India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదోని నియోజవర్గంలో 1952 నుంచి 2019 వరకు 15సార్లు ఎన్నికలు జరిగాయి. 1955లో జి.భూషన్న అనే పీఎస్పీ అభ్యర్థి ఎస్.ఎమ్. నిజాని(పీపీ) అభ్యర్థిపై 24 ఓట్ల అత్యల్ప మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2009లో టీడీపీ అభ్యర్థి కె.మీనాక్షినాయుడు కాంగ్రెస్ అభ్యర్థి వై.సాయిప్రసాద్ రెడ్డిపై 256 ఓట్ల తేడాతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.
దైవదర్శనానికి వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. కోవెలకుంట్లకు చెందిన రాణిబాయి(22) మండలంలోని భీమునిపాడు స్పెషల్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. అహోబిలేశుడిని దర్శించుకుని తమ్ముడు శ్రీధర్ నాయక్ బైక్‌లో వస్తున్నారు. ఈక్రమంలో చీర కొంగు బైక్ చక్రానికి చుట్టుకోవడంతో కిందపడి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసినట్లు ఎస్‌ఐ నగీన తెలిపారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తోందని కలెక్టర్, ఎన్నికల అధికారి డా. జి.సృజన ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కొరకు సర్వీసు ఓటర్లైతే నేరుగా సంబంధిత రిటర్నింగ్ అధికారి జారీ చేస్తారని, దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. స్పెషల్ ఓటర్లైతే కనీసం పోలింగ్ తేదీకి 10 రోజుల ముందు ఫార్మ్-12 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
పంచలింగాల చెక్ పోస్టు వద్ద పట్టుబడిన మద్యం కేసు వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి రవికుమార్ ఆదివారం వెల్లడించారు. కడప జిల్లా ఖాదర్ పల్లికి చెందిన నిందితులు రింగుల బాషా, హబీబుల్లా, సాదిక్, షేక్ షఫీపై కేసు నమోదు చేశామన్నారు. వారి వాహనంలో తనిఖీ చేయగా 240 బాక్సుల మద్యం బాటిళ్లు బయటపడ్డాయన్నారు. వాహనాన్ని, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. బాటిళ్ల విలువ రూ.14,51,520 ఉంటుందని తెలిపారు.
బండి ఆత్మకూరు మండలం ఈర్ణపాడులో భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్న ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ప్రొద్దుటూరుకు చెందిన సులోచనను ఈర్ణపాడుకు చెందిన శ్రీకాంత్ రెడ్డి 2017లో వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. గొడవల కారణంగా ఇరువురూ కోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు విడాకులు మంజూరు చేయకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడని పోలీసులకు సులోచన ఫిర్యాదు చేశారు.
ఆస్పరి మండలం కైరుప్పలలో ఉగాది తర్వాతి రోజు పిడకల సమరం జరుగుతుంది. త్రేతాయుగంలో భద్రకాళి దేవిని ప్రేమించి పెళ్లి చేసుకోకుండా వీరభద్ర స్వామి మోసం చేశారని అమ్మవారి భక్తులు నమ్మి ఆయనను పిడకలతో కొట్టాలని చూస్తారు. వీరభద్రుడిని అమ్మవారి ఆలయం వైపు వెళ్లొద్దని భక్తులు వేడుకున్నా.. అటువైపు వెళ్లడంతో ఆయనపై పిడకలతో దాడిచేశారు. స్వామివారి భక్తులు కూడా పిడకలతో అమ్మవారి భక్తులపై ఎదురుదాడికి దిగారని చెబుతుంటారు.
కర్నూలు పశుసంవర్ధక శాఖ, ఆరోగ్య సేవ వెటర్నరీ అంబులేటరీ సర్వీస్ (1962)లలో డ్రైవర్(పైలెట్) పోస్టులు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఖాళీగా ఉన్నాయని జీవీకే ఈఎంఆస్ఐ జిల్లా మేనేజర్ రామకృష్ణగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. డ్రైవర్ పోస్టులకు 10వ తరగతి చదివి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి, 36 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు www.ahd.gov.in సంప్రదించాలన్నారు.
రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను VCసుధీర్ ప్రేమ్కుమార్ ఆదేశాలతో విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెంకటేశ్వర్లు తెలిపారు. 3 సెమిస్టర్లో రెగ్యులర్ విద్యార్థులు 5,900 మందికిగాను 3,081 మంది, సప్లిమెంటరీ విద్యార్థులు 9,140 మందికి 4,182 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఫలితాలు rayalaseemauniversity.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.
ఆత్మకూరులో విద్యుత్ కంచె వేసి ఎలుగుబంటిని చంపిన నలుగురు వేటగాళ్లను అరెస్ట్ చేసినట్లు ఆత్మకూరు డీఎఫ్ఎ సాయిబాబా తెలిపారు. పట్టణ సమీపంలోని సూర్య గార్డెన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా వేటగాళ్లుగా బయటపడిందన్నారు. వారి నుంచి ఎలుగుబంటి తల, అవయవాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వేటగాళ్లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు .
కర్నూల్ అవుట్డోర్ స్టేడియంలో ఈనెల 13న ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయి లేజర్ రన్ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా మాడ్రన్ పెంటాథలాన్ సంఘం కార్యదర్శి అవినాష్ శెట్టి శనివారం తెలిపారు. జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులు ఈ నెల 20 నుంచి 21 వరకు నెల్లూరు జిల్లా కావలిలో జరగబోయే 8వ రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి కర్నూలు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు.
Sorry, no posts matched your criteria.