Kurnool

News April 9, 2024

మద్యం అక్రమ రవాణాకు సహకరిస్తే ఉపేక్షించం: డీఐజీ హెచ్చరిక

image

మద్యం అక్రమ రవాణాదారులకు కొంతమంది సెబ్ సిబ్బంది సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, విచారణలో నిజమని తేలితే చర్యలు తప్పవని కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు హెచ్చరించారు. నుంచి కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల సెబ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. చెక్‌పోస్టులలో తనిఖీలు ముమ్మరం చేయడం ద్వారా మద్యం, డబ్బు, కానుకలు అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని సూచించారు.

News April 9, 2024

కర్నూలు సీపీఎం అభ్యర్థిగా గౌస్ దేశాయ్

image

ఇండియా కూటమిలో భాగంగా రాష్ట్రంలో సీపీఎం పోటీ చేసే 10 ఎమ్మెల్యే, ఒక లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను ఆపార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఇందులో భాగంగా కర్నూలు అభ్యర్థిగా డి.గౌస్ దేశాయ్‌కి టికెట్ కేటాయించింది. మరోవైపు వైసీపీ నుంచి ఇంతియాజ్ బరిలో ఉండగా.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా టీజీ భరత్ పోటీ చేస్తున్నారు.

News April 9, 2024

శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలకు 740 మంది పోలీసులు

image

శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా బందోబస్తు విధులకు సుమారు 740 మంది పోలీసులను నియమించినట్లు ఎస్పీ రఘువీరా రెడ్డి తెలిపారు. వీరిలో డీఎస్పీలు 9 మంది, సీఐలు 30, ఎస్సైలు 62, ఏఎస్సైలు 186, కానిస్టేబుళ్లు 247, మహిళా కానిస్టేబుళ్లు 44, హోమ్ గార్డులు 171 మందిని విధులకు నియమించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం మోపేలా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.

News April 9, 2024

ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గద్దల రాజు

image

పత్తికొండ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు గద్దల రాజు తెలిపారు. ఆదివారం పత్తికొండలో విలేకరులతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గం అభివృద్ధి చేయాలని తపనతో తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నానని అన్నారు. గతంలో అనేక పార్టీల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు.. మంత్రి పదవులు చేపట్టినా నియోజకవర్గం అభివృద్ధి నోచుకోలేదన్నారు. తాగు, సాగునీరు అందించడంలో స్థానిక ఎమ్మెల్యేలు విఫలమయ్యారన్నారు.

News April 9, 2024

ఉగాదికి చౌడేశ్వరి దేవి ఆలయం ముస్తాబు

image

ఉగాది ఉత్సవాలకు కల్లూరులోని శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయం ముస్తాబైంది. ఆలయాన్ని రంగు రంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ ఉత్సవాలకు కర్నూలు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉగాది రోజున బురదలో ఎద్దులు, గాడిదలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఇక్కడి విశేషం.

News April 9, 2024

కర్నూలు: ప్రేమ జంట ఆత్మహత్యకు ఇదే కారణమా?

image

మంత్రాలయం మండలంలోని తుంగభద్ర రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మండలంలోని రచ్చుమర్రికి చెందిన వెంకటేష్ (21), మంత్రాలయానికి చెందిన నందిని(18) గతేడాది నుంచి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం ఇరువురి తల్లిదండ్రులకు తెలుపగా వారు ఒప్పుకోలేదని రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

News April 9, 2024

నంద్యాల: వడగాల్పులపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్రీనివాసులు సూచించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధి కూలీలు ఎండ తీవ్రత పట్ల జాగ్రత్తగా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. ప్రధాన కూడళ్ళలో చలువ పందిళ్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసరమైన ప్రదేశాలలో వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

News April 8, 2024

తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నాం: కలెక్టర్

image

జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ డాక్టర్ సృజన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. సోమవారం తాగునీరు, ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా అంశాలపై అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

News April 8, 2024

భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: SP

image

శ్రీశైలం ఆలయంలో జరుగుతున్న ఉగాది మహోత్సవం ఏర్పాట్లను నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయన శ్రీశైలం ఆలయానికి చేరుకుని పోలీసు అధికారులు, సిబ్బందితో పలు అంశాలపై చర్చించారు. లక్షలాదిగా తరలివచ్చే కన్నడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్కింగ్ వద్ద విధులు చేపట్టేవారు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News April 8, 2024

ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గద్దల రాజ్

image

పత్తికొండ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు గద్దల రాజు తెలిపారు. ఆదివారం పత్తికొండలో విలేకరులతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గం అభివృద్ధి చేయాలని తపనతో తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నానని అన్నారు. గతంలో అనేక పార్టీల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు.. మంత్రి పదవులు చేపట్టినా నియోజకవర్గం అభివృద్ధి నోచుకోలేదన్నారు. తాగు, సాగునీరు అందించడంలో స్థానిక ఎమ్మెల్యేలు విఫలమయ్యారన్నారు.