటెక్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు వీసీ సుధీర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. గతేడాది డిసెంబరులో రెగ్యులర్ 1, 3, 5వ సెమిస్టర్లు, ఈ ఏడాది జనవరిలో జరిగిన అన్ని సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఫలితాల కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
NOTA గురించి అందరికీ తెలిసిందే. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు ఓటర్లు ఓటు వేయొద్దనుకుంటే NOTAకు వేయొచ్చు. ఈ అవకాశం 2013 నుంచి ఉండగా.. గత ఎన్నికల్లో బనగానపల్లె నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని ఎక్కువ మందే వినియోగించుకున్నారు. వరుసగా YCP (99,998), TDP (86,614), కాంగ్రెస్(2,166) ఓట్లు పడగా.. NOTAకు 1,628 ఓట్లు వేశారు. జనసేన పార్టీకి 1,512 ఓట్లు పోలయ్యాయి. మీరెపుడైనా నోటాకు ఓటేశారా?
మంత్రాలయం 145 నియోజకవర్గంలో కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోస్టర్ బ్యాలెట్ ఓటింగ్ రెండో రోజు కొనసాగింది. మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 222 నమోదు కాగా, హోమ్ ఓటింగ్ 12 నమోదు అయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో మంత్రాలయం తహశీల్దార్ పాల్గొన్నారు.
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం కర్నూలులోని జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్, ఎంపీ అభ్యర్థి రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్సీ మోహన్ రెడ్డితో కలిసి కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మరోసారి రాష్ట్రానికి జగన్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.