India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 16న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రచార యాత్రను ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్వహించనున్నారు. నంద్యాల జిల్లాలోని బ్రాహ్మణ కొట్టుకూరు నుంచి కోడుమూరు నియోజకవర్గంలోని గార్గేయపురంలోకి ప్రచార యాత్ర ప్రవేశిస్తుంది. అదే రోజు కర్నూలులో రోడ్ షో నిర్వహించిన అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారు. 17న పాణ్యం, డోన్ నియోజకవర్గాల్లో పర్యటించి, సాయంత్రం 6 గంటలకు కోడుమూరులో రోడ్ షో, బహిరంగ సభను నిర్వహిస్తారు.
దేవనకొండ మాజీ జడ్పీటీసీ సభ్యులు కోట్ల హరి చక్రపాణి రెడ్డి ఐదేళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఆలూరు నియోజకవర్గంలో ప్రాధాన్యత నెలకొంది. 12న తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. కోట్ల హరికి ఆలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
కర్నూలులో గురువారం రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. నగరంలోని ఆయా మసీదుల దగ్గరకు ముస్లింలు చేరుకొని ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని సమైక్యత భావాన్ని చాటుకున్నారు. రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో పాత సంతోష్ నగర్‌లోని కొత్త ఈద్గా వద్ద చిన్నారుల రంజాన్ ప్రార్థనలు పలువురిని ఆకట్టుకున్నాయి.
కల్లూరు మండలం చిన్నటేకూరులో ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ప్రభ లాగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రతి ఏడాది చెక్క రథంతో చేసి ప్రభ లాగేవారు. ఈ ఏడాది మాత్రం ఇందుకు భిన్నంగా ఇనుప రథంతో చేసిన ప్రభ లాగడంతో హైటెన్షన్ వైర్లు తగలి రథంపై ఉన్న సుమారు 17 మంది చిన్నారులు విద్యుత్ షాక్‌కు గురయ్యారు.
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర అనుసరణీయమని కలెక్టర్ డాక్టర్ జి.సృజన అన్నారు. గురువారం ఆయన జయంతిని పురస్కరించుకుని కర్నూలులోని శరీన్ నగర్‌లో ఉన్న పూలేతో పాటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు విశేష కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు.
బనగానపల్లె పట్టణంలోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైనట్లు బనగానపల్లె పోలీసులు వెల్లడించారు. చాగలమర్రి మండల కేంద్రానికి చెందిన జమాల్ బాషా(27) పని నిమిత్తం బైక్‌పై బనగానపల్లెకు వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో, ఎదురుగా వస్తున్న బైక్ ఈయన్ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో జమాల్ బాషా అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.
ఇంటర్ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. గత నెల 1 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలోని 69 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మొదటి సంవత్సరం 22,239, ద్వితీయ సంవత్సరం 25,173 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గత నెల18న ప్రారంభమైన మూల్యాంకనం అదేనెల 31వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఈనెల 4వ తేదీతో ఈ కార్యక్రమం ముగిసింది.
పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతుల ఏర్పాట్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సృజన నోడల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో పోలింగ్ రోజున కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలపై నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా 11 మండలాలకు చెందిన 264 మంది వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించినట్లు కలెక్టర్ డాక్టర్ సృజన బుధవారం తెలిపారు. అత్యధికంగా క్రిష్ణగిరి మండలంలో 59 మంది, మద్దికేర మండలంలో 48, వెల్దుర్తిలో 37, పత్తికొండలో 32, తుగ్గలిలో 23, ఆదోనిలో 5, అత్యల్పంగా ఆస్పరి, కర్నూలు మండలాలకు చెందిన వాలంటీర్లు రాజీనామా చేశారన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
ఇటీవల వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మహ్మద్ ఇక్బాల్ TDP తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇవాళ ఆయన TDPలో చేరారు. ఇక్బాల్ కు పసుపు కండువా కప్పి చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. కాగా అనంతపురం (D) హిందూపురం MLA టికెట్ ను CM జగన్ దీపికకు కేటాయించడంతో అసంతృప్తితో ఉన్న ఆయన YCPకి గుడ్ బై చెప్పారు.
Sorry, no posts matched your criteria.