India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 18న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని నంద్యాల కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు రూ.4.9 కోట్ల విలువైన నగదు, లిక్కర్ సీజ్ చేసినట్లు తెలిపారు. కోడ్ ఉల్లంఘించిన 22 మంది వాలంటీర్లను తొలగించినట్లు చెప్పారు. 47 మంది రెగ్యులర్ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.
సాధారణ ఎన్నికల్లో విభిన్న ప్రతిభావంతులకు పూర్తి స్థాయిలో ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికలకు సంబంధించి విభిన్న ప్రతిభావంతులు, 85 ఏళ్లు పైబడిన వారికి కల్పించాల్సిన ఓటు హక్కుపై సంబంధిత అధికారులు, విభిన్న ప్రతిభావంతుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
యువతీ(20), యువకుడు(25) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంత్రాలయం- ముచ్చుమర్రి (536/11-13) మధ్య టీబీ బ్రిడ్జి వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఈ మేరకు రైల్వే ఎస్ఐ గోపాల్ తెలిపారు. మృతదేహాలు వద్ద సైకిల్ తాళాలు తప్ప ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. తలలు పగిలి గుర్తుపట్టలేనంతగా ఉన్నాయన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సాధారణ ఎన్నికలకు సంబంధించిన వ్యయ పర్యవేక్షణపై బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.సృజన సమీక్ష నిర్వహించరు. ఆమె మాట్లాడుతూ.. బ్యాంకుల్లో పెద్దమెుత్తంలో డబ్బులు విత్ డ్రా, డిపాజిట్ చేసేవారిపై డేగకన్ను ఉంచాలన్నారు. అనుమానిత ఖాతాలో నగదు లావాదేవీలు గుర్తిస్తే తమ దృష్టికి తీసుకొని రావాలని అధికారులకు తెలిపారు.
ఆస్పరి మండలంలోని అన్ని గ్రామాల వాలంటీర్లు సోమవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. మండలంలో మొత్తం 302 మంది వాలంటీర్లు ఉండగా.. 200 మంది తమ రాజీనామాల పత్రాలను ఎంపీడీవోకు అందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ సేవలు అందిస్తుంటే.. పత్రిపక్ష పార్టీలకు చెందిన నేతలు తమను అవమానపరచడం సరికాదని అన్నారు. రాజీనామా అనంతరం జగన్మోహన్ రెడ్డి విజయం కోసం ఎన్నికల ప్రచారం చేస్తామని అన్నారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.సృజన హెచ్చరించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మార్చి 16 నుంచి ఇప్పటి వరకు 35మంది సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు ఆమె వెల్లడించారు. కోడ్ ఉల్లంఘించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలకంఠపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.
శ్రీశైలం డ్యాం దిగువన గల లింగాలగట్టు హై లెవెల్ పుష్కర ఘాట్ వద్ద సోమవారం ఉదయం ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందాడని మత్స్యకారులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ముగ్గురు మల్లన్న దర్శనార్థమై వచ్చి రద్దీ అధికంగా ఉండటంతో ఆలోగా కృష్ణానదిలో స్నానమాచరించేందుకు లింగాలగట్టుకు చేరుకున్నారు. ముగ్గురు నదిలో దిగి స్నానమాచరిస్తుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి నీట మునిగాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉగాది ఉత్సవాల్లో భాగంగా శ్రీశైలం క్షేత్రంలో నేటి సాయంత్రం ప్రభోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ పండితులు తెలిపారు. ఉత్సవం అనంతరం నంది వాహన సేవ ఉంటుందన్నారు. శ్రీ భ్రమరాంబికా దేవి అమ్మవారికి మహా సరస్వతి అలంకారం ఉంటుందని చెప్పారు. స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం, కళ్యాణోత్సవం, ఏకాంతసేవ పూజలు వైభవంగా జరుగుతాయన్నారు. రుద్రహోమం, చండీ హోమం పూజలు ఉంటాయని వివరించారు.
నంద్యాల పట్టణంలోని దేవనగర్ మసీదు సెంటర్‌లో సమీర్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. హత్యకు పాల్పడిన వారు అతి కిరాతకంగా సమీర్ గొంతు కోసి చంపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఉగాది మహోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో 3 రోజు సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రభోత్సవం నిర్వహిస్తారు. అలాగే స్వామి అమ్మవార్లకు నంది వాహనసేవ, శ్రీభ్రమరాంబా దేవికి మహా సరస్వతి అలంకార సేవ నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు వీరశైవుల వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. శివ దీక్షా శిబిరాల వద్ద నిర్వహించే వీరచార విన్యాస కార్యక్రమానికి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
Sorry, no posts matched your criteria.